CM Jagan: అయ్యా జగనూ ఈ గోడు ఆలకించవయ్యా !

CM Jagan: ప్రజలకు ఏ విపత్తు వచ్చినా, రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా అందరూ సినిమా వాళ్ళు ఏదో చేసేయాలని, అవసరం అయితే కోట్ల రూపాయల విరాళాలు ఇచ్చేయాలని కోరుకుంటారు. అయినా సినిమా వాళ్లే ఎందుకు ఇవ్వాలి ? పాత డైలాగ్ ఒకటి ఉంది. మంచి వాళ్ళకే కష్టాలు ఎందుకు వస్తాయి ? అన్నట్టు.. ఒక్క సినిమా వాళ్లే ప్రజలకు అండగా ఎందుకు నిలబడాలి. అసలు సినిమా సక్సెస్ శాతం కరెక్ట్ గా కొల్చుకుంటే.. నాలుగు శాతం […]

Written By: Shiva, Updated On : December 26, 2021 7:49 pm
Follow us on

CM Jagan: ప్రజలకు ఏ విపత్తు వచ్చినా, రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా అందరూ సినిమా వాళ్ళు ఏదో చేసేయాలని, అవసరం అయితే కోట్ల రూపాయల విరాళాలు ఇచ్చేయాలని కోరుకుంటారు. అయినా సినిమా వాళ్లే ఎందుకు ఇవ్వాలి ? పాత డైలాగ్ ఒకటి ఉంది. మంచి వాళ్ళకే కష్టాలు ఎందుకు వస్తాయి ? అన్నట్టు.. ఒక్క సినిమా వాళ్లే ప్రజలకు అండగా ఎందుకు నిలబడాలి.

CM Jagan

అసలు సినిమా సక్సెస్ శాతం కరెక్ట్ గా కొల్చుకుంటే.. నాలుగు శాతం కన్నా ఎక్కువ లేదు. అయినా సినిమా వాళ్ళు కష్టపడి జీవితాలు త్యాగం చేసుకుని సినిమాలు చేస్తారు. ఒక సినిమా విజయం కావాలి అంటే.. దాని వెనుక పదుల సంవత్సరాల కష్టం ఉంటుంది. ఆ సినిమాకి పని చేసే ప్రతి ఒక్కరూ ఎంతో త్యాగం చేసి.. ఏదొక క్రాఫ్ట్ లో నైపుణ్యం సంపాదించుకుని సినిమాకి పని చేస్తారు.

అయినా ఆ సినిమా హిట్ అవుతుంది అని గ్యారెంటీ లేదు. ఒకవేళ హిట్ అయినా సినిమాకి కలెక్షన్స్ వస్తాయి అని కూడా గ్యారెంటీ లేదు. నిజంగా ఇంత దయనీయమైన రంగం మరొకటి లేదు. అయినప్పటికీ సినిమా రంగం అంటే అసూయ. ఇక ఏపీ ప్రభుత్వానికి అయితే ద్వేషం కూడా కనిపిస్తుంది. అసలు ఆ ద్వేషాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?

సత్య హరిశ్చంద్ర సినిమా గుర్తుకు వస్తుంది. సినిమా ఇంకో అరగంట ఉందనగా హరిశ్చంద్రునికి కష్టాలు మీద కష్టాలు పెరిగిపోతూ ఉంటాయి. కానీ, సినిమా వాళ్లకు మొదటి రోజు కష్టాలు ఉంటాయి. అంటే.. సినిమాలోని కష్టాలు కంటే.. సినిమా వాళ్లకు ఇంకా కష్టాలు ఉంటాయని చెప్పడం ఉద్దేశ్యం. మరి ఆ కష్టాలను జగన్ కు అర్థమయ్యేలా చెప్పేది ఎవరు ?

చెప్పినా అర్ధం అవుతుందా ? స్టేజీలెక్కి బూతులు తిట్టే వారికే వోట్లు వేసి రాజకీయనాయకులను చేశాక, ఇక ఎన్ని అనుకుని లాభం ఏముంది ? నీతి నిజాయితీ అని మడికట్టుకు కూర్చున్న వారంతా ఇప్పుడు వెనక్కి వెళ్లిపోతున్నారు. సినిమా పై ఫ్యాషన్ తో సినిమాలు చేసేవారంతా ఇప్పుడు సైలెంట్ అయిపోతున్నారు. అప్పుడు ఇండస్ట్రీలో పని చేసే కార్మికుల పరిస్థితి ఏమిటి ?

అసలు సినిమా రంగానికి జరగాల్సిన మేలు జరగకపోగా అష్టకష్టాలు ఎదురైతే ఎలా ? ఏమిటి పరిష్కారం ! చెప్పేదెవరు ? అయ్యా.. జగనూ ఈ గోడు ఆలకించవయ్యా. చూడగా చూడగా ఆలోచించగా చించగా సినిమా రంగంలోని బాధలు నష్టాలూ అవగాహనకు వస్తాయి. అలా కాకుండా, పగతో రగులుతూ కుళ్లు కుతంత్రాలతో చెలరేగిపోతే.. ఇక ఈ ఇండస్ట్రీకి మనుగడ ఉండదు.

Tags