https://oktelugu.com/

Ada Sharma : పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన ప్రముఖ హీరోయిన్ అదా శర్మ..వైరల్ గా మారిన లేటెస్ట్ ఫోటోలు!

సోషల్ మీడియా లో నిత్యం యాక్టీవ్ గా ఉండే అదా శర్మ రీసెంట్ గా తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో ఒక వీడియో ని అప్లోడ్ చేసింది. ఈ వీడియోలో ఆమె బేబీ బంప్ (గర్భవతి) తో కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది

Written By:
  • Vicky
  • , Updated On : August 20, 2024 / 02:20 PM IST

    Adha Sharma Photos

    Follow us on

    Ada Sharma: కేవలం ఒకటి రెండు సినిమాలతోనే ఆడియన్స్ లో ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకున్న హీరోయిన్లు మన ఇండస్ట్రీ లో ఎంతోమంది ఉన్నారు. కానీ ఒక హీరోయిన్ సక్సెస్ అవ్వాలంటే అందం, టాలెంట్ ఒక్కటే ఉంటే సరిపోదు. బోలెడంత అదృష్టం కూడా ఉండాలి. అలా అందం, టాలెంట్ రెండు ఉన్నప్పటికీ అదృష్టం కలిసి రాక, టాలెంట్ కి తగ్గ గుర్తింపు, స్టార్ స్టేటస్ ని దక్కించుకోలేకపోయిన హీరోయిన్ అదా శర్మ. పూరీ జగన్నాథ్ , నితిన్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘హార్ట్ ఎటాక్’ అనే సినిమా ద్వారా ఈమె ఇండస్ట్రీ లోకి హీరోయిన్ గా అడుగుపెట్టింది. ఈ సినిమా అప్పట్లో కమర్షియల్ గా పర్వాలేదు అనే రేంజ్ లో ఆడినప్పటికీ అదా శర్మ నటన, అందం కి మంచి మార్కులే పడ్డాయి.

    కానీ ఆ తర్వాత ఈమెకి ఆడియన్స్ ఊహించినంత స్థాయి రాలేదు. ‘హార్ట్ ఎటాక్’ చిత్రం తర్వాత ఈ అమ్మాయి తెలుగులో ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’, ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’, ‘క్షణం’ ఇలా ఎన్నో సినిమాల్లో నటించింది. ఒక్క ‘క్షణం’ చిత్రం లో తప్ప, మిగిలిన అన్నీ సినిమాలలో సెకండ్ హీరోయిన్ రోల్స్ లో నటించే పరిస్థితి వచ్చింది. దానివల్ల ఆ సినిమాలు సూపర్ హిట్ అయ్యినప్పటికీ కూడా ఈమెకి అనుకున్న స్థాయిలో గుర్తింపు రాలేదు. కానీ బాలీవుడ్ లో మాత్రం ఈమెకు కావాల్సినంత గుర్తింపు కేవలం ఒక్క సినిమా తోనే వచ్చేసింది అని చెప్పొచ్చు. యదార్ధ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ‘ది కేరళ స్టోరీ’ అనే చిత్రంలో ఈమె ప్రధాన పాత్ర పోషించింది. ఈ చిత్రానికి ప్రేక్షకులు బాక్స్ ఆఫీస్ వద్ద బ్రహ్మరథం పట్టారు. అయితే సోషల్ మీడియా లో నిత్యం యాక్టీవ్ గా ఉండే అదా శర్మ రీసెంట్ గా తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో ఒక వీడియో ని అప్లోడ్ చేసింది. ఈ వీడియోలో ఆమె బేబీ బంప్ (గర్భవతి) తో కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

    ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘ఈ బేబీ బంప్ ని చూస్తే మీకు ఏ సినిమా గుర్తుకు వస్తుందో చెప్పగలరా..?, కావాలంటే హింట్స్ ఇస్తాను,ఈ సినిమా సమయం లో నేను ఎన్నో ప్రతికూల పరిస్థితులను ఎదురుకున్నాను’ అంటూ ఆమె ‘ది కేరళ స్టోరీ’ ని ఉద్దేశించి కామెంట్స్ చేసింది. గత ఏడాది విడుదలైన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 300 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ప్రస్తుతం ఈ చిత్రం జీ 5 ఓటీటీ యాప్ లో అందుబాటులో ఉంది. ఈ సినిమా తర్వాత ఆమె ‘బాస్టర్: ది నక్సల్ స్టోరీ’, ‘క్రిమినల్ ఆర్ డెవిల్’ వంటి సినిమాల్లో నటించింది కానీ, అవి అనుకున్న స్థాయిలో విజయం సాధించలేకపోయాయి. ఇప్పుడు ఆమె ‘ది గేమ్ ఆఫ్ జర్జిత్’ అనే హిందీ సినిమాలో నటిస్తుంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పనుల్లో ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.