PM Kisan Annadata Sukhibhava Update: ఏపీలో( Andhra Pradesh) రైతులకు గుడ్ న్యూస్. గత కొంతకాలంగా వేచి చూస్తున్న అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్ నిధుల మంజూరుకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. నిధుల విడుదలకు ముహూర్తం ఖరారు అయింది. 22వ విడత పిఎం కిసాన్ తో పాటు మూడో విడత అన్నదాత సుఖీభవ నిధుల విడుదలకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో రైతులకు కీలక సూచన కూడా చేసింది ప్రభుత్వం. ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతులకు పిఎం కిసాన్ నిధులు విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నదాత సుఖీభవ జమచేస్తోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఇప్పుడు రూ.6000 రైతుల ఖాతాల్లో జమ చేయనున్నాయి.
Also Read: విజయ్-త్రిషల ప్రేమకి ‘విక్రమ్-జ్యోతిక’లే కారణమా? ఆసక్తికరమైన కథనం!
* ఆ హామీ మేరకు..
తాము అధికారంలోకి వస్తే కేంద్ర ప్రభుత్వంతో కలిపి.. రైతుకు సాగు సాయం కింద 20 వేల రూపాయలు అందిస్తామని చంద్రబాబు( CM Chandrababu) హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ హామీ మేరకు గత రెండుసార్లు 7వేల రూపాయల చొప్పున.. మొత్తం 14 వేల రూపాయలను అందించారు. చివరి విడతగా 6000 రూపాయలు అందించేందుకు తాజాగా నిర్ణయించారు. అయితే ఈ నిధుల కోసం రైతులు చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. గత ఏడాది నవంబర్లో పిఎం కిసాన్ తో పాటు అన్నదాత నిధులు విడుదలయ్యాయి. మొన్న సంక్రాంతి సమయంలోనే చివరి విడత నిధులు విడుదలవుతాయని అంతా భావించారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ నెల 24న ఈ రెండు పథకాలకు సంబంధించి రైతుల ఖాతాల్లో 6000 చొప్పున జమ చేయనున్నట్లు తెలుస్తోంది.
* దేశవ్యాప్తంగా సాయం..
దేశవ్యాప్తంగా పీఎం కిసాన్( pm Kisan) కింద 11 కోట్ల మంది రైతులు లబ్ధి పొందుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇప్పటివరకు 21 విడతల్లో నాలుగు లక్షల కోట్లకు పైగా నిధులు అందించినట్లు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం సైతం కేంద్ర ప్రభుత్వం అందించే 6 వేలకు తోడు.. 14 వేల రూపాయలు జతచేస్తూ అన్నదాత సుఖీభవ కింద అందిస్తోంది. అయితే పారదర్శకత కోసం అర్హులైన ప్రతి రైతు ఈ కేవైసీ పూర్తి చేయాలని సూచిస్తుంది. లబ్ధిదారులు కామన్ సర్వీస్ సెంటర్లలో బయోమెట్రిక్ ఆధారిత ఈ కేవైసీ చేసుకోవచ్చు. పీఎం కిసాన్ పోర్టల్ లోను ఆధార్ ఓటిపి ద్వారా ఈ ప్రక్రియ పూర్తి చేయవచ్చు. మొత్తానికి అయితే పీఎం కిసాన్ – అన్నదాత సుఖీభవ పై ఒక క్లారిటీ వచ్చినట్లు అయింది.