Homeఅంతర్జాతీయంProfessor Jiang predicted Iran US conflict: ఇరాన్‌–అమెరికా యుద్ధం.. ముందే ఊహించిన ప్రొఫెసర్‌.. ఎవరు...

Professor Jiang predicted Iran US conflict: ఇరాన్‌–అమెరికా యుద్ధం.. ముందే ఊహించిన ప్రొఫెసర్‌.. ఎవరు గెలుస్తారో ఆధారాలతో వెల్లడి!

Professor Jiang predicted Iran US conflict: ఇరాన్, అమెరికా యుద్ధం 11వ రోజుకు చేరింది. ఇటు ఇరాన్, అటు అమెరికా వెనక్కి తగ్గడం లేదు. ఇరాన్‌ అణు కార్యకలాపాలు కొనసాగిస్తోందన్న సాకుతో అమెరికా ఈ యుద్ధం మొదలు పెట్టింది. మొదటి రోజే ఇరాన్‌ సుప్రీం లీడర్‌ను మట్టుబెట్టినా ఇరాన్‌ వెనక్కు తగ్గడం లేదు. అమెరికాతోపాటు అమెరికాకు మద్దతుగా ఉన్న ఇజ్రాయెల్, యూఏఈ, ఖతార్, సౌదీ అరేబియా, దుబాయ్, బహ్రెయిన్‌తోపాటు 14 దేశాలపై దాడులు చేస్తోంది. యుద్ధం నాలుగు వారాలు కొనసాగుతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. తాజాగా యుద్ధం సెప్టెంబర్‌ వరకు కొనసాగే అవకాశం ఉందని అమెరికా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈ యుద్ధంలో ఎవరు గెలుస్తారన్న చర్చ మొదలైంది.

చైనా ప్రొఫెసర్‌ ప్రిడిక్షన్‌ వైరల్‌..
చైనా విశ్లేషకుడు ప్రొఫెసర్‌ జియాంగ్‌ ఇరాన్‌ అమెరికా యుద్ధంపై 2024లో చేసిన ప్రెడిక్షన్‌ ఇప్పుడు వైరల్‌గా మారింది. 2024 మేలో ట్రంప్‌ మళ్లీ అధ్యక్షుడవుతాడని, అమెరికా–ఇరాన్‌ యుద్ధం జరుగుతుందని, అమెరికా ఓడిపోతుందని జియాంగ్‌ ఊహించాడు. మొదటి రెండు సంభవించాయి, మూడోది జరిగే అవకాశం ఉందని సోషల్‌ మీడియా వైరల్‌. ఇరాన్‌ అసిమెట్రిక్‌ ఆయుధాలు, ప్రాక్సీలతో పోరాడుతుందని చెప్పాడు.

భౌగోళిక, ఆర్థిక సవాళ్లు..
ఇరాన్‌ పర్వతాలు, విశాల భూభాగం ఆక్రమణకు మలుపిస్తాయి. మిలియన్ల సైన్యం అవసరమని జియాంగ్‌ అంచనా. అమెరికా దూరం వల్ల లాజిస్టిక్స్‌ సమస్యలు తలెత్తుతాయి. గల్ఫ్‌ ఆయిల్‌ కేంద్రాలు, ఆర్మూజ్‌ జలసంధి మూతపడితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది.

పెలోపోనీషియన్‌ యుద్ధంతో పోలిక..
ఏథెన్స్‌ స్పార్టాతో పోల్చుకుని బలవంతుడైనా దూర యుద్ధంలో ఓడిపోయింది. దీర్ఘకాలం యుద్ధం కొనసాగడం, దూర ప్రాంతం నగరంపై దాడి చేయడం కారణంగా లాజిస్టిక్‌ సమస్యలు వచ్చాయి. దీర్ఘకాలిక ఒత్తిడి కారణంగా ఏథెన్స్‌ ఓడిపోయింది. ఇదే పరిస్థితి అమెరికాకు వస్తుందని జియాంగ్‌ తెలిపారు.

యుద్ధం కారణంగా అమెరికా రిసోర్సెస్‌ తగ్గుతూ, రష్యా–చైనా బలపడతాయని ప్రిడిక్షన్‌. ఇరాన్‌ గెలిచినా ప్రాంతీయ నష్టాలు తీవ్రం. యుద్ధం పొడిగితే ప్రపంచ చమురు ధరలు, ఆర్థిక అస్థిరత పెరుగుతాయి. జియాంగ్‌ ఊహలు నిజమైతే అమెరికా ఆధిపత్యం బలహీనపడుతుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version