Homeఆంధ్రప్రదేశ్‌CM Jagan-Investors: జగన్ పెట్టుబడుల ప్లాన్.. ఎన్నికల్లో గెలిపిస్తుందా?

CM Jagan-Investors: జగన్ పెట్టుబడుల ప్లాన్.. ఎన్నికల్లో గెలిపిస్తుందా?

CM Jagan-Investors
CM Jagan-Investors

CM Jagan-Investors: ఇప్పటి వరకు నవరత్నాలు, సంక్షేమం చుట్టూ తిరిగిన వైసీపీ ప్రభుత్వ పాలన నయా ట్రెండ్ సెట్ చేసినట్లు కనిపిస్తుంది. విపక్షాల నోళ్లు మూతబడేందుకు జగన్ చేసిన ప్రయత్నం సఫలీకృతమైంది. రాష్ట్రానికి పెట్టుబడులు రావని వస్తున్న విమర్శలను రెండు రోజుల్లో మూతపడేలా చేశారు. రూ.2లక్షల కోట్ల పెట్టుబడులు టార్గెట్ గా పెట్టుకుంటే రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. ఇవన్నీ కాగితాల రూపంలో కనబడుతుంటే.. జగన్ మార్క్ బిజినెస్ ఇలా ఉంటుందని తెలియజెప్పారు. అయితే, ఇది ఎన్నికలకు ఎంతవరకు ఉపకరిస్తుందా అనేది ప్రధాన ప్రశ్న.

వైసీపీ అధికారం చేపట్టి నాలుగేళ్లు పూర్తవుతుంది. ఎన్నికలు సమీపిస్తున్న ప్రతిపక్షాల విమర్శల దాడి ఎక్కువవుతుంది. ప్రజల్లోనూ వ్యతిరేకత వస్తోంది. వీటన్నింటిని ఎదుర్కోవడానికి జగన్ వేసిన ఎత్తుగడ పనిచేసినట్లుగానే ఉంది. ప్రజల్లో ప్రభుత్వంపై పాజిటివ్ కోణాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. ఆ మేరకు గ్లోబల్ సమ్మిట్ ను ఏర్పాటు చేసి పెద్ద మొత్తంలో పెట్టుబడులు తీసుకువచ్చి అభివృద్ధికి బాటలు వేయబోతున్నట్లు సంకేతాలను ఇస్తున్నట్లు చెబుతున్నారు.

CM Jagan-Investors
CM Jagan-Investors

ప్రతిపక్షాలు కూడా ప్రస్తుతం నోరుమెదపని పరిస్థితికి తీసుకువచ్చారు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పందించారు. రాష్ట్రానికి శభ పరిణామం అంటూ వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నుంచి ఇంకా ఎటువంటి ప్రకటన రాలేదు. ఇంత వరకు బాగానే ఉన్నా, పరిశ్రమల ఏర్పాటు, పెట్టుబడులు, ఉపాధి అవకాశాల గురించి జగన్ స్పష్టత ఇవ్వలేదు. తొలిరోజు సమ్మిట్ పూర్తికాగానే మంత్రి అమర్నాథ్ విలేకరుల సమావేశం పెట్టి ఏదో గొప్ప విషయంగా చెప్పుకొచ్చారు ఆరు లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్తున్నారు వాస్తవానికి పరిశ్రమలు పెట్టేముందు అంచనాల తాలూకా లో మాత్రమే ఇవి. ఇవి వాస్తవ రూపం దాలిస్తే నిజంగానే నిరుద్యోవ సంస్థ తీరుతుంది. గ్లోబల్ సమ్మిట్ ద్వారా పెట్టుబడుల వరద పారబోతుందని, పారిశ్రామిక వృద్ధి జరుగబోతుందని చెబుతున్న జగన్‌ను ఎన్నికల్లో గెలుపు తెచ్చిపెడుతుందా అనే ప్రశ్నకు సమాధానం రాబోయే రోజులే నిర్ణయిస్తాయి.

SHAIK SADIQ
SHAIK SADIQhttps://oktelugu.com/
SHAIK SADIQ is a senior content writer who writes articles on AP Politics, General. He has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Politics. He Contributes Politics and General News. He has more than 10 years experience in Journalism.

Most Popular

Samsung Galaxy S26 FE: శామ్‌సంగ్ అభిమానులకు గుడ్‌న్యూస్.. ఈ రెండు త్వరలోనే మార్కెట్లోకి..

Samsung Galaxy S26 FE: ప్రముఖ టెక్ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్ మార్కెట్లోకి వస్తుందంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే ఆకర్షణీయమైన టాబ్లెట్ లను కూడా తీసుకువచ్చి...

Cockroach Janata Party : కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీ బలప్రదర్శన బలమా వాపా?

ఢిల్లీ వేదికగా జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ బలప్రదర్శన దేశ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ప్రారంభమైన ఈ ఉద్యమం, 23 రోజుల నిరాహార దీక్ష...

Balakrishna Injury: బాలయ్యకు తీవ్ర గాయాలు.. జూనియర్ ఎన్టీఆర్ షాకింగ్ ట్వీట్ వైరల్..

Balakrishna Injury: నేడు కాకినాడ లో నందమూరి బాలకృష్ణ NBK111 షూటింగ్ జరుగుతుండగా , యాక్షన్ సన్నివేశం చిత్రీకరణ సమయంలో బాలయ్య కి మజిల్ టియర్ అవ్వడం తో ఆయన్ని వెంటనే హాస్పిటల్...

Tollywood Directors: బాలీవుడ్ హీరోలతో సినిమాలు చేసే ఉద్దేశ్యం లేని తెలుగు దర్శకులు వీళ్లే…

Tollywood Directors: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్లు కొందరు తెలుగు హీరోలు అవకాశం ఇవ్వకపోవడంతో బాలీవుడ్ హీరోలతో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ముఖ్యంగా వంశీ పైడిపల్లి తెలుగు స్టార్...

Vemulawada Rajanna Temple: వేములవాడకు తండ్రి 7 లక్షల విరాళం.. తిరిగివ్వాలని కూతుళ్ల పోరాటం.. ఊహించని ట్విస్ట్

Vemulawada Rajanna Temple: తెలంగాణలో ప్రముఖ శైవ క్షేత్రాలలో అత్యంత ప్రసిద్ధి చెందింది వేములవాడ రాజేశ్వర ఆలయం. ఇక్కడ స్వామి వారు లింగం రూపంలో ఉంటారు. ఈ ఆలయంలో కోడె మొక్కులను చెల్లించడం...
Oktelugu Epaper
Exit mobile version