Pakistan : మనతోపాటు స్వాతంత్య్రం పొంది.. మన దేశం నుంచి విడిపోయిన దేశం పాకిస్తాన్. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా.. ఇప్పటికీ భారత్, పాకిస్తాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. భారత్‌లో అశాంతి రగిల్చేలా పాకిస్తాన్ ఇప్పటికీ కుట్రలు చేస్తోంది. చొరబాట్లను ప్రోత్సహిస్తోంది. ఐసిస్ కూడా తీవ్రవాదులను ప్రోత్సహిస్తోంది. భాకతఃలో అశాంతి, గొడవలను ప్రోత్సహిస్తోంది. దీంతో సీమాంతర ఉగ్రవాదం ఆగడం లేదు. ఇక నరేంద్రమోదీ 2016 నవంబర్‌లో చేసిన పెద్ద నోట్ల రద్దుతో పాకిస్తాన్ ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఉగ్రవాదులు కూడా సైలెంట్ అయ్యారు. అయితే ఇటీవలే కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడడంతో పాకిస్తాన్ మళ్లీ అల్లర్లకు ప్లాన్ చేస్తోంది. ఇక పాకిస్తాన్ దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే మెరుగైన భద్రత, హెూలోగ్రామ్ ఫీచర్ కోసం ఇప్పటికే ఉన్న అన్ని కరెన్సీ నోట్లను రీడిజైన్ చేస్తూనే పాకిస్తాన్, సెంట్రల్ బ్యాంక్ పాలిమర్ ప్లాస్టిక్ కరెన్సీ నోటుతో ప్రయోగాలు చేస్తుంది.
ప్లాస్టిక్ కరెన్సీ..
ఇదిలా ఉంటే.. ఇస్లామాబాద్ లోని బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ సెనేట్ కమిటీలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ గవర్నర్ జమీల్ అహ్మద్ మాట్లాడుతూ.. ఈ ఏడాది డిసెంబర్ నాటికి ప్రస్తుతమున్న అన్ని పేపర్ కరెన్సీ నోట్లను కొత్త భద్రతా ఫీచర్లతో రీడిజైన్ చేయనున్నట్లు తెలిపారు. రూ.10,50,100, 500, 1000, 5000 డినామినేషన్లలో కొత్తగా రీడిజైన్ చేసిన నోట్లను డిసెంబర్ లో విడుదల చేస్తామని తెలిపారు. కొత్త నోట్లు అందుబాటులోకి వచ్చిన తరువాత, పాత నోట్లు ఐదు సంవత్సరాలు చెలామణిలో ఉంటాయని చెబుతున్నారు. మొదట్లో ప్రజల కోసం ఒక డినామినేషన్ పాలిమర్ ప్లాస్టిక్ నోట్ను విడుదల చేస్తామని.. ఆ తరువాత వచ్చే స్పందనను బట్టి ఇతర డినామినేషన్లలో ప్లాస్టిక్ కరెన్సీని అందిస్తామని స్టేట్ బ్యాంక్ గవర్నర్ సెనేట్ కమిటీ సభ్యులకు తెలియజేశారు.
పాలిమర్ ప్లాస్టిక్ నోట్లు కొత్త కాదు
పాలిమర్ ప్లాస్టిక్ నోట్లను ఇప్పటికే 40 దేశాలు ఉపయోగిస్తున్నాయి. ఈ నోట్లను డూప్లికేట్ చేయడం అసాధ్యం. నిజానికి పాలిమర్ ప్లాస్టిక్ నోట్లను 1998లో ఆస్ట్రేలియా మొదటిసారి ప్రవేశపెట్టింది. ఆ తరువాత ఇతర దేశాలు ప్లాస్టిక్ కరెన్సీ విడుదల చేయడం మొదలుపెట్టాయి. ఈ జాబితాలోకి ఇప్పుడు పాకిస్తాన్ చేరనుంది. అయితే ఇండియాలో ప్లాస్టిక్ కరెన్సీ ఎప్పుడు మొదలవుతుందనే విషయం మీద ప్రస్తుతానికి ఎటువంటి అధికారిక ప్రకటన వెల్లడి కాలేదు.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Pakistan to experiment with new polymer plastic currency banknote old ones to be redesigned
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com