Vijay Deverakonda fulfills little girl wish: రీసెంట్ గానే విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), రష్మిక(Rashmika Mandanna) పెళ్లి ఎంత గ్రాండ్ గా జరిగిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎక్కడ చూసినా వీళ్ళ పెళ్లి, వెడ్డింగ్ రిసెప్షన్ కి సంబందించిన ఫొటోలే కనిపిస్తున్నాయి. అయితే ఈ జంటకు సోషల్ మీడియా ద్వారా అభిమానుల నుండి లక్షల సంఖ్యలో శుభాకాంక్షలు రావడంతో , వాళ్లకు కృతజ్ఞతగా విజయ్ దేవరకొండ , రష్మిక ఇండియా వైడ్ గా పలు ముఖ్యమైన దేవాలయాల్లో అన్నదానాలు , స్వీట్ల పంపకం చేసిన సంగతి తెలిసిందే. అయితే తనకు స్వీట్లు ఇవ్వలేదంటూ ఇన్ స్టాగ్రామ్ లో ఒక చిన్నారి రీల్ చేసి అప్లోడ్ చేయడం తో అది బాగా వైరల్ అయ్యింది. సుమారుగా 20 లక్షల మంది ఆ వీడియో ని వీక్షించారు. ఈ వీడియో విజయ్ దేవరకొండ వరకు చేరడం తో ఆయన స్పందించిన తీరు ని చూస్తే ఎవరైనా ముచ్చట పడాల్సిందే.
ముందుగా ఆ చిన్నారి మాట్లాడుతూ ‘విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి అయింది కదా, మనల్ని కూడా పిలవొచ్చు కదా పెళ్ళికి , మళ్లీ అందరికీ లడ్డూలు పెడుతున్నారు, అన్నం పెడుతున్నారు, మనం కూడా ఫ్యాన్స్ యే కదా, మేము కూడా రీల్స్ చేస్తున్నాం కదా, పిలిస్తే ఏమవుతుందట ?, ఈ వీడియో వాళ్లకు షేర్ చేయండి’ అంటూ చాలా క్యూట్ గా అడుగుతుంది. ఈ వీడియో క్రింద విజయ్ దేవరకొండ కామెంట్ చేస్తూ ‘బుజ్జి తల్లి.. నిన్ను లంచ్ కి ఇంటికి పిలుస్తాను. నీకు బాగా ఇష్టమైన ఫుడ్ , స్వీట్స్ ఏంటో నాకు చెప్పి, అన్ని ఇంట్లో చేయించి మంచిగా కలిసి తిందాము ‘ అంటూ చెప్పుకొచ్చాడు. అంత పెద్ద స్టార్ అయ్యుండి కూడా ఒక చిన్నారి కోసం ఇంత ప్రేమతో కామెంట్ చేయడాన్ని చూస్తుంటే విజయ్ దేవరకొండ ఎంత మంచివాడో అర్థం అవుతోంది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
విజయ్ దేవరకొండ కి తన అభిమానులంటే మొదటి నుండి ఇదే స్థాయి గౌరవం ఉంది. పెళ్ళైన వెంటనే , తన అభిమానుల్లో కొంతమంది ముఖ్యులను గుర్తించి, వాళ్ళను లంచ్ కి ఆహ్వానించి, విజయ్ దేవరకొండ, రష్మిక లు స్వయంగా తమ చేతుల మీదుగా అన్నడం వడ్డించి పెట్టడం , అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఈ చిన్నారి కూడా ఆ వీడియో ని చూసే అలా కామెంట్ చేసి ఉంటుందని అంటున్నారు నెటిజెన్స్ . ఇకపోతే త్వరలోనే ఈ చిన్నారిని మనం విజయ్ దేవరకొండ ఇంట్లో చూడొచ్చు అన్నమాట .సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతున్న ఈ వీడియో ని మీరు కూడా చూసేయండి.