Homeజాతీయ వార్తలుPakistani : పాక్ దొంగ వ్యాపారులే కాదు.. దావూద్ ఇబ్రహీం మనుషులు కూడా అక్కడ దొంగ...

Pakistani : పాక్ దొంగ వ్యాపారులే కాదు.. దావూద్ ఇబ్రహీం మనుషులు కూడా అక్కడ దొంగ నోట్లు తయారు చేయలేరు..

Pakistani : నకిలీ నోట్ల వల్ల సరిహద్దుల్లో పరిస్థితి దారుణంగా ఉంది. నకిలీ నోట్లను ఉగ్రవాద గ్రూపులు రవాణా చేస్తుండడంతో వారికి గణనీయంగా ఆదాయం సమకూర్తోంది. ఫలితంగా వారు మన దేశం పైన తీవ్రంగా దాడులు చేయడం సులభం అవుతుంది. ఇలాంటి పరిస్థితిని చూసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పెద్ద నోట్లను రద్దుచేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల ఎలాంటి ప్రయోజనం జరిగింది? ఎంతమంది ఇబ్బంది పడ్డారు? ఎన్ని కంపెనీలు మూతపడ్డాయి? అనే విషయాలను కాస్త పక్కన పెడితే.. అంతర్గతంగా మాత్రం దేశానికి లాభం జరిగిందనేది సత్యమని బిజెపి నాయకులు చెబుతుంటారు.

వాస్తవానికి అసలు కరెన్సీ కి నకిలీ కరెన్సీ ని తయారు చేయడం.. దానిని మార్కెట్లోకి డంప్ చేయడం అనేది కొన్ని ముఠాలు చేసే పని.. దానివల్ల ఒక దేశ ఆర్థిక ముఖచిత్రం సమూలంగా మారిపోతుంది. అసలు కరెన్సీ కంటే నకిలీ కరెన్సీ అధికంగా ఉంటే ఆ దేశం ఆర్థికంగా చితికి పోతుంది. దేశ ఆర్థిక పరిస్థితి కొన్ని ముఠాల చేతుల్లోకి వెళ్లిపోతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందువల్లే అసలు కరెన్సీ నోట్లను రూపొందించడంలో ప్రభుత్వాలు నిక్కచ్చిగా వ్యవహరిస్తుంటాయి.. సెక్యూరిటీ త్రెడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాయి. అయినప్పటికీ కొన్ని ముఠాలు నకిలీ నోట్లను తయారు చేస్తూనే ఉంటాయి. మార్కెట్లోకి డంప్ చేస్తూనే ఉంటాయి.. ఇలాంటి ముఠాలు ఆగడాలు ఎప్పుడో ఒకసారి గాని బయటపడవు. అలా బయటపడేంత వరకు ఆ ముఠాలు నకిలీ కరెన్సీని డంపు చేస్తూనే ఉంటాయి. అయితే ప్రపంచానికి సాంకేతిక పాఠాలు చెప్పే జపాన్ మాత్రం నకిలీ నోట్లకు చెక్ పెట్టడానికి సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని తయారు చేసింది. ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచింది.

నకిలీ నోట్లను తయారు చేయలేరు

నకిలీ నోట్లను అరికట్టడానికి జపాన్ దేశం సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తుంది. అత్యంత అధినాతనమైన త్రీ డి హోలో గ్రాఫిక్ సాంకేతిక పరిజ్ఞానం కలిగి ఉన్న కొత్త నోట్లను జపాన్ దేశం ప్రవేశపెట్టింది. 10,000 యెన్, 5,000, 1,000 యెన్ నోట్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.. ప్రపంచ వ్యాప్తంగా వాడుకలో ఉన్న కరెన్సీ పేపర్తో తయారు చేసిందే. అంతటి అమెరికా కూడా తన కరెన్సీ విషయంలో హోలోగ్రామ్ టెక్నాలజీ ఉపయోగించలేదు. అయితే ఆ టెక్నాలజీని జపాన్ తొలిసారిగా ప్రవేశపెట్టింది. జపాన్ దేశంలో ఇటీవల కాలంలో డిజిటల్ విధానంలో చెల్లింపులు పెరిగిపోయాయి. అయినప్పటికీ నగదు లావాదేవీలు ఏమాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. జపాన్ దేశంలోనూ నకిలీ నోట్ల బెడద ఉన్న నేపథ్యంలో ఆ ప్రభుత్వం హోలోగ్రామ్ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఫలితంగా నకిలీ నోట్లను తయారుచేయడం అంత సులువు కాదు. ఒకవేళ తయారుచేసినా మార్కెట్లోకి డంపు చేయడం అంత సులభం కాదు. మనదేశంలో పెద్ద నోట్లను రద్దు చేసినప్పుడు ప్రభుత్వం వ్యూహాత్మకంగా 2000 నోట్లను మార్కెట్లో తీసుకొచ్చింది. అయితే వాటిల్లో చిప్ లు ఏర్పాటు చేసిందని.. భారీ ఎత్తున 2000 వేల నోట్లను భద్రపరిచేవారు ప్రభుత్వానికి దొరకక తప్పదని వార్తలు వినిపించాయి. అయితే ఆ వార్తలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొట్టిపారేసింది. అంతేకాదు అలాంటి ప్రయత్నాలు చేయడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. అయితే ప్రస్తుతం 2000 నోటును దశల వారీగా రిజర్వ్ బ్యాంక్ వెనక్కి తీసుకుంది. 2000 నోటును చలామణిలో ఉంచడం లేదని స్పష్టం చేసింది. ఇప్పుడు మార్కెట్లో రూపాయి నుంచి మొదలుపెడితే 500 వరకు మాత్రమే చలామణిలో ఉన్నాయి. భారతీయ కరెన్సీలో 500 నోటు మాత్రమే హైయెస్ట్ కరెన్సీగా ఉంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular