Homeబిజినెస్Samsung Galaxy S26 FE: శామ్‌సంగ్ అభిమానులకు గుడ్‌న్యూస్.. ఈ రెండు త్వరలోనే మార్కెట్లోకి..

Samsung Galaxy S26 FE: శామ్‌సంగ్ అభిమానులకు గుడ్‌న్యూస్.. ఈ రెండు త్వరలోనే మార్కెట్లోకి..

Samsung Galaxy S26 FE: ప్రముఖ టెక్ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్ మార్కెట్లోకి వస్తుందంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే ఆకర్షణీయమైన టాబ్లెట్ లను కూడా తీసుకువచ్చి వినియోగదారుల మనసును దోచుకుంటుంది. ఇందులో భాగంగా ఈ కంపెనీ ప్రీమియం సెగ్మెంట్ లో కొత్త మోడల్ ను పరిచయం చేయబోతుంది Galaxy S26 FE తో పాటు Galaxy Tab S12 సిరీస్ ట్యాబ్లెట్‌లను త్వరలోనే మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. తాజాగా ఈ డివైజ్‌లు గూగుల్ అధికారిక యాప్ కోడ్‌లో కనిపించడంతో, వీటి అధికారిక లాంచ్ త్వరలోనే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇవి ఉలా ఉంటాయంటే?

సాధారణంగా గూగుల్ తమ కొత్త AI సేవలకు సంబంధించి Google AI Free Trial ఆఫర్ ఇచ్చే డివైజ్‌ల జాబితాను అంతర్గతంగా నిర్వహిస్తుంది. ఆండ్రాయిడ్ అథారిటీ నివేదిక ప్రకారం.. ఈ ఆఫర్ పొందే డివైజ్‌ల కోడ్ జాబితాలో Galaxy S26 FE , Galaxy Tab S12 పేర్లు కనిపించాయి. వీటిలో Galaxy S26 FE టాబ్లెట్ డిజైన్ Galaxy S26 సిరీస్‌ను పోలి ఉండనుంది. Exynos 2500 చిప్‌సెట్, 8GB RAM , 512GB వరకు అంతర్గత స్టోరేజ్ ఆప్షన్లు ఉండే అవకాశం ఉంది. 5,000 mAh మెరుగైన బ్యాటరీ ఉండగా.. దీనిికి 25W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండవచ్చని లీక్స్ చెబుతున్నాయి.

Galaxy Tab S12 Series అల్ట్రా మోడల్‌లో 14.6 అంగుళాల అతిపెద్ద AMOLED డిస్‌ప్లే ను కలిగి ఉంది. సన్నని బెజెల్స్ , S Pen సపోర్ట్ ఉండనున్నాయి. ఇందలుో మీడియాటెక్ ఫ్లాగ్‌షిప్ Dimensity 9500 ప్రాసెసర్‌ ఉండడంతో అత్యంత వేగవంతమైన పనితీరును కనబరుస్తుంది. Android 16 ఆధారిత One UIతో రానున్న ఈ ట్యాబ్‌లలో గూగుల్, శామ్‌సంగ్ అభివృద్ధి చేసిన ఆధునిక AI ఫీచర్లు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.

గతంలో శామ్‌సంగ్ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ మాసంలో ఈ డివైజ్‌లు అధికారికంగా విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే, గూగుల్ యాప్‌లో ఇప్పటికే ఇవి ప్రత్యక్షమవ్వడంతో ఆ సమయం కంటే ముందే (ఆగస్టు చివర్లోనే) మార్కెట్లోకి వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదని టెక్ విశ్లేషకులు భావిస్తున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...

Punjab Politics : పంజాబ్ పై మోడీ ఫోకస్.. ఏదో పెద్ద ప్లానింగే

Punjab Politics : పంజాబ్‌లో గతంలో నిరాశాజనకంగా ఉన్న ఫలితాలను పక్కనబెట్టి, బీజేపీ ఇప్పుడు పూర్తి ఆత్మవిశ్వాసంతో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం రెండు సీట్లతో...

Team India : ఈ స్క్రాప్ బౌలింగ్ తో వరల్డ్ కప్ కాదు కదా.. గ్రూప్ స్టేజీ దాటడం...

Team India : ఐపీఎల్ అనేది కాసుల క్రీడ. కేవలం బ్యాటర్ల కోసం మాత్రమే మైదానాలను రూపొందిస్తారు. అవన్నీ కూడా ప్లాట్ గా ఉంటాయి. ఒకరకంగా చెప్పాలంటే సిమెంట్ రోడ్ లాంటి మైదానాలు...

Karakatta Kamal Haasan : ఆ కరకట్ట కమల్ హాసన్ ఏం చేస్తున్నారో తెలుసా..

Karakatta Kamal Haasan : 2014లో ఏపీ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా వేదికను నిర్మించారు. ఆ నిర్మాణం అక్రమం అంటూ...
Oktelugu Epaper
Exit mobile version