https://oktelugu.com/

ఎవరూ చేయని తప్పు.. చంద్రబాబు చేస్తున్నారా..?

ఏపీలో విగ్రహాల ధ్వంసం చేస్తూ ఆలయాల్లో విధ్వంసం సృష్టిస్తున్నారు అల్లరిమూకలు. అసలు ఎవరు ఎందుకు చేస్తున్నారో కూడా అంతుబట్టని విషయం. ఇప్పుడు ఏపీ వేదికగా ఈ దేవతా విగ్రహాల మీదనే రాజకీయం నడుస్తోంది. విపక్షాలు ఒక్కొక్కటిగా జగన్ సర్కార్ మీద పడి చేయాల్సినదంతా చేస్తున్నాయి. ఏపీలో అధికార వియోగంతో విలవిలలాడుతున్న తెలుగుదేశం పార్టీ అయితే దీన్ని అతి పెద్ద ఇష్యూ చేస్తోంది. Also Read: నిమ్మగడ్డ మరో బహిరంగ లేఖ.. ఈసారి వాళ్లు టార్గెట్ మొత్తంగా జనంలో […]

Written By:
  • Srinivas
  • , Updated On : January 11, 2021 / 02:54 PM IST
    Follow us on


    ఏపీలో విగ్రహాల ధ్వంసం చేస్తూ ఆలయాల్లో విధ్వంసం సృష్టిస్తున్నారు అల్లరిమూకలు. అసలు ఎవరు ఎందుకు చేస్తున్నారో కూడా అంతుబట్టని విషయం. ఇప్పుడు ఏపీ వేదికగా ఈ దేవతా విగ్రహాల మీదనే రాజకీయం నడుస్తోంది. విపక్షాలు ఒక్కొక్కటిగా జగన్ సర్కార్ మీద పడి చేయాల్సినదంతా చేస్తున్నాయి. ఏపీలో అధికార వియోగంతో విలవిలలాడుతున్న తెలుగుదేశం పార్టీ అయితే దీన్ని అతి పెద్ద ఇష్యూ చేస్తోంది.

    Also Read: నిమ్మగడ్డ మరో బహిరంగ లేఖ.. ఈసారి వాళ్లు టార్గెట్

    మొత్తంగా జనంలో జగన్‌ను విలన్‌ను చేసేలా తీవ్ర ప్రయత్నమే చేస్తోంది. తాను హిందూ మతోద్ధారకుడిగా చంద్రబాబు ప్రకటించుకుంటున్నారు. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చర్చిలు, మసీదులకు ఏమైనా ఇబ్బంది కలిగిందా అని చంద్రబాబు ప్రశ్నిస్తుండడంతో ఆయన వైఖరి అర్థమవుతోంది. ఏపీలో చూసుకుంటే ఇప్పటిదాకా కులాల గొడవలే ఉన్నాయి. మతాల వ్యవహారాలకు ఇంతవరకూ తావు లేదు.

    Also Read: వారసత్వం అందుకోని లోకేష్‌..: చంద్రబాబుకు ఉన్న పరిణతి ఆయనకు లేదే..?

    కానీ.. ఇప్పుడు చంద్రబాబు హిందూత్వ అజెండాను మీదేసుకున్నారు. ఇది పెద్దగా వర్కవుట్‌ అయ్యే అంశం కాదని నిపుణుల అభిప్రాయం. ఏపీలో మైనారిటీలు అయిన ముస్లింలు, క్రిస్టియన్లు ఇప్పటికే జగన్ తో ఉన్నారు. ఇక హిందువుల ఓట్లన్నీ సంఘటితం కావడం అన్నది అతి కష్టమైన వ్యవహారమే. ఉత్తరాది రాష్ట్రాల్లో ఉన్న సున్నితమైన భావోద్వేగాలు ఏపీలో అసలు లేవు. అవే కనుక ఉంటే ప్రత్యేక హోదా, విభజన సమయంలోనే ఏపీలో అగ్గి రాజేసేది. ఇక హిందువులు ఒక్కటిగా మారి ఒకే పార్టీకి ఓటు వేయడం అన్నది కూడా ఆచరణలో అమలు కాని విషయమే.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

    ఏపీలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలకు సెక్యులర్ ముఖం ఉంది. అధికారం పోయింది అన్న బాధలో చంద్రబాబు భారీ రిస్క్ చేస్తున్నారు. హిందూ అజెండాను భుజాన వేసుకుంటున్నారు. ఒకవిధంగా చెప్పాలంటే బీజేపీ అజెండాను ఆయన మీదేసుకున్నారు. హిందూత్వ రాజకీయాలు బీజేపీ పేటెంట్‌ అనే విషయాన్ని చంద్రబాబు మరిచి ప్రవర్తిస్తున్నారు. ఇదే వైఖరీని అవలంబిస్తే టీడీపీకి ఉన్న ఆ మాత్రం ముస్లిం ఓటు బ్యాంకును కూడా కోల్పోయే ప్రమాదమే ఉంది. దీంతో చివరికి రెంటికి చెడ్డ రేవడిలా అవుతుంది టీడీపీ పరిస్థితి అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దాంతో చంద్రబాబు రాంగ్ స్టెప్ వేస్తున్నారా అన్న చర్చ సొంత పార్టీలో కూడా మొదలైంది.