Modi Jawaharlal Nehru: భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అప్పటి పరిస్థితులను బట్టి ఆయన అనేక నిర్ణయాలు తీసుకున్నారు. వీటిలో కొన్ని పొరపాటు కూడా ఉన్నాయి. ప్రధానిగా నెహ్రూ రికార్డును సమం చేసిన మోదీ.. ఇప్పుడు ఆయన చేసిన పొరపాట్లను కూడా సరిదిద్దుతున్నారు. తాజాగా పాకిస్తాన్‌ను అనుకూలంగా ఉన్న నిర్ణయాన్ని రద్దు చేసి చారిత్రక నిర్ణయం తీసుకున్నారు.
Also Read: ఇంగ్లాండ్ 600 టార్గెట్ చేజ్ చేస్తుందా.. గత చరిత్ర ఏం చెబుతోందంటే?
1947లో కశ్మీర్ భారత్‌లో విలీనం తర్వాత, పాకిస్తాన్ ఆక్రమణ ప్రయత్నాలను భారత్ విజయవంతంగా తిప్పికొట్టింది. అయితే, ఈ సమయంలో ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ కశ్మీర్ వివాదాన్ని ఐక్యరాజ్య సమితికి తీసుకెళ్లడం ఒక వివాదాస్పద నిర్ణయంగా మిగిలింది. ఈ చర్య ఫలితంగా 1949లో యుద్ధ విరమణ జరిగి, యూఎన్‌మోగిప్(యునైటెడ్ నేషన్స్ మిలటరీ అబ్జర్వర్స్ గ్రూప్ ఇన్ ఇండియా అండ్ పాకిస్తాన్) ఏర్పాటైంది. ఈ సంస్థ భారత్, పాకిస్తాన్‌ల మధ్య శాంతిని పర్యవేక్షించేందుకు ఉద్దేశించబడినప్పటికీ, దాని ఉనికి భారత సార్వభౌమత్వంపై ప్రశ్నలను లేవనెత్తింది.
భారత్‌కు వ్యతిరేకంగా నివేదికలు..
ఢిల్లీ, శ్రీనగర్‌లో కార్యాలయాలను కలిగి ఉన్న యూఎన్‌మోగిప్, పాకిస్తాన్‌కు అనుకూలంగా నివేదికలు సమర్పించడం ద్వారా భారత్‌పై విమర్శలను ఎదుర్కొంది. కశ్మీర్‌లో వేర్పాటువాదులు ఈ సంస్థ దృష్టిని ఆకర్షించేందుకు ఇంగ్లిష్‌లో ప్లకార్డులు ఉపయోగించారు, ఇది దాని పక్షపాత ధోరణిని మరింత స్పష్టం చేసింది. 1972 సిమ్లా ఒప్పందం తర్వాత కూడా ఈ సంస్థను మూసివేయకపోవడం గత ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని తెలియజేస్తుంది.
మోదీ నిర్ణయాత్మక చర్యలు
2014లో నరేంద్ర మోదీ ప్రధానిగా అధికారంలోకి వచ్చిన తర్వాత, యూఎన్‌మోగిప్ ఢిల్లీ కార్యాలయం మూసివేశారు. ఇది భారత్ స్పష్టౖమైన వైఖరిని సూచిస్తుంది. 2019 నాటికి శ్రీనగర్ కార్యాలయం కూడా మూసివేయబడింది, గవర్నర్ మనోజ్ సిన్హా సూచనల మేరకు సిబ్బంది వీసాలు రద్దు చేయబడ్డాయి. ఈ చర్యలు భారత్ యొక్క సార్వభౌమ నిర్ణయాధికారాన్ని బలోపేతం చేశాయి. అంతర్జాతీయ జోక్యం నుంచి కశ్మీర్‌ను విముక్తి చేసే దిశగా ఒక ముఖ్యమైన అడుగుగా నిలిచాయి.
వ్యూహాత్మక ప్రభావం
యూఎన్‌మోగిప్ మూసివేత భారత్ దృý మైన విదేశాంగ విధానాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ నిర్ణయం కశ్మీర్ విషయంలో భారత్ యొక్క స్వతంత్ర హక్కును బలపరిచింది. పాకిస్తాన్ యొక్క ప్రచారానికి వ్యతిరేకంగా ఒక స్పష్టమైన సందేశాన్ని పంపింది. ఇది భారత ప్రభుత్వం యొక్క జాతీయ భద్రత మరియు స్వాతంత్య్రానికి ప్రాధాన్యతనిస్తూ, చారిత్రక తప్పిదాలను సరిదిద్దే ప్రయత్నంగా చూడవచ్చు.