https://oktelugu.com/

బోల్డ్ స్టోరీలో మాజీ బబ్లీ బ్యూటీ !

ఒకప్పుడు హీరోయిన్ గా అదరగొట్టిన గ్లామరస్ హీరోయిన్లు, ఇప్పుడు తల్లి పాత్రలకు పరిమితం అవుతున్నారు. హీరోయిన్ గా కోట్లు తీసుకుని ఉన్నట్లు ఉండి ఆదాయం మిస్ అయ్యేసరికి మాజీ హీరోయిన్స్ కి నిద్ర పట్టట్లేదు అనుకుంటా.. అవకాశం వస్తే మళ్ళీ నటిస్తాను అంటూ ప్రతి హీరోయిన్ ఇంటర్వ్యూలు ఇచ్చి మరీ చెప్పుకొస్తున్నారు. అలాగే మాజీ బబ్లీ బ్యూటీ సంగీత ఇప్పుడు తల్లి పాత్రలోకి వచ్చేసిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఆమె రష్మిక తల్లిగా కనిపించి బాగానే అలరించింది. […]

Written By:
  • admin
  • , Updated On : December 26, 2020 / 11:20 AM IST
    Follow us on


    ఒకప్పుడు హీరోయిన్ గా అదరగొట్టిన గ్లామరస్ హీరోయిన్లు, ఇప్పుడు తల్లి పాత్రలకు పరిమితం అవుతున్నారు. హీరోయిన్ గా కోట్లు తీసుకుని ఉన్నట్లు ఉండి ఆదాయం మిస్ అయ్యేసరికి మాజీ హీరోయిన్స్ కి నిద్ర పట్టట్లేదు అనుకుంటా.. అవకాశం వస్తే మళ్ళీ నటిస్తాను అంటూ ప్రతి హీరోయిన్ ఇంటర్వ్యూలు ఇచ్చి మరీ చెప్పుకొస్తున్నారు. అలాగే మాజీ బబ్లీ బ్యూటీ సంగీత ఇప్పుడు తల్లి పాత్రలోకి వచ్చేసిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఆమె రష్మిక తల్లిగా కనిపించి బాగానే అలరించింది. “సరిలేరు నీకెవ్వరు” చిత్రంలో “నెవ్వర్ బిఫోర్” అంటూ బాగానే నవ్వించి మెప్పించింది సంగీత. అందుకే ఆమెకు అవకాశాలు కూడా బాగానే వస్తున్నాయి.

    Also Read: రజినీకాంత్ కు తెలుగు సినిమా పెద్దల బాసట.. చూసుకుంటున్న మోహన్ బాబు

    తాజాగా మరో సినిమాలో తల్లిగా కీలక పాత్ర చేయడానికి సంగీత రెడీ అయిపొయింది. ఆమె నటిస్తున్న ఈ కొత్త చిత్రం పేరు “మసూద”. ‘మ‌ళ్లీ రావా’ చిత్రంతో గౌత‌మ్ తిన్న‌నూరి, ‘ఏజెంట్ సాయిశ్రీ‌నివాస ఆత్రేయ’ చిత్రంతో స్వ‌రూప్‌ ఆర్‌.ఎస్‌.జె. లాంటి డైరెక్ట‌ర్లను ప‌రిచ‌యం చేసిన స్వ‌ధ‌ర్మ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్, ఇప్పుడు ఈ ‘మ‌సూద‌’ అనే సినిమాతో మరో కొత్త డైరెక్ట‌ర్ సాయికిర‌ణ్‌ను ప‌రిచ‌యం చేస్తోంది. సంస్థ ట్రాక్ రికార్డ్ ను బట్టి.. సినిమాలో విషయం ఉంటుందనే నమ్మకం ఉంది అందరిలో. అన్నట్లు హార‌ర్ డ్రామాగా రూపొందుతున్న‌ ఈ చిత్రంలో హీరోగా ‘జార్జిరెడ్డి’ ఫేమ్ తిరువీర్ న‌టిస్తున్నాడు.

    Also Read: సింగర్ సునీత ప్రీవెడ్డింగ్ పార్టీ.. కేరాఫ్ ఆఫ్ ‘గచ్చిబౌలి’

    అలాగే ‘గంగోత్రి’లో బాల‌న‌టిగా అల‌రించిన ‘కావ్య క‌ల్యాణ్‌రామ్’ హీరోయిన్‌గా ప‌రిచ‌య‌మ‌వుతుంది. ఈ బ్యూటీకి ఈ సినిమా చాల కీలకం కానుంది. అయితే సినిమాలో సంగీతనే అత్యంత ముఖ్య‌మైన పాత్ర‌ను పోషింస్తోందని తెలుస్తోంది. ప‌దిహేడు సంవ‌త్స‌రాల త‌న కూతురు అనూహ్యంగా ప్ర‌వ‌ర్తిస్తుండ‌టంతో ఆందోళ‌న చెందిన ఓ ఒంట‌రి త‌ల్లి అతి భ‌య‌స్తుడైన ప‌క్కింటి యువ‌కుడి స‌హాయంతో కూతుర్ని ఎలా కాపాడుకుంద‌నేదే ఈ సినిమా మెయిన్ పాయింట్ అట. అలాగే తల్లి కూతుర్లు ఆ యువకుడినే ప్రేమిస్తారట. అప్పుడెప్పుడో ఇదే పాయింట్ తో దాసరి ‘తూర్పు పడమర’ సినిమా తీసాడు. మళ్ళీ ఇప్పుడు ఇదే పాయింట్ తో సినిమా వస్తోంది. ఏది ఏమైనా సంగీత పాత్రనే సినిమాలో మెయిన్ పాత్ర అట. మరి బోల్డ్ పాయింట్ తో రానున్న ఈ సినిమా సంగీతకి ఎలాంటి ఇమేజ్ ను ఇస్తోందో చూడాలి.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్