కరోనా టైంలోనూ ఏపీలో రాజకీయాలు మంటపుట్టిస్తూనే ఉన్నాయి. అన్నిరాష్ట్రాల్లో కరోనా నివారణకు చర్యలు చేపడుతుంటే.. ఏపీలో మాత్రం స్థానిక సంస్థల ఎన్నికలపైనే చర్చ నడుస్తోంది. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ ప్రసాద్ వర్సెస్ జగన్ సర్కార్ వ్యవహారం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. ఢీ అంటే ఢీ అన్న తీరులో ఇరువురు పోటీపడ్డారు.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్
ఆఖరికి నిమ్మగడ్డ ప్రసాద్ హైకోర్టును ఆశ్రయించగా అతడికి తీర్పు వచ్చింది. అనేక కీలక పరిణామాల అనంతరం నిమ్మగడ్డ ప్రసాద్ తిరిగి ఏపీకి ఎన్నికల కమిషనర్ గా నియమితులయ్యారు. ఆయన ఎన్నికల కమిషనర్ ఉన్నప్పుడే ఏపీలో ఎన్నికలు నిర్వహించాలని చూస్తున్నాడు. గతంలో ఏకగ్రీవమైన స్థానాలకు కూడా తిరిగి ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషనర్ భావిస్తుండటంతో వివాదం నెలకొంది.
Also Read: రోజా ఫొటో షేర్ చేసి ట్విస్ట్ ఇచ్చిన బండ్ల గణేష్
ఈ విషయంలో జగన్ సర్కారుకు మద్దతుగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు మాట్లాడుతున్నారు. నిమ్మగడ్డ కు వ్యతిరేకంగా జగన్ సర్కార్ అనుకూలంగా సీపీఎం తన వాదనలు విన్పిస్తోంది. ఎన్నికలు నిర్వహించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయాన్ని తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. జగన్ సర్కారు తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయంపై సీపీఎం సైలంట్ గా ఉండగా.. సీపీఐ మాత్రం వ్యతిరేకిస్తూ అమరావతి రైతుల పక్షాన పోరాడుతోంది.
జగన్ సర్కార్ కు కోర్టుల్లో ఎదురుదెబ్బలు తగుతున్నా సీపీఎం మీడియా మాత్రం ప్రభుత్వానికి అనుకూలంగా కథనాలను ప్రసారం చేస్తోంది. ప్రజా సమస్యలపై పోరాడి పట్టు సాధించుకోవాల్సిన సీపీఎం జగన్ సర్కార్ కు మద్దతుగా నిలుస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ నిర్ణయాలకు ప్రతీసారి సీపీఎం మద్దతుగా నిలుస్తున్న సీఎం జగన్ మాత్రం పెద్దగా పట్టించుకోకపోవడం గమనార్హం.
Also Read: స్కూళ్ల ప్రారంభం: విద్యార్థులకు కరోనా భయం?
జగన్ తో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధుకు సన్నిహిత సంబంధాలు ఉండటంతో ఆయన ‘ఫ్యాన్’ గాలిలో సేద తీరుతుండటంపై సొంత పార్టీ నేతలే విమర్శిస్తున్నారు. జగన్ కోసం ఏపీలో కమ్యూనిస్టులు చెరోదారిలో వెళుతుండటం ఆసక్తిని రేపుతోంది. మున్ముందు కమ్యూనిస్టులు ఇలానే కొనసాగుతారా? లేక కలిసి జగన్ పై పోరాటం చేస్తారా? అనేది మాత్రం వేచిచూడాల్సిందే..!