Lava Bold 2 5G: ఫోన్ కొనాలని అందరికీ ఉంటుంది. కానీ బడ్జెట్లో కొనాలని కొందరు అనుకుంటూ ఉంటారు. ఇలాంటి వారికి కొన్ని కంపెనీలు లో బడ్జెట్లో మొబైల్స్ ను అందిస్తూ ఉంటాయి. అయితే మిడ్ రేంజ్ పీపుల్స్ కు అనుగుణంగా ఉండే విధంగా Lava కంపెనీ భారత్లో కొత్త కొత్త ఫోన్లను తీసుకువస్తుంది. ఇప్పటికే 2025 సంవత్సరంలో Lava 5G మొబైల్స్ ను లాంచ్ చేసి అందరిని ఆకట్టుకుంది. అయితే ఇప్పుడు దీనికి కొనసాగింపుగా Lava Bold 2 5G నీ మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతుంది.. ఇది అమెజాన్ మార్కెట్లో అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. అయితే దీని గురించి ఇప్పటికే ఆన్లైన్లో వచ్చిన సమాచారం ప్రకారం ఫోన్ ఎలా ఉంటుందో ఊహించుకుంటున్నారు. ఈ ఫోన్ ఎలా ఉండబోతుంది అంటే?
Also Read: జస్ ప్రీత్ బుమ్రా టీమిండియా వజ్రాయుధం.. బంతి పడితే వికెటే!
2026 మార్చి 13న Lava Bold 2 5G అందుబాటులో ఉండనుంది. ఈ మొబైల్లో ప్రధానంగా నాణ్యమైన కెమెరా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ కెమెరాలు దీర్ఘచతురస్రాకార ఆకారంలో ఉంటాయి. కెమెరాల పక్కన లేదే
LED ఫ్లాష్ లైట్ ఉండనుంది. ఈ ఫోన్ ఛానల్ మొత్తం ప్లాట్ గా ఉంటుంది. దీంతో చేతిలో పట్టుకోవడానికి సౌకర్యవంతంగా ఉంటుంది. కుడివైపున పవర్ బటన్ వాల్యూమ్ కీస్ ఉండనున్నాయి.
ఈ మొబైల్ గురించి పూర్తి స్పెసిఫికేషన్స్ తెల్పనప్పటికీ ఈ ఫోన్ 8.5 మిల్లీమీటర్ల మందంతో ఉంటుందని తెలుస్తోంది. అయితే ఇప్పటికే మార్కెట్లోకి వచ్చిన లావా బోల్డ్ 5G లో ఉండే ఫీచర్స్ కొత్త మొబైల్స్ లో ఉంటాయని తెలుస్తోంది. ఈ మొబైల్లో 6.67 అంగుళాల AMOLED డిస్ప్లేను అమర్చారు. అలాగే ఇందులో 6300 డైమెన్సిటీ చిప్ సెట్ ఉండనుంది. 6 జిబి వరకు రామ్ ఉండడంతో మల్టీ టాస్కింగ్ కోసం యూస్ చేసేవారు ఈ మొబైల్ ను కొనుగోలు చేయవచ్చని అంటున్నారు. అలాగే ఈ మొబైల్లో 64 MP మెయిన్ కెమెరా ఉండనుంది. ఈ కెమెరా ప్రీమియం ఫోన్ వలె అద్భుతమైన స్నాప్స్ అందిస్తుంది. ఏఐ ఫీచర్స్ కూడా ఇందులో కనిపించే అవకాశం ఉంది. అలాగే 16 MP ఫ్రంట్ కెమెరాతో పాటు వీడియో కాలింగ్ కోసం పనిచేయనుంది.
బ్యాటరీ కూడా పాత మొబైల్ లాగే కొత్త ఫోన్లో ఉండే అవకాశం ఉందని అంటున్నారు. పాత మొబైల్లో 5000 mAh బ్యాటరీ ఉండగా దీనికి 33 W ఫాస్టెస్ట్ చార్జింగ్ సపోర్ట్ గా ఉండనుంది. బిజీగా ఉండే వారితోపాటు.. రోజువారి అవసరాలకు ఈ మొబైల్ బ్యాటరీ బాగా సరిపోతుంది అని అంటున్నారు. ఇక ధర విషయంలో లావా కంపెనీ ఎప్పుడు మిడిల్ క్లాస్ కు అనుగుణంగానే ఉంటుంది. కొత్త ఫోన్ ధర రూ.13,999 ప్రారంభం నుంచి ఉండే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.