https://oktelugu.com/

Train Ticket Book : వేరేవాళ్ల కోసం Train టికెట్ బుక్ చేస్తున్నారా..? జాగ్రత్త..!

ట్రైన్ బుక్ చేయమని తెలిసిన వారిని అడగొచ్చు.కానీ ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అంటే రైల్వే నియమాల ప్రకారం IRCTC ద్వారా ఒక వ్యక్తి తన కోసం లేదా కుటుంబ సభ్యుల కోసం టికెట్ ను బుక్ చేసుకోవచ్చు. అలాగే తెలిసిన వారి కోసం బుక్ చేసుకోవచ్చు. ఇలా టికెట్ బుక్ చేసినప్పడు ఎలాంటి ఛార్జీలు పడవు. దీంతో వారు బుక్ చేసినందుకు ఎలాంటి డబ్బులు వసూలు చేయరాదు.

Written By:
  • Srinivas
  • , Updated On : August 20, 2024 / 02:29 PM IST

    Train Ticket Book

    Follow us on

    Train Ticket Book : దూర ప్రయాణాలు చేయడానికి అనువైన రవాణా సాధనం ట్రైన్ జర్నీ. ఎంత దూరమైన ఇందులో ప్రయాణం చేస్తే అలసట ఉండదు. అంతేకాకుండా తక్కువ ఛార్జీలతో గమ్యాన్ని చేరుకోవచ్చు. ఎలాంటి ఆటంకం ఉండకుండా ఇందులో ప్రయాణం చేయడానికి అనువుగా ఉంటుంది. ఈ కారణంగా చాలా మంది రైలు ప్రయాణంపై డిపెండ్ అయి ఉంటారు. కొందరు రోజూవారీ పనుల్లోకి వెళ్లేవారు సైతం రైలు సహాయంతో గమ్యాలకు చేరుకుంటారు. మరికొందరు విహార యాత్రలకు, ఇతర పనులకు వెళ్లేవారు దీనిపైనే ఆధారపడుతారు. అయితే ట్రైన్ జర్నీలో సౌకర్యవంతంగా ప్రయాణం చేయాలంటే రిజర్వేషన్ టికెట్ ను కలిగి ఉండాలి. అప్పుడే ఎంత దూరమైనా అలసట లేకుండా వెళ్లొచ్చు. ఇందు కోసం ముందే టికెట్ బుక్ చేసుకోవాలి. అయితే కొందరు ఈ ట్రైన్ టికెట్ బుకింగ్ అవగాహన ఉన్న వాళ్లను వారికి తెలిసిన వారు టికెట్ బుక్ చేయమని అడుగుతారు. అయితే ఈ విషయంలో టికెట్ బుక్ చేసేవారు కాస్త ఆలోచించాలి. అదేంటంటే?

    ఒకప్పుడు ట్రైన్ టికెట్ బుకింగ్ గురించి పెద్దగా అవగాహన లేకపోవడంతో ట్రావెల్ ఏజెన్సీ వద్దకు వెళ్లి టికెట్ బుక్ చేసుకునేవారు. లేదా రైల్వే స్టేషన్ల్లోకి వెళ్లి టికెట్ కన్ఫామ్ చేసుకునేవాళ్లు. కానీ IRCTC ద్వారా ఎవరైనా బుక్ చేసుకునే సదుపాయాన్ని రైల్వే వ్యవస్థ కల్పించింది.అయితే రోజూవారీ ప్రయాణాలు చేసేవాళ్లు.. ఎక్కువగా ట్రైన్ జర్నీ చేసేవాళ్లకు దీనిపై అవగాహన ఉంటుంది. కానీ ఎప్పుడో ఓసారి రైలు ప్రయాణం చేసేవారు దీనిని పెద్దగా పట్టించుకోరు. దీంతో వారు ఇతరులపై ఆధారపడుతారు. అయితే ట్రావెల్ ఏజెన్సీలోకి వెళ్లి ట్రైన్ టికెట్ బుక్ చేసుకుంటే కొంత ఛార్జీలు వసూలు చేస్తారు. అదే తెలిసిన వారి దగ్గర ట్రైన్ టికెట్ బుక్ చేసుకుంటే ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయరు.

    అయితే కొందరు తమకు ట్రైన్ బుక్ చేయమని తెలిసిన వారిని అడగొచ్చు.కానీ ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అంటే రైల్వే నియమాల ప్రకారం IRCTC ద్వారా ఒక వ్యక్తి తన కోసం లేదా కుటుంబ సభ్యుల కోసం టికెట్ ను బుక్ చేసుకోవచ్చు. అలాగే తెలిసిన వారి కోసం బుక్ చేసుకోవచ్చు. ఇలా టికెట్ బుక్ చేసినప్పడు ఎలాంటి ఛార్జీలు పడవు. దీంతో వారు బుక్ చేసినందుకు ఎలాంటి డబ్బులు వసూలు చేయరాదు. ఒకవేల IRCTC ద్వారా టికెట్ బుక్ చేసి డబ్బులు తీసుకుంటే మాత్రం కచ్చితంగా జైళ్లో పెడుతారు. ఎందుకంటే ఇది కేవలం వినియోగదారుల సౌలభ్యం కోసం మాత్రమే యూజ్ చేయాలి.

    అయితే ట్రావెల్ ఏజెన్సీ వారికి మాత్రం ఇది వర్తించదు. ఎందుకంటే ఈ ఏజెన్సీ వారు ముందే రైల్వే వ్యవస్థ నుంచి అనుమతి తీసకుంటారు. దీంతో వారు రోజుకు ఎన్ని సార్లు అయినా టికెట్ బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ వ్యక్తిగతంగా టికెట్ బుక్ చేసుకునే సమయంలో అదనంగా ఛార్జీలు వసూలు చేస్తే మాత్రం రైల్వే బోర్డు కఠినంగా చర్యలు తీసుకుంటుంది. అందువల్ల రైల్వే టికెట్ బుకింగ్ చేసే సమయంలో ఈ నిబంధనలు పాటించాలని రైల్వే బోర్డు కోరుతోంది.