Homeఅంతర్జాతీయంAmerica: హక్కుల పేరిట అమెరికా అత్యుత్సాహం..!

America: హక్కుల పేరిట అమెరికా అత్యుత్సాహం..!

America: నీతి సూక్తులు పక్కవాడికే తప్ప మనకు కాదనే ధోరణిలో అగ్రరాజ్యం అమెరికా వ్యవహరిస్తోంది. జాతి, మత విదేష్వాలతో నిత్యం వార్తల్లో నిలిచే అమెరికా ఇతర దేశాల్లో హక్కుల పేరిట అత్యుత్సాహం ప్రదర్శిస్తూ విమర్శల పాలవుతోంది. మానవ హక్కులను కాపాడుతున్నమనే నెపంతో ఇతర దేశాల్లో మరణం హోమాలను సృష్టించే అమెరికా దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ప్రవర్తిస్తుండటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

America
America

ఈనెల 10న అంతర్జాతీయ దినోత్సవాన్ని పురష్కరించుకొని అమెరికా(America) ప్రెసిడెంట్ జోబైడెన్ కొన్ని కీలక నిర్ణయాలను తీసుకున్నారు.ఇందులో భాగంగానే చైనా, బంగ్లాదేశ్, మయన్మార్, ఉత్తర కోరియాలకు చెందిన పలు సంస్థలు, అధికారులపై గ్లోబల్ మ్యాగ్నిస్కీ చట్టానికి సంబంధించిన ఆంక్షలను విధించింది. అయితే మానవ హక్కుల ఉల్లంఘనలు, ఉగ్రవాదం పేరుతో ఇతర దేశాల్లో ఆంక్షలు విధిస్తూ క్రమంగా అక్కడి ప్రభుత్వాలను అమెరికా తమ చేతుల్లోకి తీసుకుంటుందనే ఆరోపణలను అంతర్జాతీయంగా ఎదుర్కోంటోంది.

2004సంవత్సరంలో బంగ్లాదేశ్ లో ఆర్ఏబీనీ ప్రారంభించిన అమెరికా క్రమంగా ఇతర దేశాల్లోని ప్రభుత్వాలను పావులుగా వాడుకుంటోంది. బంగ్లాదేశ్ లో మాదక ద్రవ్యాలపై పోరాటం పోరుతో ప్రతిపక్ష పార్టీల సభ్యులు, పాత్రికేయులు, హక్కుల కార్యకర్తలను లక్ష్యంగా చేసుకున్నాయి. దీనిపై పలు స్వచ్చంధ సంస్థలు అమెరికాకు వినతులను పంపాయి. 2018 నుంచి ఇప్పటి వరకు బంగ్లాదేశ్ లో 600మందిని ఆర్ఏబీ చిత్రహింసలకు గురిచేసిందని, 2009 నుంచి మరో 600మంది అదృశ్యమైందనే ఆరోపణలున్నాయి.

ఈక్రమంలోనే బైడెన్ సర్కార్ దీనిని తీవ్రంగా పరిగణించింది. మానవ హక్కులను ఉల్లంగిస్తున్నారని, బంగ్లాదేశ్ ప్రజల ఆర్థిక పురోగతిని దెబ్బతిస్తున్నారని ఆర్ఏబీకి చెందిన ఏడుగురు అధికారులు, మాజీ అధికారులపై అమెరికా ఆంక్షలను విధించింది. దీంతోపాటు ఇటీవల 111దేశాలతో ఇటీవల నిర్వహించిన ప్రజాస్వామ్య సదస్సుకు బైడెన్ ఆ దేశానికి ఆహ్వానం పంపలేదు. దీంతో ఇరుదేశాల మధ్య సంబంధాలు దెబ్బతింటున్నాయి.

Also Read: డీఎస్ ఎందుకు కాంగ్రెస్ లో చేరలేదు.. ఆ గ్యాప్ కు కారణమిదే?
అలాగే చైనాకు చెందిన కృతిమ మేధ అంకుర సంస్థ సెన్స్ టైమ్ గ్రూపును అమెరికా నిషేధిత జాబితాలో ఉంచింది. మయన్మార్ లో సైనిక తిరుగుబాటుకు ఆయుధాలను సమకూర్చినందుకు ఆ దేశానికి చెందిన రెండు మిలిటరీ సంస్థలపై ఆంక్షలను విధించింది. ఉత్తర కొరియా విషయంలోనూ అమెరికా ఇలానే వ్యవరిస్తోంది. అయితే అందరినీ వేలేత్తి చూపుతున్న అమెరికా సొంతగూటిని మాత్రం గాలికొదిలేసింది.

నిత్యం జాతి వివక్ష, యుద్ధాల మరణాల హోమాలకు కారణమవుతున్న అమెరికా ఇతర దేశాలపై ఆంక్షలు పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముందు అమెరికా మానవ హక్కుల ఉల్లంఘటనలకు పాల్పడుకుండా పెద్దన్న తరహాలో మిగతా వారికి సూచించాలని లేకుంటే ఆదేశమే చివరి నవ్వులపాలు కావాల్సి వస్తుందనే కామెంట్స్ విన్పిస్తున్నాయి. కరోనా కట్టడిలో విఫలమైన అమెరికా ఇప్పటికే తన పెద్దన్న పాత్రను కోల్పోయిందనే విమర్శలను సైతం ఎదుర్కొంటోంది.

Also Read: అపర కుబేరుడైనా ఒకప్పుడు కష్టాలే.. చిన్ననాటి స్మృతులు నెమరువేసుకున్న మస్క్

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
Exit mobile version