Allu Arjun: బన్నీ అంటే ఇప్పుడు ఐకాన్ స్టార్ అని దేశం మొత్తం గుర్తు పట్టే స్థాయిలో ఉన్నాడు. తాజాగా పుష్ప మూవీతో ప్యాన్ ఇండియా స్టార్ గా అవతరించాడు. ఇదంతా నానానికి ఒకవైపు మాత్రమే.

అంటే బన్ని కెరీర్‌లో ఇప్పుడున్న స్టార్ డమ్‌కు ముందు అంటే కెరీర్ తొలినాళ్లలో చాలా అవమానాలు ఎదుర్కొన్నాడు. అనితర కష్ట సాధ్యమైన పనులను చేసి చూపించి అవహేళన చేసిన వారితోనే హీరో అంటే ఇలాగే ఉండాలి అనుకునే రేంజ్‌కు ఎదిగాడు.

అల్లు అర్జున్ మొదటి సినిమా గంగోత్రి వచ్చినప్పుడు.. అసలు ఇతను హీరోనేనా అని చాలామంది ట్రోల్ చేశారు. అతని రూపం మీద కూడా పెద్ద రూమర్లు క్రియేట్ చేశారు. తండ్రి పెద్ద నిర్మాత కాబట్టి సినిమాల్లో హీరో అయ్యాడు గానీ.. లేకుంటే ఇతను హీరో ఏంటి అని ఇండస్ట్రీలోనే చాలా ట్రోల్స్ వినిపించాయి. అయితే వీటితో బన్నీ కుంగిపోలేదు. తనను తాను ప్రూవ్ చేసుకునేందుకు ప్రతిక్షణం కష్టపడ్డాడు. డ్యాన్స్, యాక్టింగ్ లో పర్ పెక్ట్ అనిపించుకునేందుకు నిత్య విద్యార్థి లాగా హార్డ్ వర్క్ చేస్తూనే ఉన్నాడు.
చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. బన్నీ రెండేళ్ల వయసప్పుడే చిరంజీవి మూవీలో నటించాడు. తనకు పదేళ్లు వచ్చినప్పటి నుంచి చిరంజీవి డ్యాన్సులు చూస్తూ.. అలాగే డ్యాన్సులు చేయడం మొదలు పెట్టాడు. డ్యాన్స్ మీద బన్నీకి విపరీతమైన ఇష్టం ఉండటంతో అరవింద్ అందులో ప్రత్యేక శిక్షణ ఇప్పించాడు. దీంతో బన్నీ స్టైలిష్ డ్యాన్సర్‌గా ఎదిగాడు. అయితే మొదటి సినిమా గంగోత్రి హిట్ అయినా కూడా.. ఇంకా ఏదో నేర్చుకోవాలని బన్నీ అనుకున్నాడు.

లుక్ పరంగా ఇంప్రూవ్ కావాలని మూడు నెలల విపరీతంగా కష్టపడ్డాడు. ఆ తర్వాత వచ్చిన ఆర్య మూవీలో డిఫరెంట్ లుక్ లో కనిపించి అందరినీ మెస్మరైజ్ చేశాడు. ఇక అక్కడి నుంచి వెనుదిరిగి చూసుకోలేదు. ప్రతి సినిమాలో తనకు డిఫరెంట్ లుక్ ఉండేలా చూసుకున్నాడు. దేశ ముదురు మూవీలో ఏకంగా సిక్స్ ప్యాక్ తో అలరించాడు. ఇలా యూత్‌కు బాగా కనెక్ట్ అయిపోయాడు.

అయితే ఎన్ని సినిమాలు చేసినా స్టార్ స్టేటస్ మాత్రం రాలేదు. కాగా జులాయితో త్రివిక్రమ్ ఆ లోటును తీర్చాడు. ఈ మూవీ బన్నీ కెరీర్ లోనే మొదటి సారి రూ.40 కోట్లు వసూలు చేసింది. ఇక దీని తర్వాత బన్నీ కెరీర్‌ను మార్చిన మూవీ రేసుగుర్రం. మొదటి సారి రూ.50 కోట్లు వసూలు చేసింది బన్నీ కెరీర్ లో. దీని తర్వాత వచ్చిన s/o సత్యమూర్తి కూడా 50కోట్ల క్లబ్ లో చేరింది.
Also Read: వాటిల్లో కూడా మెగాస్టార్ రీఎంట్రీ ఖరారు !
దాంతో బన్నీ స్టార్ హీరోగా మారిపోయాడు. ఇక ఇన్ని చేసినా మాస్ ఫాలోయింగ్ లో కొంత వెనకబడ్డాడు. అయితే సరైనోడు మూవీతో ఆ లోటును కూడా పూడ్చేశాడు. ఈ మూవీ ఏకంగా రూ.100 కోట్లు వసూలు చేసింది. దీని తర్వాత అల వైకుంఠపురం మూవీ బన్నీ రేంజ్ ను పెంచేసింది. ఏకంగా నాన్ బాహుబలి రికార్డ్ ను నెలకొల్పింది. దాదాపు రూ.200 కోట్లు వసూలు చేసి సంచలనం సృష్టించింది.
ఇక మొన్న వచ్చిన పుష్ప మూవీతో అయితే ఏకంగా ప్యాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు బన్నీ. నటన పరంగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది ఈ మూవీ. ఈ మూవీ మొత్తం బన్నీ మ్యాజిక్ మాత్రమే కనిపించింది. ఒంటి చేత్తో సినిమాను బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేలా చేశాడు బన్నీ. అలా ఇతను హీరోనా అనే స్థాయి నుంచి హార్డ్ వర్క్ చేసి హీరో అంటే ఇలాగే ఉండాలనే స్థాయికి ఈ రోజు ఎదిగాడు బన్నీ. అంటే కుటుంబం నుంచి ఎంత సపోర్టు వచ్చినా.. తనకు తాను నిరూపించుకోకపోతే ఎవరూ పెద్ద హీరో అవరు అనే దానికి బన్నీనే ఉదాహరణ.
Also Read: చరణ్ – శంకర్ సినిమాకి కథ ఇచ్చింది ఆ స్టార్ డైరెక్టరే !

[…] Also Read: ఇతను హీరోనా అని ఎగతాళి చేశారు.. కట్… […]