AP Cabinet Reshuffle: మంత్రివర్గ కూర్పుపై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి సారించారు. రాబోయే ఎన్నికలకు పార్టీని ముందుకు నడిపించేందుకు సిద్ధమయ్యారు. దీని కోసం పార్టీ నేతలకు కీలక బాధ్యతలు అప్పగించనున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో మంత్రి పదవులు దక్కని వారికి జిల్లా ఇన్ చార్జి పదవులు అప్పగించేందుకు ప్రణాళికలు ఖరారు చేసినట్లు చెబుతున్నారు. ఇప్పటికే మంత్రివర్గ విస్తరణపై స్పష్టత ఇవ్వడంతో ఎవరెవరికి మంత్రి పదవులు ఇవ్వాలనే దానిపై ఆయనో ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ఉన్న మంత్రుల్లో కొందరిని కొనసాగించేందుకు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. వారిలో కొడాలి నాని, పేర్ని నాని, బుగ్గన, పెద్దిరెడ్డి లాంటి వారు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక చాలా మందిని రాజీనామా చేయించి వారి స్థానంలో కొత్త వారికి పదవులు ఇచ్చేందుకు రెడీ అయినట్లు చెబుతున్నారు బొత్సను కూడా మంత్రి పదవి నుంచి తప్పించి రాజ్యసభకు పంపనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
Also Read: ఇంకో రెండు సార్లు జగన్‌ను సీఎం చేయాలట.. సుమన్‌పై విరుచుకుపడుతున్న నెటిజన్లు..!
సామాజిక సమీకరణల నేపథ్యంలో జగన్ మంత్రి వర్గాన్ని కూర్చుకోనున్నట్లు తెలుస్తోంది. మంత్రి పదవులు కేటాయించేందుకు ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు సమాచారం. రాబోయే ఎన్నికలను గమనించి తన మంత్రివర్గంలో స్థానం కల్పించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెబుతున్నారు. హోం మంత్రి పదవి కూడా మహిళకే కేటాయించాలని చూస్తున్నారు. ఇందులో భాగంగానే కేబినెట్ లో అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం వహించేలా చూస్తున్నారు.
అయితే బొత్స సత్యనారాయణ విషయంలో మాత్రం ఇప్పటికి స్పష్టత రాలేదు. ఆయనకు రాజ్యసభ పదవి ఇస్తారనే ప్రచారం సాగుతున్నా ఆయనకు రీజినల్ కమిటీ బాధ్యతలు అప్పగిస్తారనే వాదన వస్తోంది. ఈ నేపథ్యంలో జగన్ మంత్రివర్గాన్ని సమర్థులైన వారికి అప్పగించేందుకు నిర్ణయించుకున్నట్లు సమాచారం. రాబోయే ఎన్నికల్లో పార్టీని గట్టెక్కించే వారి కోసం జగన్ ఆసక్తి చూపిస్తున్నట్లు చెబుతున్నారు.
Also Read: పవన్ కళ్యాణ్ 8 సంవత్సరాల్లో ఎంత మార్పు?