https://oktelugu.com/

ప్లీజ్‌ సైలెన్స్‌.. :డిసెంబర్‌‌ 31 సెలబ్రేషన్స్‌కు తెలంగాణ పోలీసుల బ్రేక్‌

డీజేల మోతలు.. పబ్బుల్లో డ్యాన్సులు.. బాంబుల మోతలు.. యువత కేరింతలు.. డిసెంబర్ 31 వచ్చిందంటే ప్రతీ సంవత్సరం చూస్తుంటాం. 31 రాత్రి వచ్చిందంటే కుర్రకారులో ఉండే సంబురం అంతా ఇంతా కాదు. వారం పది రోజుల ముందు నుంచే సెలబ్రేషన్స్‌కు ప్లాన్ చేస్తుంటారు. హైదరాబాద్‌లో పబ్స్, రెస్టారెంట్స్ కిటకిటలాడుతాయి. ట్యాంక్ బండ్‌తోపాటు దాదాపు అన్ని హ్యాంగ్ -అవుట్స్ కళకళలాడుతాయి. రిసార్ట్స్ కూడా అడ్వాన్స్‌గా బుక్‌ అయిపోతుంటాయి. కానీ.. ఈసారి అవన్నీ బైబై చెప్పాల్సిందే. Also Read: ఇక […]

Written By:
  • Srinivas
  • , Updated On : December 26, 2020 11:39 am
    Follow us on

    Ban on New Year celebrations
    డీజేల మోతలు.. పబ్బుల్లో డ్యాన్సులు.. బాంబుల మోతలు.. యువత కేరింతలు.. డిసెంబర్ 31 వచ్చిందంటే ప్రతీ సంవత్సరం చూస్తుంటాం. 31 రాత్రి వచ్చిందంటే కుర్రకారులో ఉండే సంబురం అంతా ఇంతా కాదు. వారం పది రోజుల ముందు నుంచే సెలబ్రేషన్స్‌కు ప్లాన్ చేస్తుంటారు. హైదరాబాద్‌లో పబ్స్, రెస్టారెంట్స్ కిటకిటలాడుతాయి. ట్యాంక్ బండ్‌తోపాటు దాదాపు అన్ని హ్యాంగ్ -అవుట్స్ కళకళలాడుతాయి. రిసార్ట్స్ కూడా అడ్వాన్స్‌గా బుక్‌ అయిపోతుంటాయి. కానీ.. ఈసారి అవన్నీ బైబై చెప్పాల్సిందే.

    Also Read: ఇక నుంచి గ్రామాల్లోనే ఉండాలి..: టీఆర్ఎస్‌ నేతలకు కేసీఆర్‌‌ దిశానిర్దేశం

    రాబోతున్న న్యూ ఇయర్ వేడుకలను పూర్తిస్థాయిలో నిషేధిస్తున్నట్లు హైదరాబాద్ పోలీసులు ప్రకటించారు. కేవలం పబ్స్, రిసార్ట్స్, మల్టీప్లెక్సులు మాత్రమే కాదు.. చివరికి గేటెడ్ కమ్యూనిటీస్, చిన్నచిన్న అపార్ట్‌మెంట్లలో కూడా సంబురాలకు నిషేధం విధించారు. 31 రాత్రి సిటీ అంతా పోలీసులు పహారా కాస్తారని, ఎక్కడైనా న్యూ ఇయర్ వేడుకలు జరిగినట్టు తెలిస్తే వెంటనే సదరు పబ్ లేదా అపార్ట్ మెంట్ పై కేసు పెడతామని హెచ్చరికలు జారీచేశారు.

    హైదరాబాద్‌లో ఇప్పటికీ కరోనా కేసులు నమోదతున్నాయి. దీనికితోడు కొత్త రకం కరోనా వైరస్ స్ట్రెయిన్ కూడా అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. బ్రిటన్‌లో జన్యుమార్పిడికి గురైన ఈ కొత్త రకం కరోనా వైరస్‌ వెలుగులోకి వచ్చాక.. బ్రిటన్‌ నుంచి హైదరాబాద్‌కు ఏకంగా 800 మంది వచ్చారు. వీళ్లందరికీ ఇంకా పూర్తిస్థాయిలో పరీక్షలు చేయలేదు. కొంతమంది జాడ కూడా కనుక్కోలేకపోయారు. మరోవైపు.. ఈ కొత్త వైరస్‌ వేగంగా స్ప్రెడ్‌ అవుతుందని ఇప్పటికే డబ్ల్యూహెచ్‌వో కూడా ప్రకటించింది.

    Also Read: ఉద్యోగులకు కేసీఆర్ తీపి కబురు చెబుతారా?

    మరోవైపు.. పరీక్షల్లో మ్యూటెటెడ్ వైరస్ అవునా కాదా అనే విషయం ఇంకా తేలలేదు. ఇలాంటి టైమ్‌లో న్యూ ఇయర్ పార్టీలకు అనుమతి ఇస్తే, వైరస్‌ స్ప్రెడ్‌ మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉందనేది సమాచారం. అంతేకాదు.. ఏరి కోరి కష్టాలు తెచ్చుకున్నట్లే అవుతుంది. అందుకే తెలంగాణ ప్రభుత్వం, పోలీసులు ఈ విషయంలో చాలా కఠినంగా ఉన్నారు. మొత్తానికి ఈసారి ఎంతో సంబురంగా సెలబ్రేట్‌ చేసుకుందామనుకున్న వారికి పోలీసులు బ్రేక్‌లు వేసినట్లు అయింది.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్