Land Price In Telangana: రాష్ట్రంలో భూముల ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. దీంతో కొనగోలుదారులు భయపడుతున్నారు. స్థిరాస్తుల మార్కెట్ విలువ ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు. వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఇళ్లు, ఇళ్ల స్థలాలు, వాణిజ్య భవనాలు, అపార్టుమెంట్ల మార్కెట్ విలువ మదింపు జరగుతుందని వార్తలు జోరందుకున్నాయి. కొందరు ఇప్పటికే జీపీఏ, కొనుగోలు అగ్రిమెంట్ చేసుకుంటున్నారు. స్థిరాస్తుల మార్కెట్ విలువ ఎంత పెంచుతారో..? స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీల బాదుడు ఏ మేరకు ఉంటుందో? తెలియక ఇబ్బందులకు గురవుతున్నారు.
రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు గడువు ఉన్నప్పటికీ వచ్చే నెల నుంచి భూముల విలువలు పెరగనున్నాయనే వార్తలతో అధనపు భారం నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. రిజిస్ట్రేషన్ల కోసం స్లాట్ బుక్ చేసుకోవడం, తేదీలు ఖరారు కావడంతో సబ్ రిజిస్ట్రార్, ఎమ్మార్వో ఆఫీసులను ఆశ్రయిస్తున్నారు. అగ్రిమెంట్లు చేసుకున్న వారు కూడా రిజిస్ట్రేషన్‌కు స్లాట్ బుక్ చేసుకోవడానికి మీ సేవా కేంద్రాలు, ఆన్‌లైన్ సెంటర్లకు పరుగులు పెడుతున్నారు. జనవరి 31లోపే రిజిస్ట్రేషన్లు చేసుకునేందుకు కొందరు ఈ చలాన్లు చెల్లిస్తున్నారు. కొత్త ఆర్థిక సంవత్సరం నుంచే వడ్డింపులు ఉంటాయని అంచనాలున్నాయి. కొందరు మార్చి, ఏప్రిల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని అడ్వాన్స్ ఇచ్చి ఒప్పందాలు చేసుకున్నారు. వీరు కూడా ఈ నెలాఖరులోపే రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ట్రై చేస్తున్నారు. ఆస్తుల రిజిస్ట్రేషన్ ద్వారా వస్తున్న ఆదాయంపై అధికారుల అంచనాలు పెరగనున్నాయి.
Also Read: Drugs Case In Telangana: మళ్లీ తెలంగాణలో డ్రగ్స్ కలకలం
2021-22 ఆర్థిక ఏడాదికి డిసెంబరులో అత్యధికంగా రూ.1,030 కోట్ల ఆదాయం సమకూరింది. నెలల వారీగా చూస్తే స్థిరాస్తి లావాదేవీల ద్వారా ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం రెట్టింపు కానుంది. గతేడాది మే మినహాయిస్తే మిగిలిన 9 నెలల్లో రాబడి పెరుగనుంది. పెరిగిన రాబడి 2021 ఏప్రిల్ నుంచి 2022 జనవరి 26 నాటికి రిజిస్ట్రేషన్ శాఖకు రూ.6,932.70 కోట్ల ఆదాయం లభించింది. ప్రభుత్వం ఆర్థిక ఏడాదికి వేసిన ఆదాయ అంచనా రూ.12,500 కోట్లు.
కరోనా నేపథ్యంలో రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడం, ధరణి అమల్లోకి తెచ్చే సమయంలో భూముల విక్రయాలు ఆగిపోవడంతో రాబడి తగ్గినట్లు చెబుతున్నారు. మళ్లీ రిజిస్ట్రేషన్లు పుంజుకోవడంతో రాబడి పెరిగింది. ఈ నెలలో ఇప్పటి వరకు రూ.748 కోట్ల ఆదాయం సమకూరింది. నెలాఖరుకు రూ.1000 కోట్లు దాటే అవకాశాలు ఉన్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల నుంచే రిజిస్ట్రేషన్ల శాఖకు అంచనాలకు మించి ఆదాయం సమకూరుతోంది.
Also Read: Telangana Corona Cases: తెలంగాణలో మొదలైన కరోనా కల్లోలం..రోజుకు ఎన్ని కేసులంటే?