తులసి ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చనే సంగతి తెలిసిందే. తులసి మొక్కలు అనేక ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టడంలో సహాయపడతాయి. అయితే వ్యవసాయంపై అవగాహన ఉన్నవాళ్లు తులసి మొక్కలను పెంచడం ద్వారా లక్షల రూపాయలు సంపాదించవచ్చు. మార్కెట్ లో తులసికి మంచి డిమాండ్ ఉంది. తులసి మొక్కలను పెంచడం ద్వారా సులువుగా లక్షల రూపాయలు సంపాదించవచ్చు.
Also Read: గ్యాస్ సిలిండర్ వాడేవాళ్లకు అదిరిపోయే శుభవార్త..?
మెడిసినల్ ప్లాంట్ గా చెప్పుకునే తులసిని అనేక మందుల తయారీలో ఉపయోగిస్తారు. కరోనా విజృంభణ, లాక్ డౌన్ నిబంధనలు అమలైన తర్వాత ఆయుర్వేద మెడిసిన్స్ తయారీలో తులసిని ఎక్కువగా ఉపయోగిస్తారు. కేవలం 15,000 రూపాయల నుంచి 20,000 రూపాయలు పెట్టుబడి పెట్టడం ద్వారా తులసి మొక్కలను పెంచడం సాధ్యమవుతుంది. పతంజలి, డాబర్, వైద్యనాథ్ లాంటి కంపెనీలు తులసి పంటను కొనుగోలు చేస్తాయి.
తులసి మొక్కలను మూడు నుంచి నాలుగు నెలల పాటు పెంచడం ద్వారా సులభంగా లక్షల రూపాయలు సంపాదించవచ్చు. కంపెనీలతో కాంట్రాక్ట్ లను కుదుర్చుకుని కూడా తులసి మొక్కలను పెంచవచ్చు. అయితే వ్యవసాయంపై, తులసి సాగుపై అవగాహన ఉంటే మాత్రమే ఈ పంటను సాగు చేయడం మంచిది. తక్కువ సమయంలో మంచి లాభాలను పొందాలనుకునేవారికి తులసి పంట మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు.
Also Read: ఎస్బీఐ సూపర్ స్కీమ్.. రూ.100తో 10 లక్షలు..?
రోజురోజుకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో మరిక్ తులసి పంట వేసిన వాళ్లకు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉంది.