https://oktelugu.com/

భార్య కనిపించడం లేదని భర్త ఫిర్యాదు.. చివరకు..?

తన భార్య కొన్ని రోజులుగా కనిపించడం లేదని ఒక వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని కేసు గురించి దర్యాప్తు చేశారు. అయితే పోలీసులు ఎంత కష్టపడినా ఎటువంటి ఆధారాలు లభించలేదు. అయితే ఎన్ని రోజులైనా మహిళ గురించి ఆధారాలు లభించకపోవడంతో ఫిర్యాదు చేసిన భర్తపైనే పోలీసులకు అనుమానం కలిగింది. పోలీసులు ఫిర్యాదు చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. పూర్తి వివరాల్లోకి వెళితే వికారాబాద్ జిల్లాలో బానాల […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 17, 2020 / 07:37 PM IST
    Follow us on


    తన భార్య కొన్ని రోజులుగా కనిపించడం లేదని ఒక వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని కేసు గురించి దర్యాప్తు చేశారు. అయితే పోలీసులు ఎంత కష్టపడినా ఎటువంటి ఆధారాలు లభించలేదు. అయితే ఎన్ని రోజులైనా మహిళ గురించి ఆధారాలు లభించకపోవడంతో ఫిర్యాదు చేసిన భర్తపైనే పోలీసులకు అనుమానం కలిగింది. పోలీసులు ఫిర్యాదు చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

    పూర్తి వివరాల్లోకి వెళితే వికారాబాద్ జిల్లాలో బానాల ప్రభు, సంతోష దంపతులు పెళ్లైన కొత్తలో అన్యోన్యంగా జీవించేవాళ్లు. వీళ్లకు నలుగురు సంతానం. అయితే ప్రభు కొన్ని నెలల నుంచి భార్య సంతోషపై విపరీతమైన కోపం ప్రదర్శించేవారు. అకారణంగా భార్యను కొట్టడం, తాగొచ్చి వేధించడం చేసేవాడు. మద్యం తాగే అలవాటు ఉన్న ప్రభు ఈ నెల 11వ తేదీన తాగి ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో భార్య, భర్త మధ్య గొడవ జరిగింది.

    ఆ సమయంలో ప్రభు, భార్య సంతోషను దారుణంగా హత్య చేశాడు. ఆ తరువాత భార్య మృతదేహంపై డీజిల్ పోసి నిప్పంటించాడు. అయితే తనపై అనుమానం రాకూడదనే ఉద్దేశంతో ప్రభు పోలీసులను ఆశ్రయించాడు. ప్రభుని విచారించిన పోలీసులు హత్య చేసిన భర్తే ఏ పాపం తెలియనట్టు ఫిర్యాదు చేయడంతో అవాక్కయ్యారు. పోలీసులు ప్రస్తుతం సాక్ష్యాలను సేకరించే పనిలో పడ్డారు.

    భార్యని కిరాతకంగా చంపి అటవీ ప్రాంతంలో పడేయడంతో ఇక పోలీసులకు దొరకనని ప్రభు భావించినా పోలీసులకు అనుమానం కలగడంతో దొరికిపోయాడు. రఘు చేసిన నేరం గురించి తెలిసి స్థానికులు సైతం అవాక్కయ్యారు.