ఓన్లీ వన్ డే.. ఈ ఒక్క రోజుతో ట్రంప్ తన పదవిని వీడబోతున్నారు. కానీ.. ఈ చివరి నిమిషంలోనూ ఆయన కీలక నిర్ణయం తీసుకోవడం మానలేదు. తాజాగా.. మరో కీలక నిర్ణయం ప్రకటించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో బ్రెజిల్ సహా పలు ఐరోపా దేశాలకు రాకపోకలపై నిషేధం విధించారు. ఇప్పుడు దానిని ఎత్తివేస్తూ సోమవారం ఉత్తర్వులపై సంతకం చేశారు. ఆయా దేశాల్లో కరోనా వైరస్ ఇంకా విజృంభిస్తున్నప్పటికీ ట్రంప్ ఈ నిర్ణయం తీసుకోవడం ఆసక్తి కలిగించింది.
Also Read: బైడెన్ టీమ్‌లో ఇద్దరు కాశ్మీరీలు..! : ఫ్యూచర్ ప్లాన్ ఏంటో..?
చైనా, ఇరాన్‌పై ఉన్న ఆంక్షల్ని మాత్రం మార్చలేదు.ఆయా దేశాల నుంచి అమెరికాకు వస్తున్న ప్రయాణికులకు కోవిడ్ టెస్టులు చేసి.. నెగెటివ్ ధ్రువీకరణ పత్రాలు ఉంటేనే అనుమతించారు. ఈ నేపథ్యంలోనే ప్రయాణాలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. ఆయా దేశాలు సీడీసీ నిబంధనలను పాటిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
అంతేకాదు.. ఆయన మరోసారి చైనాపై మండిపడ్డారు. మహమ్మారి వ్యాప్తికి కారణమైన దేశాలు మాత్రం సీడీసీ మార్గదర్శకాలను గౌరవిస్తాయన్న నమ్మకం లేదన్నారు. మరోవైపు ట్రంప్ నిర్ణయాన్ని కాబోయే ప్రెసిడెంట్ బైడెన్ టీమ్ ఖండించింది. కరోనా వ్యాప్తి ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో ప్రయాణాలపై ఆంక్షలు కొనసాగుతాయని బైడెన్ ప్రెస్ సెక్రటరీ జెన్ సాకీ తెలిపారు.
Also Read: ‘ఆర్నాబ్’ వాట్సాప్ చాట్స్.. వెలుగుచూస్తున్న సంచలన నిజాలు..!
తన వైద్య బృందం సూచనల మేరకు విదేశీ ప్రయాణాలపై ఉన్న పర్యవేక్షణను మరింత పటిష్టం చేస్తామన్నారు. వైరస్ వ్యాప్తికి ఉన్న అన్ని అవకాశాలను గుర్తించి వాటికి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. మొత్తానికి ట్రంప్ పోతూపోతూ కూడా తన ఆధిపత్యం చాటాలనే చూడడం కొసమెరుపు.
మరిన్ని వార్తల కోసం అంతర్జాతీయ వార్తలు