కోర్టు ‘ఎస్‌’ చెప్తుందా.. ‘నో’ అంటుందా..?

ఎన్నికలు నిర్వహిస్తామంటూ ఎన్నికల కమిషన్‌.. వద్దంటూ ప్రభుత్వం.. ఈ వివాదం ఏపీలో నడుస్తూనే ఉంది. ఇప్పటికే ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషనర్‌‌ నిమ్మగడ్డ రమేశ్‌ దృఢ నిశ్చయంతో ఉన్నారు. ఇందులో భాగంగా ఈ మధ్య నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. దీంతో ప్రభుత్వం మరోసారి హైకోర్టుకు వెళ్లింది. ఇప్పుడు ఈ వివాదం కాస్త మళ్లీ హైకోర్టుకు చేరింది. Also Read: ఆ తల్లుల ఖాతాల్లోకి రూ.6,673 కోట్లు ఇప్పుడు ఎన్నికల నిర్వహణ పూర్తిగా కోర్టు తీర్పు మీదనే ఆధారపడి […]

Written By: Srinivas, Updated On : January 11, 2021 2:25 pm
Follow us on


ఎన్నికలు నిర్వహిస్తామంటూ ఎన్నికల కమిషన్‌.. వద్దంటూ ప్రభుత్వం.. ఈ వివాదం ఏపీలో నడుస్తూనే ఉంది. ఇప్పటికే ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషనర్‌‌ నిమ్మగడ్డ రమేశ్‌ దృఢ నిశ్చయంతో ఉన్నారు. ఇందులో భాగంగా ఈ మధ్య నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. దీంతో ప్రభుత్వం మరోసారి హైకోర్టుకు వెళ్లింది. ఇప్పుడు ఈ వివాదం కాస్త మళ్లీ హైకోర్టుకు చేరింది.

Also Read: ఆ తల్లుల ఖాతాల్లోకి రూ.6,673 కోట్లు

ఇప్పుడు ఎన్నికల నిర్వహణ పూర్తిగా కోర్టు తీర్పు మీదనే ఆధారపడి ఉన్నాయి. ప్రభుత్వం చెబుతున్న కారణాలను పరిగణనలోకి తీసుకుంటుందా..? లేక ఎన్నికల కమిషన్‌కు అనుకూలంగా తీర్పు వెలువరిస్తుందా ఇప్పుడు ఆసక్తిగా మారింది. గతంలో ఎన్నికల కమిషన్ ఇప్పుడు ఎన్నికలు వద్దు అంది. కోర్టు సరే అంది. ఇప్పుడు ఎన్నికల కమిషన్ కావాలి అంటోంది. మరి ఇప్పుడు ఏ తీర్పునివ్వబోతోందో..?

Also Read: ప్రభుత్వాన్ని వదిలి.. మేఘా గూటికి..

అయితే.. గతంలో ఎన్నికల కమిషన్ వద్దు అన్నా కూడా కోర్టు వద్దు అనడం వెనుక లాజిక్ ఉంది. అప్పట్లో కరోనా వ్యాప్తితో ఆ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికీ ఇంతో అంతో కరోనా వ్యాప్తి ఉంది. కోవిడ్ నిబంధనలు మాత్రం అమలులోనే ఉన్నాయి. సోషల్ డిస్టెన్స్, మాస్క్ ఇవన్నీ అలాగే అమలు చేస్తూనే ఉన్నారు. దీంతో ఎన్నికల కమిషన్‌కు అనుకూలంగా ఈసారి తీర్పు వస్తుందా అనేది ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

కోర్టు కేవలం ఎన్నికలు జరపాలి అనే నిర్ణయానికి ఎస్ ఆర్ నో చెబుతుందా? లేదా ఎస్ అంటే ఆ మేరకు కో ఆపరేట్ చేసి తీరాలి అని ప్రభుత్వాన్ని ఆదేశిస్తుందా? అన్నది కీలకంగా మారింది. కోర్టు అలా ఆదేశించకుండా, జస్ట్ ప్రభుత్వ పిటిషన్ ను తోసి పుచ్చితే, ప్రభుత్వం నుంచి సహాయ నిరాకరణ వస్తే మళ్లీ అదో ఇష్యూ అవుతుంది. ఎన్నికల కమిషన్ మరోసారి కోర్టు మెట్లు ఎక్కడమో? కేంద్రాన్ని సంప్రదించడమో చేయాల్సి ఉంటుంది. కోర్టును సంప్రదించకుండా కేవలం కేంద్రాన్ని సంప్రదిస్తే ఫలితం ఏమిటన్నది చూడాల్సి ఉంది. మొత్తంగా మరోసారి ఈ స్థానిక సంస్థల రాజకీయ అటు ఎన్నికల సంఘం, ఇటు సర్కార్‌‌ మధ్య మరోసారి వివాదానికి తెరలేపిందనే చెప్పాలి.