Homeజాతీయ వార్తలుNew Goa Governor: ఇద్దరూ ఇద్దరే.. గవర్నర్ల నియామకంలో 'ఉత్తరాంధ్ర' మార్క్!

New Goa Governor: ఇద్దరూ ఇద్దరే.. గవర్నర్ల నియామకంలో ‘ఉత్తరాంధ్ర’ మార్క్!

New Goa Governor: ఉత్తరాంధ్రకు( North Andhra ) అరుదైన గౌరవం దక్కింది. విజయనగరం సంస్థానాధిశుడు, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు గవర్నర్గా నియమితులయ్యారు. సాధారణంగా గవర్నర్లుగా పనిచేసే అవకాశం కొంతమందికి మాత్రమే లభిస్తుంది. సాధారణంగా రాజకీయాల్లో ఉన్నవారు, అన్ని పదవులు అనుభవించిన వారు.. గౌరవప్రదమైన పదవీ విరమణ కోరుకుంటారు. అటువంటి వారు ఎక్కువగా రాజ్యాంగబద్ధ పదవి అయిన గవర్నర్ పదవి చేపట్టాలని భావిస్తుంటారు. ప్రస్తుతం యాక్టివ్ రాజకీయాలకు దూరంగా ఉన్నారు అశోక్ గజపతిరాజు. ఆయన చేయని పదవి అంటూ లేదు. ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా,కేంద్ర మంత్రిగా దాదాపు అన్ని పదవులు నిర్వర్తించారు. ఇప్పుడు గవర్నర్ బాధ్యతలు చేపట్టనున్నారు.

బిజెపి ద్వారా ఎంట్రీ
ఉత్తరాంధ్రలో మొదటిగా గవర్నర్గా పదవి చేపట్టినది మాత్రం కంభంపాటి హరిబాబు( Kambam paty haribabu) . హరిబాబు ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకోవడానికి వచ్చి.. అక్కడే అధ్యాపకుడిగా పనిచేశారు. తెన్నేటి విశ్వనాథం, సర్దార్ గౌతు లచ్చన్న, వెంకయ్య నాయుడుల పరిచయంతో రాజకీయాల్లోకి వచ్చారు. బిజెపిలో కీలకంగా పని చేశారు. 1999లో విశాఖ 1 నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. 2014లో బిజెపి అభ్యర్థిగా విశాఖ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేశారు. జగన్ తల్లి విజయమ్మ పై విజయం సాధించారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు గాను కొనసాగారు. 2021 జూలై 19న ఆయనను గవర్నర్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రస్తుతం ఆయన ఒడిస్సా గవర్నర్ గా నియమితులు అయ్యారు.

Also Read: AP Alcohol Permit Rooms: ఏపీలో మందుబాబులకు గుడ్ న్యూస్!

టిడిపికి ప్రాధాన్యం..
తాజాగా గవర్నర్ నియామకంలో తెలుగుదేశం( Telugu Desam) పార్టీకి ప్రాధాన్యం ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఎన్డీఏ భాగస్వామ్య పక్షం కావడంతో తెలుగుదేశం పార్టీకి ఈ అవకాశం దక్కింది. ప్రస్తుతం ఎన్డీఏలో బిజెపి తర్వాత అతిపెద్ద పార్టీ టిడిపి. అందుకే మిత్రులు తెలుగుదేశం పార్టీకి ఈ అవకాశం కల్పించారు బిజెపి పెద్దలు. ఐదేళ్లపాటు అశోక్ గజపతిరాజు గవర్నర్ పదవిలో కొనసాగుతారు. అశోక్ నియామకంపై టిడిపి కూటమి శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. ఉత్తరాంధ్ర నుంచి గవర్నర్గా ఎంపికైన రెండో వ్యక్తిగా అశోక్ గజపతిరాజు గుర్తింపు సాధించారు. అశోక్ గజపతిరాజు వివాద రహితుడు. ఆపై అవినీతి మరకలేని వ్యక్తి. కంభంపాటి హరిబాబు సైతం మృదుస్వభావి, బిజెపిలో అంచలంచెలుగా ఎదుగుతూ ఈ స్థాయికి వచ్చారు. ఈ ఇద్దరు వ్యక్తులు రాజ్యాంగబద్ధ పదవి అయిన గవర్నర్ గా నియమితులై ఉత్తరాంధ్రాకు వన్నె తెచ్చారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular