దేశంలోని వాహనదారుల నిర్లక్ష్యం వల్ల నిత్యం పదుల సంఖ్యలో వాహన ప్రమాదాలు జరుగుతున్నాయి. ట్రాఫిక్ పోలీసులు కఠినంగా నిబంధనలను అమలు చేస్తున్నా రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గడం లేదు సరికదా అంతకంతకూ పెరుగుతోంది. ప్రమాదాల సంఖ్యను తగ్గించడానికి ట్రాఫిక్ పోలీసులు, అధికారులు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. కొందరు వాహనదారులు పదేపదే నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు.
Also Read: నిలిచిపోనున్న హైక్ మెసెంజర్ సేవలు.. ఎప్పటినుంచంటే..?
నిబంధనలను అతిక్రమించే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో వాహనదారులకు కొత్త నిబంధనలు అమలులోకి రాబోతున్నాయి. భీమా రెగ్యులేటర్ ఐఆర్‌డిఎఐ కొత్త నిబంధనలను అమలులోకి తీసుకురానుంది. ట్రాఫిక్ కు ఇన్సూరెన్స్ కు సంబంధం ఏమిటని అనుకుంటున్నారా..? ఎవరైతే వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను పదేపదే ఉల్లంఘిస్తారో వారు చెల్లించాల్సిన ప్రీమియం మొత్తం భారీగా పెరుగుతుంది.
Also Read: వాట్సాప్ కు కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక.. అసలేం జరిగిందంటే..?
నిబంధనలను ఉల్లంఘించే వాళ్లు ట్రాఫిక్ చలానాలు చెల్లించాల్సి ఉంటుందనే సంగతి తెలిసిందే. ఐఆర్‌డిఎఐ ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వాళ్లకు బీమా ప్రీమియం పెరిగే విధంగా తుది నివేదికను సిద్ధం చేసున్నారని సమాచారం. మొదట దేశ రాజధాని న్యూ ఢిల్లీలో ఈ నిబంధనలు అమలు కానున్నాయి. ఆ తర్వాత దశల వారీగా నిబంధనలను అమలులోకి తీసుకురానున్నారని సమాచారం.
మరిన్ని వార్తల కోసం: జనరల్
వాహనాలకు ఇన్సూరెన్స్ చేయించుకోవాలని భావించే వాళ్లకు గడిచిన రెండు సంవత్సరాలకు సంబంధించిన ట్రాఫిక్ చలానాలను పరిగణనలోకి తీసుకొని ప్రీమియం చెల్లించే అవకాశం ఉంటుందని తెలుస్తోంది.