Homeఆంధ్రప్రదేశ్‌Minister Roja: ఓకే ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్.. రోజా హాట్ కామెంట్స్

Minister Roja: ఓకే ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్.. రోజా హాట్ కామెంట్స్

Minister Roja: జనసేన పార్టి అధినేత పవన్ కళ్యాణ్ పై ఏపి‌ మంత్రి ఆర్.కే.రోజా తీవ్ర స్ధాయిలో మండిపడ్డారు.. ఇవాళ తిరుపతి జిల్లా సచివాలయంలో జరిగిన వైయస్ఆర్ వాహనమిత్ర ఆటో, రిక్షా, టాక్సీ, వాహనదారులకు ఆర్ధిక సహాయము కార్యక్రమంకు ఏపి పర్యాటన శాఖామంత్రి ఆర్.కే.రోజా ముఖ్య అతిధిగా పాల్గోన్నారు.. ఏపి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విశాఖ నుండి ప్రారంభించిన వాహన మిత్ర కార్యక్రమాన్ని వర్చువల్ విధానంలో వీక్షించిన అనంతరం ఎం.పి. గురుమూర్తి, జిల్లా కలెక్టర్ కె వెంకటరమణా రెడ్డి, జిల్లా ఎస్.పి పరమేశ్వర రెడ్డిలు మంత్రి రోజాతో కలిసి లబ్ధిదారులకు మెగాచెక్ ను అందించారు.

Minister Roja
Minister Roja

ఈ సందర్భంగా ఆర్.కే.రోజా మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ ను చూసి జనం నవ్వుకుంటున్నారని, పార్టీ పెట్టి ఎన్నికల్లోకి వెళ్ళకుండా ఇతర పార్టీలకు ఓట్లేయమని చెప్పిన ఒకే ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ అని ఆమె ఎద్దేవా చేశారు.. డిజిటల్ క్యాంపెయిన్ చేస్తుండడం హాస్యాస్పదంగా ఉందని, ప్రజల హృదయాల్లో పవన్ కళ్యాణ్ ఎప్పటికీ స్థానం సంపాదించలేరని ఆమె చెప్పారు.. పవన్ కళ్యాణ్ మాట మీద అసలు నిలబడని వ్యక్తని, నాసిరకం పనులు చేసింది తెలుగుదేశం నాయకులని, రాష్ట్రంలో రోడ్ల దుస్థితికి కారణం తెలుగుదేశం పార్టీయే అని ఆమె విమర్శించారు.

Also Read: Monkeypox: బీ అలెర్ట్.. కరోనా పోయింది.. దేశంపైకి మరో కొత్త వైరస్ వచ్చింది

Minister Roja
Minister Roja

టిడిపిని, బిజెపిని పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించరని ఆమె మీడియా ముఖంగా అడిగారు.. ప్రధానమంత్రి దేశం కోసం అప్పులు చేయడం లేదా అని ఆమె గుర్తు చేశారు.. అప్పులు తెచ్చినా అభివృద్ధి కోసం జగన్ డబ్బులు ఖర్చు పెడుతున్నారని, జనంలో తిరగని ఒకే ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్, ఒక కాలు మీదే కాదు, రెండు కాళ్ళ మీద సరిగ్గా పవన్ కళ్యాణ్ నిలబడలేరని ఆరోపించారు.. ఆకాశాన్ని చూసి మూసేస్తే అది మనపైనే పడుతుందన్న విషయాన్ని పవన్ కళ్యాణ్ గుర్తుపెట్టుకోవాలని రోజా అన్నారు.. బిజెపితో కలవాల్సిన అవసరం మాకు లేదని, వచ్చే ఎన్నికల్లో సింగిల్ గా పోటీ చేస్తాంమని ఏపి మంత్రి ఆర్.కే.రోజా స్పష్టం చేశారు.

Also Read:Athma Sakshi Survey: ఆత్మసాక్షి సర్వే: తెలంగాణలో ఏ పార్టీకి ఎన్ని సీట్లంటే?

రూల్స్ పాటించని మంత్రి రోజా || Minister Roja Driving Share Auto || Minister Roja || Ok Telugu

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Exit mobile version