Homeజాతీయ వార్తలుKCR Delhi Tour: కేసీఆర్ ఢిల్లీ టూర్ పై బీజేపీ ఫుల్ హ్యాపీ

KCR Delhi Tour: కేసీఆర్ ఢిల్లీ టూర్ పై బీజేపీ ఫుల్ హ్యాపీ

KCR Delhi Tour: ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం, రాష్ర్ట ప్రభుత్వానికి మధ్య అగాధం పెరిగిపోతోంది. దీంతో రైతుల సమస్యలు తీరడం లేదు. ధాన్యం కొనుగోలులో వేగం పెరగడం లేదు ఫలితంగా కల్లాల్లోనే ధాన్యం తడిసిపోతోంది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ మంత్రుల బృందంతో ఢిల్లీ వెళ్లి ప్రధాని, హోంమంత్రి, ఇతర మంత్రులను కలిసి తాడోపేడో తేల్చుకుంటానని చెప్పి ఢిల్లీ వెళ్లి అక్కడ ఎవరిని కలవకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎవరి అపాయింట్ మెంట్ కూడా లభించకపోవడం విమర్శలకు దారి తీస్తోంది.

KCR Delhi tour
KCR Delhi tour

కేసీఆర్ పర్యటన అధికారికమా? వ్యక్తిగతమా? అనే సందేహాలు అందరిలో వస్తున్నాయి. అసలు అక్కడ ఆయన ఎవరిని కలవకపోవడం సంచలనంగా మారింది. ప్రతిపక్షాలు మాత్రం ఆయన భార్యను ఆస్పత్రిలో చూపించడానికి ఢిల్లీ వెళ్లారని చెబుతున్నారు. దీనిపై టీఆర్ఎస్ నేతలు కూడా పెదవి విప్పకపోవడం దీనికి ఊతం పోస్తోంది. దీంతో టీఆర్ఎస్ నేతలపై బహిరంగంగానే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

రాష్ర్ట మంత్రులు కేటీఆర్ బృందం వ్యవసాయ శాఖ మంత్రితో సమావేశం జరిపినా స్పష్టమైన హామీ మాత్రం తీసుకోలేకపోయారు. దీంతో వారి పర్యటన అంతా వృథా అనే విషయం తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇక్కడ తిడుతూ అక్కడకెళ్లి అడగడమెందుకు అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. అయినా ఇక్కడ మాత్రం కేంద్రంతో ఏదో ఒకటి తేలుస్తామని గాంభీర్యం ప్రకటించి అక్కడకెళ్లి పిల్లిలా వ్యవహరించడమెందుకు అనే వాదనలు సైతం వినిపిస్తున్నాయి.

Also Read: Chandrababu Naidu Jr NTR: బాబూ… ఎన్టీఆర్ కి క్షమాపణలు చెప్పు… నేషనల్ వైడ్ ఇదే హాట్ టాపిక్

దీనిపై రాష్ర్ట బీజేపీ నేతలు మాత్రం సంతోషపడుతున్నారు. ఒకవేళ కేసీఆర్ ప్రధాని, అమిత్ షాతో భేటీ అయితే రాష్ర్ట నేతలకు వేరే సంకేతాలు వచ్చేవని చెబుతున్నారు. కేంద్రంపై విమర్శలు చేస్తున్న ఫలితంగానే వీరికి వారి అపాయింట్ మెంట్ దొరకలేదని తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి దొరికిన అపాయింట్ మెంట్ మన కేసీఆర్ కు మాత్రం దొరకకపోవడమేమిటనే ప్రశ్నలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీపై బీజేపీకి ఆగ్రహం పెరుగుతుందని తెలుస్తోంది.

Also Read: Jr NTR: టీడీపీ నేతలకు జూ.ఎన్టీఆర్ ఎందుకు టార్గెట్ అయ్యారు? అసలు కథేంటి?

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Exit mobile version