Bangladesh in BIG trouble: మన పొరుగున ఉన్న బంగ్లాదేశ్‌కు స్వాతంత్య్రం రావడానికి భారత్. దీంతో అప్పటి నుంచి భారత్–బంగ్లా మధ్య సత్సంబంధాలు కొనసాగుతున్నాయి. ఏ పాలకులు వచ్చినా.. భారత్ అనుకూల వైఖరి అవలంబిస్తున్నాయి. అయితే 2024 ఆగస్టులో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోవడం భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలను సవాలకు గురిచేసింది. కొత్త తాత్కాలిక ప్రభుత్వం, ముఖ్యంగా నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ముహమ్మద్ యూనస్ నేతృత్వంలో, భారత్‌తో ఉన్న ఆర్థిక, శక్తి ఒప్పందాలపై మొండి వైఖరిని ప్రదర్శించింది. 2017లో అదానీ పవర్‌తో కుదిరిన విద్యుత్ సరఫరా ఒప్పందం, జార్ఖండ్‌లోని గొడ్డా ప్లాంట్ నుంచి 1,600 మెగావాట్ల విద్యుత్‌ను బంగ్లాదేశ్‌కు సరఫరా చేయాలని నిర్దేశించినప్పటికీ, రాజకీయ అస్థిరత, విదేశీ మారక నిల్వల కొరత బకాయిల చెల్లింపులను ఆలస్యం చేసింది. ఈ నేపథ్యంలో భారత్‌తో సంబంధాలు తాత్కాలికంగా ఒత్తిడికి గురయ్యాయి.
విద్యుత్ సరఫరా నిలిపివేత..
విద్యుత్ సరఫరాకు సంబంధించి బంగ్లాదేశ్ సుమారు 850 మిలియన్ డాలర్ల బకాయిలను చెల్లించకపోవడంతో, అదానీ పవర్ 2024 నవంబర్‌లో విద్యుత్ సరఫరాను 700–800 మెగావాట్లకు తగ్గించింది. ఈ చర్య బంగ్లాదేశ్‌లో విద్యుత్ కొరతను తీవ్రతరం చేసింది, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో 1,600 మెగావాట్లకు పైగా లోటు నమోదైంది. అదానీ నవంబర్ 7 నాటికి బకాయిల చెల్లింపుకు గడువు విధించగా, బంగ్లాదేశ్ పవర్ డెవలప్‌మెంట్ బోర్డ్ వారానికి 18 మిలియన్ డాలర్లు చెల్లిస్తున్నామని తెలిపింది. అయినా అవి కూడా చెల్లించలేదు. దీంతో అదానీ గ్రూప్ బంగ్లాదేశ్‌కు విద్యుత్ సరఫరా నిలిపివేసింది. ఈ సంక్షోభం బంగ్లాదేశ్‌ను తక్షణ చెల్లింపుల వైపు నెట్టింది.
Also Read: చైనా టర్కీలకు మరో గట్టి షాక్ ఇచ్చిన భారత్
437 మిలియన్ డాలర్ల చెల్లింపు..
విద్యుత్ సరఫరా తగ్గింపు ఒత్తిడి ఫలితంగా, బంగ్లాదేశ్ 2025 జూన్‌లో అదానీ పవర్‌కు 437 మిలియన్ డాలర్లు (సుమారు 3,738 కోట్ల రూపాయలు) చెల్లించి, మార్చి 31, 2025 వరకు బకాయిలను క్లియర్ చేసింది. ఈ చెల్లింపు దేశంలోని విద్యుత్ సంక్షోభాన్ని నివారించడానికి, అదానీతో ఒప్పందాన్ని కొనసాగించడానికి కీలకమైంది. మొత్తం 2 బిలియన్ డాలర్ల బిల్లింగ్‌లో 1.5 బిలియన్ డాలర్లు చెల్లించబడ్డాయి, మిగిలిన 500 మిలియన్ డాలర్ల బకాయిలపై చర్చలు కొనసాగుతున్నాయి. అదానీ కూడా జనవరి–జూన్ 2025 కాలానికి 20 మిలియన్ డాలర్ల ఆలస్య చెల్లింపు సర్‌చార్జ్‌ను మాఫీ చేసేందుకు అంగీకరించింది.
ధరలపై విమర్శలు..
అదానీ పవర్‌తో 2017లో కుదిరిన ఒప్పందం అపారదర్శకమని, ఇతర భారతీయ విద్యుత్ సరఫరాదారుల కంటే 55% ఎక్కువ ధరలు ఉన్నాయని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం విమర్శించింది. ఈ ఒప్పందంలో ఇండోనేషియా, ఆస్ట్రేలియా బొగ్గు ధరల సగటును పరిగణనలోకి తీసుకోవడం, జార్ఖండ్ ప్లాంట్‌కు భారత్ నుంచి లభించిన పన్ను రాయితీలను బంగ్లాదేశ్‌కు బదిలీ చేయకపోవడం వంటి అంశాలపై వివాదం నెలకొంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ ఒప్పందాన్ని పరిశీలించడానికి నిపుణుల కమిటీని నియమించింది. అయితే, అదానీ తాము ఒప్పంద నిబంధనలను పూర్తిగా పాటించామని, ఒప్పందం పునఃపరిశీలనకు సంబంధించి ఎటువంటి అధికారిక సమాచారం లేదని స్పష్టం చేసింది.
Also Read: నెహ్రూ చేసిన పొరపాటును సరిదిద్దిన మోదీ.. ఏంటా పొరపాటు?
పది శాతం విద్యుత్ మనదే..
అదానీ పవర్ గొడ్డా ప్లాంట్ బంగ్లాదేశ్ విద్యుత్ డిమాండ్‌లో సుమారు 10% తీరుస్తోంది, ఇది దేశ శక్తి సంక్షోభాన్ని తగ్గించడంలో కీలకమైన పాత్ర పోషిస్తోంది. 2022 రష్యా–ఉక్రెయిన్ యుద్ధం తర్వాత బొగ్గు, చమురు దిగుమతి ఖర్చులు పెరగడం, విదేశీ మారక నిల్వల కొరత, రాజకీయ అస్థిరతలు బంగ్లాదేశ్‌ను ఆర్థిక సంక్షోభంలోకి నెట్టాయి. ఈ పరిస్థితుల్లో అదానీతో ఒప్పందాన్ని కొనసాగించడం బంగ్లాదేశ్‌కు అనివార్యమైంది.