ఏపీ ఆర్థిక మంత్రి హస్తిన బాట..: ఎందుకో తెలుసా..!

అదేంటి.. రాష్ట్రంలో విద్యాశాఖకు సంబంధించి ప్రోగ్రామ్‌ను అట్టహాసంగా నిర్వహించేందుకు జగన్‌ ప్రభుత్వం సిద్ధపడితే.. ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఢిల్లీలో వాలిపోవడం ఏంటో అంతుచిక్కని ప్రశ్న. అమ్మ ఒడి పేరుతో జగన్‌మోహన్‌రెడ్డి మీట నొక్కి తల్లుల ఖాతాల్లో డబ్బులు చేయాలని నిర్ణయించారు. కానీ.. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఢిల్లీలో అధికారుల బృందంతో వాలిపోయారు. ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో పాటు మంత్రి నిర్మలా సీతారామన్‌తోనూ సమావేశం కానున్నారు. Also Read: కోర్టు ‘ఎస్‌’ చెప్తుందా.. ‘నో’ […]

Written By: Srinivas, Updated On : January 11, 2021 2:39 pm
Follow us on


అదేంటి.. రాష్ట్రంలో విద్యాశాఖకు సంబంధించి ప్రోగ్రామ్‌ను అట్టహాసంగా నిర్వహించేందుకు జగన్‌ ప్రభుత్వం సిద్ధపడితే.. ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఢిల్లీలో వాలిపోవడం ఏంటో అంతుచిక్కని ప్రశ్న. అమ్మ ఒడి పేరుతో జగన్‌మోహన్‌రెడ్డి మీట నొక్కి తల్లుల ఖాతాల్లో డబ్బులు చేయాలని నిర్ణయించారు. కానీ.. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఢిల్లీలో అధికారుల బృందంతో వాలిపోయారు. ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో పాటు మంత్రి నిర్మలా సీతారామన్‌తోనూ సమావేశం కానున్నారు.

Also Read: కోర్టు ‘ఎస్‌’ చెప్తుందా.. ‘నో’ అంటుందా..?

ఆర్థిక సంవత్సరం ముగింపునకు రావడం.. అప్పులు పుట్టే మార్గాలన్నీ మూసుకుపోవడం.. చెల్లింపుల ఒత్తిడి పెరగడంతో ప్రభుత్వం అత్యవసర నిధుల కోసం ప్రయత్నిస్తోంది. అదే సమయంలో అమ్మఒడి కోసం దాదాపుగా ఆరున్నర వేల కోట్లు పంపిణీ చేయాల్సి ఉంది. అన్నీ ఒక్కసారే పంపిణీ చేసే పరిస్థితి లేదు. విడతల వారీగా నెలాఖరులోపు మొత్తం పంపిణీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

Also Read: ఆ తల్లుల ఖాతాల్లోకి రూ.6,673 కోట్లు

అయితే.. ఈ నిధుల సర్దుబాటుకే బుగ్గన ఢిల్లీ బాట పట్టినట్లుగా తెలుస్తోంది. మరో వైపు.. బడ్జెట్ కసరత్తు కూడా ఫుల్ స్వింగ్‌లో ఉంది. వచ్చే ఏడాది మరింత తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిని ఏపీ ప్రభుత్వం ఎదుర్కోనుంది. బడ్జెట్‌లో మరింత మెరుగైన ప్యాకేజీ పొందకపోతే ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. వీటన్నింటినీ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు బుగ్గన ప్రయత్నిస్తున్నారు. గత ప్రభుత్వం.. ఈ ప్రభుత్వం చేసిన కొన్ని అప్పులను తిరిగి చెల్లించడం వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. అవి చెల్లించాలంటే.. మరింత ఆదాయ వనరు ఉండాల్సి ఉంది. అదే సమయంలో.., కోవిడ్ కారణంగా ఎఫ్‌ఆర్బీఎం చట్టాన్ని సవరించి ఎక్కువ రుణాలు తీసుకునే ఛాన్సిచ్చారు. వచ్చే ఏడాది ఆ ఛాన్స్ ఉంటుందో లేదో కూడా తెలియదు. అదే జరిగితే రుణసామర్థ్యం కూడా తగ్గిపోతుంది.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని.. ఈ కారణంగా బుగ్గన ముందు జాగ్రత్తగా ఢిల్లీలో ఆర్థిక శాఖ అధికారులతో చర్చలు జరుపుతున్నారని అంటున్నారు. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆర్థిక మంత్రిగా తన పూర్తి సమయాన్ని నిధుల సమీకరణ కోసమే వెచ్చిస్తున్నారు. ఎక్కువగా ఢిల్లీలోనే ఉండి కేంద్ర సాయం కోసం ప్రయత్నిస్తున్నారు. కొసమెరుపు ఏంటంటే ఆయన ఎంతగా ప్రయత్నిస్తున్నా.. పోలవరానికి సంబంధించిన నిధులు.. ఎప్పుడో విడుదల చేస్తున్నట్లుగా కేంద్రం ప్రకటించినా ఇంత వరకూ విడుదల చేయలేదు.