Bajaj Platina mileage 90 km per litre: భారతదేశంలో ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేసే సమయంలో రకరకాల ఆలోచనలతో ఉంటారు వినియోగదారులు. కొందరు ఎదుటివారిని ఆకర్షించడానికి మంచి డిజైన్ కలిగిన బైక్ కావాలని అనుకుంటే.. మరికొందరు బడ్జెట్లో ఎక్కువ మైలేజ్ ఇచ్చే వాహనం కావాలని అనుకుంటారు. ఉద్యోగరీత్యా లేదా వివిధ అవసరాలకు ప్రతిరోజు టూ వీలర్ వాడేవారు ఎక్కువ మైలేజ్ ఇవ్వాలని అనుకుంటారు. ఇదే సమయంలో తక్కువ ధరతో ఉండాలని కోరుకుంటారు. ఇలాంటి వారికి కొన్ని కంపెనీలు బడ్జెట్లో బైక్ లను అందిస్తున్నాయి. వాటిలో బజాజ్ కంపెనీకి చెందిన వాహనాలు ఎప్పటికీ ఎవర్ గ్రీన్ గా ఉంటున్నాయి. దీని నుండి దశాబ్దాల కిందట వచ్చినా ఓ బైక్ ఇప్పటికీ అలరిస్తూ ఉంటుంది. అయితే ఇది అప్పటిలా కాకుండా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ నేటి తరాన్ని ఆకట్టుకుంటూ ఉంటుంది. ఇంతకీ ఆ బైక్ ఏదో తెలుసుకోవాలని ఉందా..?
టు వీలర్ విక్రయాల్లో బజాజ్ కంపెనీ టాప్ పొజిషన్లో ఉంటుంది. ఈ కంపెనీ నుంచి మార్కెట్లోకి వచ్చిన Platina బైక్ మైలేజ్ రారాజుగా పేర్కొంటారు. బడ్జెట్ లో బైక్ కొనే వారితో పాటు ఇందరాన్ని పొదుపు చేయాలనే అనుకునే వారికి ఇది చాలా అనుగుణంగా ఉంటుంది. అంతేకాకుండా దీనిపై రైడింగ్ చేసేవారు ప్రత్యేక అనుభూతిని పొందుతారు స్మూత్ డ్రైవింగ్ తో పాటు పొడవైన సీటు ఉండటంవల్ల చిన్న ఫ్యామిలీ దీనిపై దూర ప్రయాణం కూడా చేయవచ్చు. బజాజ్ ప్లాటిన 100,110 అనే రెండు ఇంజన్లలో అందుబాటులో ఉంది. బజాజ్ 100 సిసి బైక్ ధర రూ.66,015 గా ఉండగా..110 సీసీ బైక్ రూ 71,558 తో విక్రయిస్తున్నారు.
అయితే ఇవి ధర తక్కువగా ఉండడమే కాకుండా నేటి తరం వారు సైతం ఆకట్టుకునేలా ఫ్యూచర్లు ఉన్నాయి. బజాజ్ 100 సిసి బైక్లో LED హెడ్ లాంప్స్, LED DRL టెయిల్ లాంప్స్ దీనికి ఆకర్షణీయంగా ఉంటాయి. ఇది 4 స్పీడ్ గేర్ బాక్స్ తో పనిచేస్తుంది. లీడర్ ఇంధనానికి 75 నుంచి 90 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది. అలాగే 110 సిసి బైక్ లో సైతం స్టైలిష్ LED హెడ్ లాంప్స్ చూడవచ్చు. నగరాల్లో ప్రయాణం చేసే వారికి ఇది అనుగుణంగా ఉంటుంది. ఇది లీటర్ ఇంధనానికి 70 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది.
ఈ రెండు బైక్ లు ఇప్పటికీ మైలేజ్ విషయంలో మిగతా వాటితో పోటీ పడుతూ ఉంటాయి. వీటి తర్వాత ఎన్నో రకాల బైక్స్ మార్కెట్లోకి వచ్చినా కూడా సామాన్యులు ద్విచక్ర వాహనం కొనుగోలు చేయాలంటే వీటి వైపే చూస్తున్నారు. ప్రస్తుతం పెట్రోల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఇంధనం పొదుపు చేయాలని అనుకునే వారికి ఈ బైక్ ఎంతో అనుగుణంగా ఉంటుంది.