https://oktelugu.com/

కాంగ్రెస్‌ మరో పోస్టుమార్టం.. సోనియా దూరం

దేశ కాంగ్రెస్‌కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇటీవల పార్టీలో మార్పుకోరుతూ సీనియర్లు లేఖల యుద్ధం చేశారు. రోజురోజుకూ పార్టీ పరువు మసకబారుతోందని.. నాయకత్వ మార్పు ఎంతైనా అవసరం అంటూ ఆ లేఖలో రాసుకొచ్చారు. ఇక తాజాగా ఆ పార్టీ సీనియర్‌‌ నేత కపిల్‌ సిబల్‌ బహిరంగం చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దేశ ప్రజలు కాంగ్రెస్‌ ప్రత్యామ్నాయంగా చూడడం లేదంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో సీడబ్ల్యూసీ ఆత్మపరిశీలనకు సిద్ధపడినట్లుగా తెలుస్తోంది. అందుకే.. అధినేత్రి సోనియాగాంధీ ప్రత్యేక […]

Written By:
  • NARESH
  • , Updated On : November 17, 2020 8:02 pm
    Follow us on

    Gandhi Family

    దేశ కాంగ్రెస్‌కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇటీవల పార్టీలో మార్పుకోరుతూ సీనియర్లు లేఖల యుద్ధం చేశారు. రోజురోజుకూ పార్టీ పరువు మసకబారుతోందని.. నాయకత్వ మార్పు ఎంతైనా అవసరం అంటూ ఆ లేఖలో రాసుకొచ్చారు. ఇక తాజాగా ఆ పార్టీ సీనియర్‌‌ నేత కపిల్‌ సిబల్‌ బహిరంగం చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దేశ ప్రజలు కాంగ్రెస్‌ ప్రత్యామ్నాయంగా చూడడం లేదంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో సీడబ్ల్యూసీ ఆత్మపరిశీలనకు సిద్ధపడినట్లుగా తెలుస్తోంది. అందుకే.. అధినేత్రి సోనియాగాంధీ ప్రత్యేక అడ్వైజరీ కమిటీ సమావేశం ఏర్పాటు చేస్తోంది.

    Also Read: చైనా అధ్యక్షుడి ముందే గర్జించిన మోడీ!

    ఈరోజు సాయంత్రం నిర్వహించనున్న ఈ సమావేశంలో ప్రధానంగా సిబల్‌ వ్యాఖ్యలు చర్చకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాదు.. సాధారణ పాలన సమస్యలపై చర్చించేందుకే ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ అధినాయకత్వ వైఖరిని తప్పుపడుతూ ఆగస్టులో 23 మంది కాంగ్రెస్‌ సీనియర్లు లేఖ రాశారు. దీంతో పార్టీ సంస్థాగత, కార్యనిర్వాహక అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకునేందుకు అధ్యక్షురాలు సోనియాగాంధీ ఈ అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేశారు.

    కేసీ వేణుగోపాల్‌, ఏకే ఆంటోనీ, అంబికా సోనీ, ముకుల్‌ వాస్నిక్‌, రణదీప్‌ సుర్జేవాలా ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. కాగా.. ఈ భేటీకి సోనియా దూరంగా ఉంటున్నట్లు సమాచారం. దీంతో బీహార్‌‌ ఫలితాలపై చర్చ వచ్చే అవకాశాలు తక్కువే అనిపిస్తున్నాయి. బీహార్‌‌ ఎన్నికల ఫలితాల నేపథ్యంలోనే కాంగ్రెస్‌లో మరోసారి అసంతృప్తి గళాలు వినిపిస్తున్నట్లుగా తెలుస్తోంది.

    Also Read: జీహెచ్ఎంసీ ఎన్నికలపై రగడ..ఈసీకి బీజేపీ ఫిర్యాదు

    ఆ క్రమంలోనే కపిల్‌ సిబల్‌ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. సిబల్‌ వ్యాఖ్యలకు మరో కీలక నేత కార్తీ చిదంబరం కూడా మద్దతు పలికారు. అంటే.. ఒక్కో నేత కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న లోపాలను, వైఫల్యాలను ఎత్తిచూపాలనే ఆలోచన అందరిలోనూ కనిపిస్తోంది. కాగా.. సిబల్‌ వ్యాఖ్యలను రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ ఖండించారు.

    మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్