https://oktelugu.com/

AP BJP Somu Veerraju: ఏపీ రోడ్ల‌పై తిరిగితే బాడీ మసాజ్ అయిపోతుంది.. సోము సెటైర్లు మామూలుగా లేవండోయ్‌..

AP BJP Somu Veerraju: ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు వేసే సైటెర్లు ఈ మధ్య బాగా పేలుతున్నాయి. ఏపీ సర్కార్ ను కాస్త గట్టిగానే తగులుతున్నాయట.. కర్రు కాల్చి వాతపెట్టేలా ఆయన విమర్శలుంటున్నాయని ఇన్ సైడ్ టాక్. దీన్నైనా శ్రద్ధగా పద్ధతిగా ఓ గోడ కట్టినట్టు.. అందులో బూతులేవీ లేకుండానే జగన్ సర్కార్ ను ఉతికి ఆరేసేలా ఆయన నోటి నుంచి విమర్శలు వస్తున్నాయట.. తాజాగా మరోసారి ‘ఏపీ రోడ్ల దుస్థితి’పై సోము వీర్రాజు […]

Written By:
  • Mallesh
  • , Updated On : January 27, 2022 / 03:16 PM IST
    Follow us on

    AP BJP Somu Veerraju: ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు వేసే సైటెర్లు ఈ మధ్య బాగా పేలుతున్నాయి. ఏపీ సర్కార్ ను కాస్త గట్టిగానే తగులుతున్నాయట.. కర్రు కాల్చి వాతపెట్టేలా ఆయన విమర్శలుంటున్నాయని ఇన్ సైడ్ టాక్. దీన్నైనా శ్రద్ధగా పద్ధతిగా ఓ గోడ కట్టినట్టు.. అందులో బూతులేవీ లేకుండానే జగన్ సర్కార్ ను ఉతికి ఆరేసేలా ఆయన నోటి నుంచి విమర్శలు వస్తున్నాయట.. తాజాగా మరోసారి ‘ఏపీ రోడ్ల దుస్థితి’పై సోము వీర్రాజు పేల్చిన డైలాగులు వైరల్ అయ్యాయి.. అవిప్పుడు జగన్ సర్కార్ కు కాస్త గట్టిగానే గుచ్చుతున్నాయి.

    AP BJP Somu Veerraju

    ప్రస్తుతం మంత్రి కొడాలి నాని‌పై తన కన్వెన్షన్‌లో సంక్రాంతి పండుగ సందర్భంగా క్యాసినో నిర్వహించినట్టు ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ అంశాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ఓ వైపు టీడీపీ, మరో వైపు బీజేపీ విమర్శలకు దిగుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో దీనిని అందిపుచ్చుకునేందుకు చాలా ట్రై చేస్తున్నాయి. అధికార పార్టీ ఎప్పుడు దొరుకుతుందా.. ఆ పార్టీ నాయకులకు ఎప్పుడు ఇరుకున పెడదామా అని ఎదురుచూస్తున్నాయి.

    Also Read: AP BJP Somu Veerraju Deeksha: ఉద్యోగుల కోసం నడుం బిగించిన ఏపీ బీజేపీ.. సోము వీర్రాజు దీక్ష

    ఇక ఈ వ్యవహారం ముగియక ముందే ప్రభుత్వానికి మరో తలనొప్పి ఎదురైంది. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి మరీ అధ్వానంగా మారింది. ఇక వీటిపైనా ప్రతిపక్షాలు రాజకీయం మొదలుపెట్టాయి. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితికి నిరసనగా ఇప్పటికే పవన్ కళ్యాణ్ రోడ్లపై శ్రమదానం సైతం చేశారు. అయినా పరిస్థితుల్లో మార్పు రావడం లేదు. ఇక బీజేపీ మంత్రి కొడాలి నాని క్యాసినో వివాదం పక్కన పెట్టి తిరిగి రోడ్ల పరిస్థితిపై పడే చాన్స్ ఉంది. మరి ఈ వ్యవహారం ఎక్కడికి దారి తీస్తుందో తెలియదు.

    అధికార పార్టీకి వ్యతిరేకంగా ఏ చిన్న అంశం దొరికినా మిగతా పార్టీలు వాటిని వదులుకోవడం లేదు. దీంతో రోడ్లు పరిస్థితి విషయం.. జగన్ సర్కారుకు మరో తలపోటును తెచ్చేలా కనిపిస్తోంది. మరి ఈ వ్యవహారానికి త్వరలోనే ప్రభుత్వం చెక్ పెట్టాలి. లేదంటే పరిస్థితులు ప్రతికూలంగా మారే చాన్స్ ఉందని చెబుతున్నారు విశ్లేషకులు. మరి ప్రభుత్వం ఈ విమర్శలను ఎలా తిప్పి కొడుతుంది? వీటికి చెక్ పెడుతుందా? లేదా అనే విషయాలు తెలియాలంటే మరి కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

    Also Read: ఎన్టీఆర్ జిల్లాపై టీడీపీ, నందమూరి ఫ్యామిలీ గప్ చుప్.. ఎందుకు స్పందించట్లేదు?

    Tags