Megastar Chiranjeevi Shruti Haasan Movie: శృతిహాసన్ కు టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. గతంలో టాలీవుడ్ లో స్టార్ హీరోలందరితో సినిమాలు చేస్తూ బిజీగా ఉండేది. కానీ ఇప్పుడు బాలీవుడ్ కు చెక్కేయడంతో తెలుగులో సినిమాలు కొద్దిగా తగ్గాయి. కాగా మళ్లీ క్రాక్ లాంటి హిట్ మూవీతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. ఈ హిట్ తో ఇప్పుడు ఈ భామకు వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి.

నందమూరి నటసింహం బాలయ్యతో గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న మూవీ లో కూడా ఈ హాట్ బ్యూటీ హీరోయిన్ గా చేస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. క్రియేటివ్ డైరెక్టర్ బాబీ ఎంతో ప్రతిష్టాత్మకంగా వాల్తేరు వీరన్న సినిమాలు డైరెక్ట్ చేస్తున్నారు. ఈ మూవీపై చాలా అంచనాలు ఉన్నాయి. ఇక్కడ ఒక విషయం ఏంటంటే.. బాలయ్య మూవీని, చిరంజీవి మూవీని మైత్రి మూవీ మేకర్స్ తెరకెక్కిస్తున్నాయి.
Also Read: రివ్యూ : ‘రాధేశ్యామ్’
అయితే చిరంజీవి మూవీకి శృతిహాసన్ హీరోయిన్ అనగానే చాలా మంది షాక్ అయిపోయారు. ఒకప్పుడు యంగ్ స్టార్ హీరోలతో సినిమాలు చేసిన శృతిహాసన్.. ఇప్పుడు సీనియర్ హీరోల సరసన నటించడం ఏంటంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న వారు కూడా ఉన్నారు. యంగ్ హీరోల సినిమాల్లో ఛాన్సులు రాక ఇలా చేస్తుందంటున్నారు ఒక వర్గం ఫ్యాన్స్. ఈ విషయం పక్కన పెడితే చిరు మూవీకి శృతిహాసన్ భారీగా రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తోందట.

వాల్తేరు వీరన్న కోసం ఏకంగా రూ.2 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నట్టు టాలీవుడ్ లో హాట్ టాపిక్ వినిపిస్తోంది. ఇక్కడ మరో విషయం ఏంటంటే.. బాలయ్య మూవీ కోసం కోటిన్నర మాత్రమే తీసుకుంటున్న శృతిహాసన్.. చిరు మూవీకి ఇంతగా డిమాండ్ చేయడం ఏంటో అర్థం కావట్లేదు. పైగా ఈ రెండు మూవీలను నిర్మిస్తున్న సంస్థ కూడా ఒక్కటే. మొత్తానికి ఈ వార్త ఇప్పుడు నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది.
Also Read: రాధేశ్యామ్ వర్సెస్ పుష్ప వర్సెస్ భీమ్లానాయక్