Reporter crypto currency scam : మనం అనే కథనాలలో చెప్పుకున్నాం కదా.. ఆ పెద్ద పత్రిక విలేకరి దందా ఒక రేంజ్ లో ఉందని.. అతడి ఈ చీకటి దందాకు ఆ పత్రిక జిల్లా కార్యాలయంలో పనిచేసే పెద్ద తలకాయల సపోర్టు ఉందని.. అది ఇప్పుడు నిజమైంది. పోలీసులకు విచారణలో తేటతెల్లమైంది. పోలీసులు ఈ విషయాన్ని బయటకు చెప్పకపోయినప్పటికీ.. ప్రస్తుతం ఆ విలేఖరిని విచారిస్తున్న సైబర్ క్రైమ్ పోలీసులు ఇప్పటికే ఆ పత్రిక మేనేజ్మెంట్ కు కీలక విషయాలు వెల్లడించారట. అయితే ఆ విలేకరి వల్ల.. అక్కడికి సహకరించిన వారి వల్ల పత్రిక పరువు పోతుందని భావించిన మేనేజ్మెంట్.. విచారణను పారదర్శకంగా నిర్వహించాలని సూచించారట. ఇంకా ఏమైనా కీలక వివరాలు తెలిస్తే తమకు తెలియజేయాలని చెప్పారట. దీంతో పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారట. కేవలం ఆ జిల్లా మాత్రమే కాకుండా.. మహారాష్ట్ర, చత్తీస్ గడ్ రాష్ట్రాలలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారట. మొత్తంగా చూస్తే ఈ వ్యవహారంలో ఇంకా కీలక విషయాలు వెలుగు చూసే అవకాశం కనిపిస్తోంది.
Also Read: ఇద్దరూ ఇద్దరే.. గవర్నర్ల నియామకంలో ‘ఉత్తరాంధ్ర’ మార్క్!
ఈ విలేకరి దందాలో ఆ జిల్లా పెద్ద తలకాయలను పత్రిక మేనేజ్మెంట్ హైదరాబాద్ రావాలని పిలిచిందట. అడ్డగోలు సంపాదనకు అలవాటు పడిన ఆ పెద్ద తలకాయలు ఆ జిల్లాలోని ఒక మంత్రిని మాట సహాయం చేయాలని కోరితే ఆయన తిరస్కరించారట.. పైగా ఇటువంటి వ్యవహారాలలో నన్ను ఇన్వాల్వ్ చేయొద్దని ఆయన కరాఖండిగా చెప్పారట. ఆ జిల్లాలోని ఓ మంత్రికి.. పత్రిక అధినేతకు దగ్గర సంబంధాలు ఉన్నాయి. దీంతో అలా నరుక్కు రావాలని ఆ పెద్ద తలకాయలుకున్నాయి. కానీ ప్రారంభంలోనే మంత్రి హెచ్చరిక జారీ చేయడంతో ఆ పెద్ద తలకాయలు తర్జనభర్జనలో పడ్డాయి. ఆ పెద్ద తలకాయలు సంవత్సరాలకు సంవత్సరాలుగా ఆ జిల్లాలో పాతుకుపోయాయి. దండిగా సంపాదించాయి. పైగా ఈ విలేకరితో దగ్గర సంబంధాలు ఏర్పరచుకొని అడ్డగోలు దందాలు కూడా చేశాయి. ఈ వ్యవహారంలో ఒక్కొక్కరు భారీగానే వెనకేసుకున్నట్టు తెలుస్తోంది..
Also Read:అమెరికాలో రూ.32 లక్షలు, ఇండియాలో రూ.68 లక్షలు.. ఇదేం దోపిడీ ‘మస్క్’
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఆ జిల్లా కార్యాలయంలో పనిచేసే పెద్ద తలకాయ బ్యాంకు ఖాతాకు ఆ విలేకరి భారీ మొత్తంలో నగదు బదిలీ చేశారట. ఇంకో వ్యక్తికి కూడా అదే స్థాయిలో నగదు బట్వాడ చేశారట. ఇక నేపథ్యంలో ఆ లావాదేవీలను సైబర్ క్రైమ్ పోలీసులు ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ లావాదేవీలకు సంబంధించి బ్యాంకుల దగ్గర నుంచి వివరాలు కూడా సేకరించారు. మొత్తంగా చూస్తే వారు కూడా ఈ పాపంలో భాగస్వాములని పోలీసులు నిరూపించే పనిలో పడ్డారు. రోజుల వ్యవధిలోనే దీనిని పూర్తిచేస్తామని పోలీసులు అంటున్నారు. పోలీసులు గనక పని చేస్తే పెద్ద తలకాయల పోస్టులు ఊస్ట్ అవ్వడం ఖాయమని ఆ పత్రికలో పనిచేసే కిందిస్థాయి సిబ్బంది అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. సంస్థ నుంచి వెళ్ళిపోతే పీడా విరగడవుతుందని భావిస్తున్నారు.