ఫామ్ హౌస్ కేసుపై సుప్రీంకోర్టు లో కేవియట్ ను మంత్రి కేటీఆర్ దాఖలు చేశారు. హైకోర్టు ఆదేశాలు వెలువడిన వెంటనే సుప్రీంకోర్టు లో మంత్రి కేటీఆర్ కేవియట్ దాఖలు చేశారు. కేటీఆర్ తో పాటు మరో రెండు కేవియట్ల ను బద్వేలు ప్రదీప్ రెడ్డి వేశారు. కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌస్ వ్యవహారం పై గతంలో ఎన్ జి టి ని రేవంత్ రెడ్డి ఆశ్రయించారు. విచారణ తర్వాత గత నెల ఐదో తేదీన కేటీఆర్ సహా తెలంగాణ ప్రభుత్వానికి ఎన్ జి టి. నోటీసులు జారీచేసింది. వివాదాస్పద ఫాం హౌస్ అక్రమమా, సక్రమంగా జరిపారో తెలుసుకునేందుకు నిపుణుల కమిటీని ఎన్ జి టి ఏర్పాటు చేసింది. ఎన్ జి టి ఆదేశాలను సవాలు చేస్తూ కేటీఆర్ హైకోర్టు లో పిటిషన్ దాఖలు చేశారు. తెలంగాణ హైకోర్టు లో మంత్రి కేటీఆర్ కి ఊరట లభించింది. జూన్ పదవ తేది ఎన్ జి టి ఆదేశాలపై స్టే ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే స్టే ఆర్డర్ కాపీ వెలువడడానికి ముందే సుప్రీంకోర్టు లో కెటిఆర్ కెవియట్ దాఖలు చేశారు.
సుప్రీంకోర్టుకు కు గత నెల 19 నుంచి వేసవి సెలవులు ఉన్నాయి. జూలై 6 నుంచి కోర్టు తిరిగి ప్రారంభం కానున్న నేపథ్యంలో సుప్రీంకోర్టును రేవంత్ రెడ్డి ఆశ్రయించనున్నారు. ఫామ్ హౌస్ 111 జీవో పరిధిలోకి వస్తుందని, కేంద్ర ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించి 25 ఎకరాల స్థలంలో కేటీఆర్ ఈ నిర్మాణం చేపట్టారని రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. రూ. 250 కోట్ల విలువైన ఈ భూమిలో రూ. 25 కోట్లు పెట్టి కేటీఆర్ విలాసవంతమైన ఫామ్ హౌస్ నిర్మించుకున్నారని రేవంత్ వాదిస్తున్నారు.