BJP: ఏ కొంచెం ఛాన్స్ దొరికినా సరే సంబంధం లేని విషయాలను తెరమీదకు తీసుకు వచ్చి అప్పుడప్పుడు నోరుజారుతుంటారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. ఇలా ఆయన నోటి దూకుడు వల్ల చాలా సార్లు పార్టీ ఇబ్బందుల్లో పడిపోయింది. ఆయా ప్రాంతాలను అవమానించినట్టు మాట్లాడటం వల్ల.. పార్టీలో ఉన్న ఆ ప్రాంతాల లీడర్లే ఆయనకు వ్యతిరేకంగా తయారవుతున్నారు. ఈ విషయాలు కాస్తా హై కమాండ్ దాకా వెళ్లడంతో చివరకు ఆయనకు క్లాస్ పీకారంట.
దీంతో ఆయన ప్రతి విషయంలో కూడా ఆచి తూచి వ్యవహరించాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. ఇక నుంచి మాట్లాడే ప్రతి మాట చాలా జాగ్రత్తగా మాట్లాడాలని అనుకుంటున్నారు. అంతే కాకుండా ప్రజల కోసం పనిచేస్తున్నామనే భావన తీసుకు వచ్చేందుకు ఉత్తరాంధ్ర మీద ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగానే విశాఖకు స్వయంగా వెళ్లి ఉత్తరాంధ్ర జిల్లాల బీజేపీ నేతలతో జూమ్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆయా జిల్లాల్లో అభివృద్ధి పనులతో పాటు ఇతర పనులను అడిగి తెలుసుకున్నారు.
అయితే నీటి ప్రాజెక్టుల నిర్మాణం ఎలా ఉంది, ఇతర కట్టడాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఇందులో ఆయనకు ఓ అస్త్రం దొరికేసినట్టు అయింది. నీటి ప్రాజెక్టులు నత్త నడకన సాగుతన్నాయని చెప్పడంతో.. వాటి మీద పోరు బాట పట్టాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. ఇలా ప్రాజెక్టులు లేట్ కావడం వల్లే ఇక్కడి రైతులు పంటలు పండించుకోలేక ఇతర ప్రాంతాలకు వలస పోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Also Read: BJP: ఎంత పనైపాయె.. మోడీ వల్ల తలలు పట్టుకుంటున్న రాష్ట్ర బీజేపీ.. ఏకిపారేస్తున్న టీఆర్ ఎస్..
వీటి మీద ఉద్యమం చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకు రావాలని సోము ఎజెండా సెట్ చేశారు. ఉత్తరాంధ్రలో ఇప్పుడున్న పెండింగ్ ప్రాజెక్టులు కంప్లీట్ చేస్తే దాదాపు 5 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని ఆయన ఇదే విషయాన్ని తమ ఉద్యమంలో ప్రజలకు వివరించాలని అనుకుంటున్నారు. త్వరలోనే వీటి మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలని నిర్ణయం తీసుకున్నారంట. ఇన్ని రోజులు కేవలం ప్రెస్ మీట్లకే పరిమితం అయిన సోము.. ఇలాంటి నిర్ణయం తీసుకోవడం మంచిదే.
ఎందుకంటే పోరాడ పటిమనే ఏ పార్టీకి అయినా ప్రజల్లో మంచి గుర్తింపు తీసుకు వస్తుంది. ఇన్ని రోజులకు బీజేపీ సొంతంగా ఒక ఎజెండాను తీసుకుంది. అయితే ఈ విషయంలో జనసేనను కలుపుకుని పోతారా.. లేదంటే ఒంటరిగానే పోరాటం చేస్తారా అన్నది తెలియరాలేదు. ఒకవేళ జనసేన వచ్చినా.. ఆ క్రెడిట్ మొత్తం తమ ఖాతాలో పడే విధంగా బీజేపీ నేతలు ప్లాన్ చేసుకుంటారు. ఈ విషయం పవన్‌కు తెలియంది కాదు. అందుకే ఆయన ఏ నిర్ణయం అంత ఈజీగా తీసుకోరు. చూడాలి మరి పవన్ ఏం అంటారో.
Also Read: UP Election BJP Manifesto: లవ్ జిహాదీలకు పదేళ్ల శిక్షః యూపీలో బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల