https://oktelugu.com/

కేసీఆర్‌‌కు బండి ‘వైట్ చాలెంజ్’

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మరోసారి ప్రభుత్వంపై దూకుడు పెంచారు. కేసీఆర్‌‌ టార్గెట్‌ చేస్తూ సవాల్‌ విసిరారు. తాజాగా.. ఆయన మరోసారి సంచలన వ్యాఖ్యలే చేశారు. అదేదో గ్రీన్‌ ఛాలెంజ్‌ లాంటిది మాత్రం కాదు. తాను వైట్‌ ఛాలెంజ్‌ విసురుతున్నానని సవాల్‌ చేశారు. వైట్‌ ఛాలెంజ్‌ అంటే అదేదో కాదు కొకైన్‌ టెస్ట్‌. అవును.. డ్రగ్‌కు సంబంధించిన టెస్ట్‌. డ్రగ్స్ టెస్ట్‌కు తాను సిద్ధంగా ఉన్నానని.. మీరంతా రెడీగా ఉన్నారా..? దమ్ముంటే రండి, టెస్ట్ […]

Written By:
  • Srinivas
  • , Updated On : April 5, 2021 / 03:44 PM IST
    Follow us on


    బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మరోసారి ప్రభుత్వంపై దూకుడు పెంచారు. కేసీఆర్‌‌ టార్గెట్‌ చేస్తూ సవాల్‌ విసిరారు. తాజాగా.. ఆయన మరోసారి సంచలన వ్యాఖ్యలే చేశారు. అదేదో గ్రీన్‌ ఛాలెంజ్‌ లాంటిది మాత్రం కాదు. తాను వైట్‌ ఛాలెంజ్‌ విసురుతున్నానని సవాల్‌ చేశారు. వైట్‌ ఛాలెంజ్‌ అంటే అదేదో కాదు కొకైన్‌ టెస్ట్‌.

    అవును.. డ్రగ్‌కు సంబంధించిన టెస్ట్‌. డ్రగ్స్ టెస్ట్‌కు తాను సిద్ధంగా ఉన్నానని.. మీరంతా రెడీగా ఉన్నారా..? దమ్ముంటే రండి, టెస్ట్ కు బ్లడ్ ఇస్తారా..? అంటూ బండి సవాల్ చేశారు. కేసీఆర్ కరోనా టెస్టులు వద్దన్నారు. కేసీఆర్.. ఆయన ఎమ్మెల్యేలకు రక్త పరీక్షలు చేయించాలని ఛాలెంజ్ చేశారు. టీఆర్ఎస్‌కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు డ్రగ్స్ కేసులో ఉన్నారని బండి సంజయ్ ఆరోపించారు.

    గతంలో సినీ ఇండ్రస్ట్రీ డ్రగ్స్ కేస్ ఏమయింది కేసీఆర్? అంటూ ముఖ్యమంత్రిని బండి సంజయ్ ప్రశ్నించారు. కొకైన్, డ్రగ్స్ రక్త నమూనాల పరీక్షల కోసం బీజేపీ సిద్ధం ..టీఆర్ఎస్ సిద్ధమా ? అంటూ సవాల్ విసిరారు. డ్రగ్స్ తీసుకున్న నలుగురి ఎమ్మెల్యేలతో కేసీఆర్ రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు బండి సంజయ్.

    బండి సంజయ్‌ విసిరిన సవాల్‌పై ఇప్పటివరకు అధికార పార్టీ నుంచి ఎలాంటి రెస్పాన్స్‌ అయితే రాలేదు. మరోవైపు.. డ్రగ్స్‌ కేసులో నలుగురు అధికార పార్టీ ఎమ్మెల్యేల పేర్లు వినిపిస్తుండడంతో ఆ పార్టీ కూడా ఎలాంటి చర్యలు తీసుకోబోతోందో తెలియకుండా ఉంది. దీనిపై అధినేత కూడా ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.