https://oktelugu.com/

Samantha: షిఫ్ట్ అవుతున్న సమంత.. ఎక్కడికో తెలుసా?

Samantha: నాగచైతన్యతో విడిపోయాక సమంత మళ్లీ సినిమాల్లో యాక్టివ్ అయ్యింది. అది ఏ పాత్ర అయినా చేసేస్తోంది. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ లో  సన్నివేశాల్లో నటించడం.. పుష్ప మూవీలో ఐటెం సాంగ్ లో నర్తించడం ఇలా తనకు ఇష్టమైనవి చేస్తోంది. ఇన్నాళ్లు పద్దతిగా ఓ చట్రంలో ఉన్న సమంత ఇప్పుడు పూర్తిగా తనకిష్టమైనట్టు చేస్తోంది. ఇక హైదరాబాద్ లో ఉంటే నాగచైతన్య, మామ అక్కినేని నాగార్జున సహా అందరూ కంటపడే అవకాశం ఉండడంతో ఇక్కడి నుంచి […]

Written By:
  • NARESH
  • , Updated On : December 26, 2021 / 08:55 PM IST
    Follow us on

    Samantha: నాగచైతన్యతో విడిపోయాక సమంత మళ్లీ సినిమాల్లో యాక్టివ్ అయ్యింది. అది ఏ పాత్ర అయినా చేసేస్తోంది. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ లో  సన్నివేశాల్లో నటించడం.. పుష్ప మూవీలో ఐటెం సాంగ్ లో నర్తించడం ఇలా తనకు ఇష్టమైనవి చేస్తోంది.

    ఇన్నాళ్లు పద్దతిగా ఓ చట్రంలో ఉన్న సమంత ఇప్పుడు పూర్తిగా తనకిష్టమైనట్టు చేస్తోంది. ఇక హైదరాబాద్ లో ఉంటే నాగచైతన్య, మామ అక్కినేని నాగార్జున సహా అందరూ కంటపడే అవకాశం ఉండడంతో ఇక్కడి నుంచి మకాం మార్చాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది.

    Naga Chaitanya & Samantha

    అక్కినేని నాగ చైతన్య తో విడాకుల ప్రకటనకు ముందు , ప్రకటన తర్వాత కూడా … సామ్ వార్తల్లో హాట్ టాపిక్ గా నిలిచారు. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉండే సమంత… తనపై వస్తున్న రూమర్లకు తనదైన శైలిలో స్పందిస్తూ మండిపడ్డ విషయం తెలిసిందే.

    Also Read: షిఫ్ట్ అవుతున్న సమంత.. ఎక్కడికో తెలుసా?

    అయితే తెలుగు, తమిళ భాషల్లో వరుస చిత్రాలతో ఎప్పుడూ బిజీగా ఉండే ఈ ముద్దుగుమ్మ తన మకాం కొంతకాలం ముంబైకి మార్చునుందా… అనే వార్తలు వస్తున్నాయి. ఆమె జీవితంలో వ్యక్తిగతంగా జరిగిన విషయాలను పుల్ స్టాప్ పెట్టి, నటన పై దృష్టి పెట్టాలనుకుంటున్నారు సమంత. ప్రస్తుతం తెలుగులో శాకుంతలం సినిమా కంప్లీట్ చేశారు.

    ది ఫ్యామిలీ మ్యాన్2’ వెబ్ సిరీస్ లో విలక్షణమైన పాత్రలో నటించి మెప్పించింది సమంత. ఈ పాత్రకు గాను ప్రశంసలు కూడా అందుకున్నారు సమంత. ఈ వెబ్ సిరీస్ తర్వాత బాలీవుడ్ లో సమంతకు క్రేజ్ పెరిగింది. ఈ కారణంతోనే  సమంతకు ఓ బాలీవుడ్ సినిమా సైన్ చేశారని సమాచారం. బాలీవుడ్ చిత్రాలపై ఆసక్తి చూపుతున్నారు అని సమంతకు మరిన్ని హిందీ సినిమాల్లో నటించే అవకాశాలు ఉన్నాయి.

    Also Read: ఎన్టీఆర్ తో ఏమ్జీయార్.. ‘ఏమి తెచ్చారు సోదరా’ ?