https://oktelugu.com/

PM Kisan Scheme: రోజుకు రూ.2 పొదుపుతో రూ.36 వేలు మీ సొంతం.. ఎలా అంటే?

PM Kisan Scheme: కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంతో ఎన్నో పథకాలను అమలు చేస్తోంది. కేంద్రం అమలు చేస్తున్న స్కీమ్స్ లో పీఎం శ్రమ యోగి మాన్ ధన్ యోజన కూడా ఒకటి కాగా ఈ స్కీమ్ లో చేరడం ద్వారా నెలకు కేవలం 55 రూపాయలు చెల్లించి 60 సంవత్సరాల తర్వాత 3,000 రూపాయల పెన్షన్ ను పొందవచ్చు. అసంఘటిత రంగంలోని కార్మికులకు ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంతో కేంద్రం ఈ స్కీమ్ ను […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 26, 2021 11:46 am
    Follow us on

    PM Kisan Scheme: కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంతో ఎన్నో పథకాలను అమలు చేస్తోంది. కేంద్రం అమలు చేస్తున్న స్కీమ్స్ లో పీఎం శ్రమ యోగి మాన్ ధన్ యోజన కూడా ఒకటి కాగా ఈ స్కీమ్ లో చేరడం ద్వారా నెలకు కేవలం 55 రూపాయలు చెల్లించి 60 సంవత్సరాల తర్వాత 3,000 రూపాయల పెన్షన్ ను పొందవచ్చు. అసంఘటిత రంగంలోని కార్మికులకు ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంతో కేంద్రం ఈ స్కీమ్ ను అమలు చేస్తోంది.

    PM Kisan Scheme

    PM Kisan Scheme

    18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లకు ఈ స్కీమ్ ద్వారా మేలు జరుగుతుంది. వయస్సు ప్రాతిపదికన ఈ స్కీమ్ కు డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. సమీపంలోని బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించి ఈ స్కీమ్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. 18 సంవత్సరాల వయస్సు ఉన్నవాళ్లు నెలకు కేవలం 55 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది.

    Also Read: దీదితో మోడీ చ‌ర్చ‌లు.. కేసీఆర్‌కు దొర‌క‌ని పీఎం అపాయింట్‌మెంట్

    ఈ స్కీమ్ లో చేరాలని భావించే వాళ్లకు బ్యాంక్ అకౌంట్ బుక్ తో పాటు ఆధార్ కార్డ్ కచ్చితంగా ఉండాలి. 18 సంవత్సరాల వయస్సు వాళ్లు రోజుకు కేవలం 2 రూపాయల చొప్పున పొదుపు చేసినా 60 సంవత్సరాల తర్వాత ఎక్కువ మొత్తం పెన్షన్ ను పొందవచ్చు. చాలామంది అవగాహన లేకపోవడం వల్ల ఈ స్కీమ్ లో చేరడానికి ఎక్కువగా ఆసక్తి చూపడం లేదు. ఈ స్కీమ్ లో చేరడం ద్వారా ఎన్నో బెనిఫిట్స్ ను పొందవచ్చు.

    బ్యాంకు అధికారులను సంప్రదించడం ద్వారా స్కీమ్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

    Also Read: ఉద్యోగుల జీతాలను సంస్థలు రహస్యంగా ఎందుకు ఉంచుతాయి?