
దుబ్బాక ఉప ఎన్నిక నేపథ్యంలో శనివారం టీఆర్‌ఎస్ నేతల ఇళ్లల్లో పోలీసలు సోదాలు నిర్వమించారు. దుబ్బాక జడ్పీటీసీ, ఎంపీపీ, మార్కెట్ కమిటీ చైర్మన్ సహా ఏక కాలంలో ఎనిమిది మంది నాయకుల ఇళ్లల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అయితే ఎటువంటి నగదు లభించలేదని పోలీసులు పేర్కొన్నారు. ఓటర్లను ప్రలోభ పెట్టడానికి నగదు పంచుతున్నారన్న సమాచారంతోనే ఇళ్లల్లో తనిఖీలు నిర్వహిస్తున్నామని వారు పేర్కొన్నారు. కాగా ఇదివరకు బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు బంధువల ఇంట్లో నగదు దొరికిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పుడు టీఆర్‌ఎస్ నాయకుల ఇళ్లల్లో తనిఖీలు నిర్వహించారు.