Telangana Assembly Session 2022: తెలంగాణ శాసనసభ సమావేశాలు ముగిశాయి. చివరి రోజు సీఎం కేసీఆర్ పలు వరాలు కురిపించారు. అదే సందర్భంలో కేంద్రంపై తన అక్కసు వెళ్లగక్కారు. క్షేత్ర సహాయకులను విధుల్లోకి తీసుకోనున్నట్లు తెలిపారు. మెప్మా సిబ్బందికి కూడా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు చెల్లిస్తామని చెప్పారు. దీంతో సభలో హర్షం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు సైతం సీఎం చర్యలకు మద్దతు తెలిపారు. సీఎం నిర్ణయాలు భేషుగ్గా ఉన్నాయని కితాబిచ్చారు దీంతో సభ నిర్వహణ అంతా సజావుగా సాగింది.
కేంద్రంపై సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేకంగా కేంద్రం వ్వవహరిస్తోందని దుయ్యబట్టారు. మత చాందసవాదంతో రాష్ట్రాల్లో చిచ్చు పెట్టే కుట్రలను చేస్తోందని విమర్శించారు. ఇది మంచి సంప్రదాయం కాదని చెబుతున్నారు. బీజేపీ తీసుకుంటున్న నిర్ణయాలు సరైనవి కావని హితవు పలికారు. బడ్జెట్ కూడా అంకెల గారడీ మాదిరి ఉంటోందని అభిప్రాయం వ్యక్తం చేశారు. పరిపాలనలో వివక్ష సాగుతోందని సూచించారు.
Also Read: పవన్ కళ్యాణ్ 8 సంవత్సరాల్లో ఎంత మార్పు?
కేంద్రం ఇబ్బడిముబ్బడిగా అప్పులు చేస్తోందన్నారు. ప్రస్తుతం దేశం రూ.152 లక్షల కోట్లు అప్పుగా తెచ్చుకుందన్నారు. దీంతో కేంద్రం ప్రజావ్యతిరేక విధానాలు అవలంభిస్తోందని తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం రూ.58.5 శాతం అప్పు తీసుకుంటోంది. మరోవైపు వీఆర్ఏ లను సాగునీటి రంగంలోకి తీసుకోనున్నట్లు సభాముఖంగా తెలిపారు. లష్కర్ పోస్టుల్లో వారి సేవలు వినియోగించుకుంటాం. వారికి సరైన వేతనాలు అందజేసేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.
కేంద్రంపైనే పలు ఆరోపణలు చేశారు. దేశంలో ప్రజాస్వామ్యం నానాటికి దిగజారిపోతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీపై హుజురాబాద్ ఉప ఎన్నిక నుంచి సీఎం విమర్శలు చేస్తూనే ఉన్నారు. ధాన్యం కొనుగోలును సాకుగా చూపి కేంద్రంపై దాడికి దిగినా అది నెరవేరలేదు. ఇక లాభం లేదనుకుని ఇక ప్రత్యక్ష పోరుకే సై అన్నారు. ఈ క్రమంలో కేసీఆర్ తమకు ప్రత్యామ్నాయంగా మారిన బీజేపీని ఎదుర్కోవాలనే ఉద్దేశంతోనే ఎక్కడికక్కడ అడ్డు తగులుతున్నారు. దీంతోనే ప్రస్తుతం శాసనసభ వేదికగా కూడా బీజేపీని టార్గెట్ చేసుకోవడంతో పలు ప్రశ్నలు వస్తున్నాయి.
Also Read: పవన్ స్పీచ్‌తో టీడీపీలో కొత్త ఆశలు.. వైసీపీలో అలజడి