ఏపీ పంచాయతీ ఎన్నికల తీర్పు రిజర్వు

ఏపీలో పంచాయతీ ఎన్నికలపై ఎస్ఈసీ వేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. మంగళవారం ఇరు వర్గాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. ఇక ఉద్యోగుల తరపున దాఖలైన అనుబంధ పిటిషన్లను న్యాయస్థానం కొట్టివేసింది. Also Read: ఈటల మాటలతో ఆ విషయంపై క్లారిటీ వచ్చినట్లే..! పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ రద్దును సవాల్ చేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై ఎస్ఈసీ పిటిషన్ దాఖలు చేసింది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యాక అందులో జోక్యం చేసుకోవడానికి […]

Written By: Srinivas, Updated On : January 19, 2021 3:29 pm
Follow us on


ఏపీలో పంచాయతీ ఎన్నికలపై ఎస్ఈసీ వేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. మంగళవారం ఇరు వర్గాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. ఇక ఉద్యోగుల తరపున దాఖలైన అనుబంధ పిటిషన్లను న్యాయస్థానం కొట్టివేసింది.

Also Read: ఈటల మాటలతో ఆ విషయంపై క్లారిటీ వచ్చినట్లే..!

పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ రద్దును సవాల్ చేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై ఎస్ఈసీ పిటిషన్ దాఖలు చేసింది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యాక అందులో జోక్యం చేసుకోవడానికి వీల్లేదని ఎస్ఈసీ తరపు న్యాయవాది నిన్న వాదనలు వినిపించారు. కాగా, కరోనా వ్యాక్సిన్ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన వివరాలను ఎస్ఈసీ పరిగణనలోకి తీసుకోలేదని ప్రభుత్వం తరపు న్యాయవాది వినిపించారు. ఏజీ వాదనలకు ఎస్ఈసీ తరపు న్యాయవాది బదులిచ్చేందుకు విచారణ మంగళవారానికి వాయిదా వేసింది. ఇవాళ ఎస్ఈసీ తరపు న్యాయవాది వాదనలు విన్న తర్వాత ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది.

Also Read: మోడీని కేసీఆర్‌‌ ఎదుర్కోగలడా..?

హైకోర్టు సీజే జస్టిస్‌ ఏకే గోస్వామి, జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌‌తో కూడిన ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది. రాష్ట్ర ఎన్నికల సంఘం తరఫున సీనియర్‌‌ న్యాయవాది బి.ఆదినారాయణరావు పలు కీలక అంశాలను ధర్మాసనం దృష్టికి తెచ్చారు. రాష్ట్రంలో కోవిడ్‌ ఆంక్షల సడలింపు క్రమంగా పెరుగుతోందని, ఆంక్షల సడలింపులో ఐదో దశలో ఉన్నామని వివరించారు. కరోనా నిబంధనలు పాటిస్తూనే ఎవరి కార్యకలాపాలు వారు చేసుకుంటున్నారని.. రాష్ట్రంలో కరోనా క్రమేపీ తగ్గుతోందన్నారు. ఈ తరుణంలో ఎన్నికల నిర్వహించడానికి ఉన్న అడ్డంకులు ఏమిటో అర్థం కావడం లేదని ప్రస్తావించారు. రాజ్యాంగ బద్ధంగా ఎన్నికలు నిర్వహించాలని ఎస్‌ఈసీ ప్రయత్నిస్తోంది తప్ప మరో ఉద్దేశం లేదని స్పష్టం చేశారు.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్