HomeతెలంగాణVemulawada Rajanna Temple: వేములవాడకు తండ్రి 7 లక్షల విరాళం.. తిరిగివ్వాలని కూతుళ్ల పోరాటం.. ఊహించని...

Vemulawada Rajanna Temple: వేములవాడకు తండ్రి 7 లక్షల విరాళం.. తిరిగివ్వాలని కూతుళ్ల పోరాటం.. ఊహించని ట్విస్ట్

Vemulawada Rajanna Temple: తెలంగాణలో ప్రముఖ శైవ క్షేత్రాలలో అత్యంత ప్రసిద్ధి చెందింది వేములవాడ రాజేశ్వర ఆలయం. ఇక్కడ స్వామి వారు లింగం రూపంలో ఉంటారు. ఈ ఆలయంలో కోడె మొక్కులను చెల్లించడం ఒక ఆనవాయితీ. ఆలయానికి సమీపంలోనే బద్ది పోచమ్మ ఆలయం ఉంటుంది. స్వామివారిని దర్శించుకున్న తర్వాత పోచమ్మకు బోనం సమర్పిస్తూ ఉంటారు భక్తులు. ఇక్కడికి దగ్గర్లోనే కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం కూడా ఉంటుంది. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం వేములవాడ క్షేత్రాన్ని అభివృద్ధి చేస్తోంది.

వేములవాడ రాజన్న ఆలయానికి భక్తులు భారీగానే కానుకలు సమర్పిస్తుంటారు. కొందరు ధనం రూపంలో.. ఇంకొందరు వస్తువుల రూపంలో కానుకలను ఇస్తుంటారు. అయితే వేములవాడ రాజన్న ఆలయానికి ఓ దంపతులు ఇచ్చిన విరాళం ఇప్పుడు చర్చకు దారి తీసింది. అంతేకాదు ఇచ్చిన విరాళాన్ని తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేయడం సంచలనంగా మారింది.

వేములవాడ రాజన్న ఆలయానికి ఇదే పట్టణానికి చెందిన సుభాష్ నగర్ వాస్తవ్యులు పసుల లక్ష్మీనారాయణ, జనాభాయ్ దంపతులు ఏడు లక్షల ఒక వెయ్యి 116 రూపాయలను విరాళంగా అందించారు. స్వామి వారి నిత్యాన్నదాన ట్రస్టుకు దీనిని ఉపయోగించాలని వారు కోరారు. ఆ సమయంలో లక్ష్మీనారాయణ దంపతులకు గర్భగుడి దర్శనం కల్పించారు ఆలయ కమిటీ వారు. ఆ తర్వాత స్వామివారి శేష వస్త్రాలు.. కళ్యాణ లడ్డు వారికి అందించారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ ఇటీవల లక్ష్మీనారాయణ కుమార్తెలు ఆలయ నిర్వాహకుల దగ్గరికి వచ్చారు.. దర్శనం కోసమని నిర్వాహకులు అనుకున్నారు. కానీ వారు వచ్చింది దర్శనానికి కాదు..

లక్ష్మీనారాయణకు మతిస్థిమితం లేదని.. అందువల్లే ఏడు లక్షల రూపాయలను దేవస్థానం నిత్యాన్నదాన ట్రస్టుకు అందించారని.. ఇప్పుడు లక్ష్మీనారాయణ ఆరోగ్యం బాగోలేదని.. ఆసుపత్రిలో చూపించాలని వారు ఆలయ అధికారులతో చెప్పారు. అంతేకాదు నిత్యాన్నదాన ట్రస్ట్ కు ఇచ్చిన డబ్బులను తిరిగి ఇవ్వాలని ఆలయ అధికారులను కోరారు. అయితే దీనిపై ఆలయ అధికారులు స్పష్టత ఇచ్చారు. నిత్య అన్నదాన ట్రస్టు మాత్రమే కాదని.. ఆలయ అభివృద్ధికి ఇచ్చిన విరాళాన్ని తిరిగి ఇవ్వడం కుదరదని అధికారులు స్పష్టం చేశారు. ఒకసారి విరాళం ఇచ్చిన తర్వాత తిరిగి ఇవ్వడానికి నిబంధనలు ఒప్పుకోవని వారు చెప్పారు. దీంతో లక్ష్మీనారాయణ కుమార్తెలు వెనుతిరి గారు. లక్ష్మీనారాయణ ఆలయానికి విరాళం ఇచ్చినప్పుడు ఆయన ఆరోగ్యం బాగానే ఉందని ఆలయ అధికారులు చెబుతున్నారు. ఆయన కుమార్తెలు మాత్రం మతిస్థిమితం సరిగా లేకపోవడం వల్లే డబ్బులు ఇచ్చారని అంటున్నారు. మరి దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Oktelugu Epaper
Exit mobile version