Kajal Aggarwal: టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ గర్భవతి అయిన సంగతి తెలిసిందే. అయితే, ఈ హీరోయిన్ తన కడుపును దాచడానికి ఇన్నాళ్లు నానాపాట్లు పడింది. కానీ నెలలు గడిచిపోతున్నాయి. ఇక దాచినా దాగేలా లేదు కాజల్ బేబీ బంప్. అందుకే, గర్భవతిగా ఉన్న కాజల్ అగర్వాల్ తన బేబీ బంప్ ఫోటోను రీసెంట్ గా అభిమానులతో పంచుకుంది. దాంతో ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ముఖ్యంగా బ్లాక్ డ్రెస్ లో కాజల్ అగర్వాల్ కూర్చున్న ఆ ఫోటోలో బేబీ బంప్ స్పష్టంగా కనిపించింది. అలాగే, ప్రెగ్నెన్సీ కారణంగా కాజల్ బాగా లావుగా కూడా కనిపిస్తుంది. దీంతో ప్రెగ్నెంట్ గా ఉన్న కాజల్ అగర్వాల్ పై కొంతమంది ఆకతాయిలు నెట్టింట్లో ట్రోల్ చేస్తూ అసభ్యకరంగా మెసేజ్ లు పోస్ట్ చేస్తున్నారు. కాజల్ ఆంటీ అని ఒకరు, కాజల్ అగర్వాల్ తన కడుపును దాచుకుంటుంది అని మరొకరు.. కాజల్ ఫిజిక్ చెడిపోయింది అని ఇంకొకరు.. ఇలా ఇష్టం వచ్చినట్లు కామెంట్లు పెడుతున్నారు.

Also Read: ఇతను హీరోనా అని ఎగతాళి చేశారు.. కట్ చేస్తే ఐకాన్ స్టార్ గా ఎదిగి చూపించాడు..!
కాగా తన గురించి బ్యాడ్ గా కామెంట్లు పెడుతున్న వారి గురించి కాజల్ స్పందించింది. ‘నాపై బాడీ షేమింగ్ చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. నేను నా శరీరంలో, నా జీవితంలో కలిగిన మార్పులను ఎంజాయ్ చేస్తున్నా. అర్థం చేసుకోలేని మూర్ఖుల కోసం చెబుతున్నా. గర్భవతి అయ్యాక హార్మోనుల వల్ల శరీరంలో మార్పులు జరుగుతాయి. ఫలితంగా బరువు పెరగటం సహజం’ అని కామెంట్ చేసేవారికి కౌంటర్ ఇచ్చింది.
ఇక కాజల్ తాను గర్భవతి అని తెలిసాక సినిమాల్ని పక్కన పెట్టింది. 2022 ఏడాది తమకు చాలా ప్రత్యేకమైందని తన జీవితంలోకి మూడో వ్యక్తిని ఆహ్వానిస్తున్నామని కాజల్ చాలా సంతోషంగా కూడా ఉంది. మొత్తానికి కాజల్ బేబీ బంప్ తో చాలా హ్యాపీగా ఉన్నాను అని చాలా గర్వంగా చెబుతోంది. పైగా కాజల్ అగర్వాల్ బేబీ బంప్స్ పై చెయ్యేస్తూ ఒక ఫోటోకి ఫోజు ఇచ్చి, ఆ ఫోటోను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
Also Read: వాటిల్లో కూడా మెగాస్టార్ రీఎంట్రీ ఖరారు !