సంచలనం.. కరోనాను జయించిన ‘ధారవి’..!

ఆసియాలోనే అతిపెద్ద మురికివాడగా ముంబైలోని ధారవికి పేరుంది. ఏప్రిల్ తొలి వారంలోనే ధారవిలో కరోనా తొలి కేసు నమోదైంది. ఈ ప్రాంతంలో అత్యధికంగా జనాభా ఉండంతోపాటు నివాసాలు చాలా దగ్గరగా ఉన్నాయి. దీంతో ముంబైలో ఆందోళన మొదలైంది. Also Read: హైఅలెర్ట్: బ్రిటన్ నుంచి తెలంగాణకు వచ్చిన 16మందికి కరోనా కరోనా వైరస్ విజృంభించడానికి ధారవి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ధారవిలో కరోనా కేసులపై ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో ముంబై […]

Written By: Neelambaram, Updated On : December 26, 2020 7:33 pm
Follow us on

ఆసియాలోనే అతిపెద్ద మురికివాడగా ముంబైలోని ధారవికి పేరుంది. ఏప్రిల్ తొలి వారంలోనే ధారవిలో కరోనా తొలి కేసు నమోదైంది. ఈ ప్రాంతంలో అత్యధికంగా జనాభా ఉండంతోపాటు నివాసాలు చాలా దగ్గరగా ఉన్నాయి. దీంతో ముంబైలో ఆందోళన మొదలైంది.

Also Read: హైఅలెర్ట్: బ్రిటన్ నుంచి తెలంగాణకు వచ్చిన 16మందికి కరోనా

కరోనా వైరస్ విజృంభించడానికి ధారవి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ధారవిలో కరోనా కేసులపై ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో ముంబై ప్రభుత్వం అప్రమత్తమై కరోనా కట్టడి చర్యలు చేపట్టింది.

ఏప్రిల్ నుంచి ప్రతీరోజు ధారవిలో వందలాది కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 3,788 కరోనా కేసులు నమోదుకాగా వీరిలో 3,464 మంది కోలుకోగా 364 మంది చనిపోయారు. అయితే గడిచిన 24గంటల్లో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాకపోవడం విశేషం.

Also Read: హైదరాబాద్‌లో ‘కొత్త’ టెన్షన్‌

ప్రస్తుతం ధారవిలో 12యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. వీరిలో 8మంది హోం ఐసోలేషన్‌లోనూ.. నలుగురు కొవిడ్‌ కేర్‌ కేంద్రంలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ముంబై వ్యాప్తంగా 8,218 యాక్టవ్ కేసులు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.

ధారవి ప్రజలు కరోనాను తరిమివేయాలని నిర్ణయించుకున్నారని.. వారి సహకారంతోనే పాజిటివ్ కేసులు త్వరలోనే సున్నాకు చేరుకోబోతున్నాయని ముంబై అధికారులు సంతోషం వ్యక్తం చేశారు. ధారవి కరోనాను జయించడంపై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్