Megastar Chiranjeevi- Anasuya Bharadwaj: మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్’లో యాంకర్ అనసూయ ఓ కీలక పాత్రలో నటించబోతున్న సంగతి తెలిసిందే. అయితే, అనసూయకు చిరంజీవి వార్నింగ్ ఇచ్చారట. షూటింగ్ కి లేట్ గా వరుసగా రెండు రోజులు లేట్ గా రావడంతో.. చిరు సున్నితంగా మందలించారని తెలుస్తోంది. రీసెంట్ గా సెట్ లో అనసూయ పై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు.

ఈ సినిమాలో అనసూయ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతుంది. అలాగే ఈ సినిమాలో సీనియర్ నటుడు విజయచందర్ నటిస్తున్నాడు. సినిమాలో ఆయన పాత్ర హీరో తండ్రి పాత్ర. అంటే.. హీరోని చిన్నతనం నుంచి పెంచే పాత్ర అట. పైగా విజయచందర్ ది సినిమాలోనే వెరీ ఎమోషనల్ రోల్ అని, ఇంటర్వెల్ లో ఆయన పాత్ర చనిపోతుందని తెలుస్తోంది.
Also Read: ఇంటర్వ్యూ : రాజమౌళి – ‘ఆర్ఆర్ఆర్’ చూస్తున్నప్పుడు మీకు అసలు ఆ ఫీల్ రాదు
మొత్తమ్మీద ఏభై ఏళ్ల సినిమా జీవితంలో విజయచందర్ కి ఇది మర్చిపోలేని పాత్ర అట. అందుకే, ఈ సినిమా కోసం విజయచందర్ ప్రత్యేకమైన కేర్ తీసుకుని మరీ తన పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఆయన పాత్ర ప్లాష్ బ్యాక్ ను ఎలివేట్ చేస్తూ ఒక పాట పాడాల్సి ఉంటుందట, ఆ పాటలో చాలా డెప్త్ ఉంటుందట. ఈ నెల 23వ తేదీ నుంచి జరగనున్న షెడ్యూల్ లో విజయచందర్ కు సంబంధించిన కీలక సీన్స్ ను షూట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమాలో స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కూడా ఓ కీలక పాత్రలో నటించడానికి అంగీకరించాడు. అలాగే యంగ్ హీరో సత్యదేవ్ తో పాటు మరో మలయాళ హీరో సురేష్ గోపి కూడా నటిస్తున్నాడు. ఏది ఏమైనా సల్మాన్ ఖాన్ నటిస్తే.. ఈ సినిమా పై బాలీవుడ్ లో కూడా మంచి బజ్ క్రియేట్ అవుతుంది.

కాగా కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలిమ్స్, ఎన్వీఆర్ సినిమా సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో మెగాస్టార్ వెరీ స్టైలిష్ గా నటించబోతున్నారు, అందుకే ఈ చిత్రం పై రోజురోజుకు అంచనాలు రెట్టింపు అవుతున్నాయి.
Also Read: ఆర్ఆర్ఆర్ ప్రమోషన్.. డ్రెస్ కోడ్ తో తగ్గేదేలే అంటున్న రాజమౌళి, రాంచరణ్, ఎన్టీఆర్
[…] Also Read: Megastar Chiranjeevi- Anasuya Bharadwaj: అనసూయకి వార్నింగ్ ఇచ… […]