CM Jagan-Investors: ఇప్పటి వరకు నవరత్నాలు, సంక్షేమం చుట్టూ తిరిగిన వైసీపీ ప్రభుత్వ పాలన నయా ట్రెండ్ సెట్ చేసినట్లు కనిపిస్తుంది. విపక్షాల నోళ్లు మూతబడేందుకు జగన్ చేసిన ప్రయత్నం సఫలీకృతమైంది. రాష్ట్రానికి పెట్టుబడులు రావని వస్తున్న విమర్శలను రెండు రోజుల్లో మూతపడేలా చేశారు. రూ.2లక్షల కోట్ల పెట్టుబడులు టార్గెట్ గా పెట్టుకుంటే రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. ఇవన్నీ కాగితాల రూపంలో కనబడుతుంటే.. జగన్ మార్క్ బిజినెస్ ఇలా ఉంటుందని తెలియజెప్పారు. అయితే, ఇది ఎన్నికలకు ఎంతవరకు ఉపకరిస్తుందా అనేది ప్రధాన ప్రశ్న.
వైసీపీ అధికారం చేపట్టి నాలుగేళ్లు పూర్తవుతుంది. ఎన్నికలు సమీపిస్తున్న ప్రతిపక్షాల విమర్శల దాడి ఎక్కువవుతుంది. ప్రజల్లోనూ వ్యతిరేకత వస్తోంది. వీటన్నింటిని ఎదుర్కోవడానికి జగన్ వేసిన ఎత్తుగడ పనిచేసినట్లుగానే ఉంది. ప్రజల్లో ప్రభుత్వంపై పాజిటివ్ కోణాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. ఆ మేరకు గ్లోబల్ సమ్మిట్ ను ఏర్పాటు చేసి పెద్ద మొత్తంలో పెట్టుబడులు తీసుకువచ్చి అభివృద్ధికి బాటలు వేయబోతున్నట్లు సంకేతాలను ఇస్తున్నట్లు చెబుతున్నారు.
ప్రతిపక్షాలు కూడా ప్రస్తుతం నోరుమెదపని పరిస్థితికి తీసుకువచ్చారు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పందించారు. రాష్ట్రానికి శభ పరిణామం అంటూ వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నుంచి ఇంకా ఎటువంటి ప్రకటన రాలేదు. ఇంత వరకు బాగానే ఉన్నా, పరిశ్రమల ఏర్పాటు, పెట్టుబడులు, ఉపాధి అవకాశాల గురించి జగన్ స్పష్టత ఇవ్వలేదు. తొలిరోజు సమ్మిట్ పూర్తికాగానే మంత్రి అమర్నాథ్ విలేకరుల సమావేశం పెట్టి ఏదో గొప్ప విషయంగా చెప్పుకొచ్చారు ఆరు లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్తున్నారు వాస్తవానికి పరిశ్రమలు పెట్టేముందు అంచనాల తాలూకా లో మాత్రమే ఇవి. ఇవి వాస్తవ రూపం దాలిస్తే నిజంగానే నిరుద్యోవ సంస్థ తీరుతుంది. గ్లోబల్ సమ్మిట్ ద్వారా పెట్టుబడుల వరద పారబోతుందని, పారిశ్రామిక వృద్ధి జరుగబోతుందని చెబుతున్న జగన్‌ను ఎన్నికల్లో గెలుపు తెచ్చిపెడుతుందా అనే ప్రశ్నకు సమాధానం రాబోయే రోజులే నిర్ణయిస్తాయి.