https://oktelugu.com/

Three Heroes: ఆ ముగ్గురు స్టార్స్ కి గ్రేట్ కమ్ బ్యాక్ ఇచ్చిన 2021

Three Heroes: 2021 సంవత్సరం మరికొద్ది రోజుల్లో ముగియనుంది. ఈ ఏడాది చిత్ర పరిశ్రమ మిక్స్డ్ ఫలితాలు అందుకుంది.కాగా 2021 చిత్ర పరిశ్రమకు చాలా ప్రత్యేకం. 2020 మొత్తం కరోనా కాలంగా మిగిలిపోయింది. అల వైకుంఠపురం లో, సరిలేరు నీకెవ్వరు చిత్రాలతో బ్లాక్ బస్టర్ స్టార్ట్ దొరికినా… తర్వాత లాక్ డౌన్ లోనే పూర్తి సంవత్సరం ముగిసిపోయింది. పరిశ్రమ మనుగడే ప్రశ్నార్థకంగా మారిన తరుణంలో కొందరు స్టార్స్… భారీ హిట్స్ తో పునర్వైభవం తెచ్చే ప్రయత్నం చేశారు. […]

Written By:
  • Shiva
  • , Updated On : December 18, 2021 11:56 am
    Follow us on

    Three Heroes: 2021 సంవత్సరం మరికొద్ది రోజుల్లో ముగియనుంది. ఈ ఏడాది చిత్ర పరిశ్రమ మిక్స్డ్ ఫలితాలు అందుకుంది.కాగా 2021 చిత్ర పరిశ్రమకు చాలా ప్రత్యేకం. 2020 మొత్తం కరోనా కాలంగా మిగిలిపోయింది. అల వైకుంఠపురం లో, సరిలేరు నీకెవ్వరు చిత్రాలతో బ్లాక్ బస్టర్ స్టార్ట్ దొరికినా… తర్వాత లాక్ డౌన్ లోనే పూర్తి సంవత్సరం ముగిసిపోయింది. పరిశ్రమ మనుగడే ప్రశ్నార్థకంగా మారిన తరుణంలో కొందరు స్టార్స్… భారీ హిట్స్ తో పునర్వైభవం తెచ్చే ప్రయత్నం చేశారు. అదే సమయంలో వాళ్ళు కూడా పరాజయాలకు బ్రేక్ ఇచ్చి… సక్సెస్ ట్రాక్ ఎక్కారు. రవితేజ, పవన్, బాలయ్య బ్లాక్ బస్టర్స్ కొట్టి పరిశ్రమకు ఊపిరి పోశారు

    Three Heroes

    Three Heroes

    2021 టాలీవుడ్ బాక్సాఫీస్ కి రిబ్బన్ కటింగ్ మాస్ మహారాజా రవితేజ చేశారు. అత్యంత ప్రతికూలతల మధ్య విడుదలైన చిత్రం క్రాక్. 2021 జనవరి 9న విడుదల కాగా, అప్పటికి ఇంకా కరోనా ఆంక్షలు అమలులోనే ఉన్నాయి. కేవలం యాభై శాతం ఆక్యుపెన్సీకి మాత్రమే అనుమతి ఉంది. అయినప్పటికీ బ్లాక్ బస్టర్ టాక్ తో వసూళ్ల వర్షం కురిపించింది క్రాక్. రవితేజ మరోసారి పోలీస్ రోల్ చేయగా, శృతి హాసన్ హీరోయిన్ గా నటించారు. దర్శకుడు గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన క్రాక్ రూ. 60కోట్లకు పైగా వరల్డ్ వైడ్ గ్రాస్ రాబట్టింది. వీరి కాంబినేషన్ లో వచ్చిన క్రాక్ హ్యాట్రిక్ హిట్ కావడం విశేషం. ఒక్క హిట్ కోసం తపస్సు చేస్తున్న రవితేజను క్రాక్ కాపాడింది. లాక్ డౌన్ తర్వాత ప్రేక్షకులను థియేటర్స్ కి రప్పించిన చిత్రం క్రాక్.

    ఇక సమ్మర్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన పవర్ చూపించారు.మూడేళ్ళ తర్వాత వకీల్ సాబ్ తో రీ ఎంట్రీ ఇచ్చి బాక్సాఫీస్ దుమ్ము దులిపాడు. దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన అజ్ఞాతవాసి 2018 సంక్రాంతి కానుకగా విడుదలై ప్లాప్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీ తర్వాత సినిమాలకు విరామం ప్రకటించి, పవన్ రాజకీయాలలో బిజీ అయ్యారు. దీంతో ఆయన డై హార్డ్ ఫ్యాన్స్ వెండితెర కమ్ బ్యాక్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్న తరుణంలో వకీల్ మూవీ చేశారు.

    హిందీ హిట్ మూవీ పింక్ రీమేక్ గా తెరకెక్కిన వకీల్ సాబ్.. ఏప్రిల్ 9న విడుదలై రికార్డు వసూళ్లు రాబట్టింది. వకీల్ సాబ్ రూ. 135 కోట్లకు పైగా వరల్డ్ వైడ్ గ్రాస్ వసూలు చేసింది. దిల్ రాజు నిర్మాణంలో దర్శకుడు వేణు శ్రీరామ్ తెరకెక్కించారు. శృతి హాసన్ పవన్ తో జతకట్టారు. ఆమెది ఈ చిత్రంలో జస్ట్ క్యామియో రోల్ అని చెప్పాలి. అగ్రెసివ్ లాయర్ పాత్రలో పవన్ విజృంభించారు.

    Also Read: Urvashi Rautela: ‘సమంత’కి ‘ఊర్వశి’కి మధ్య సంబంధం లేదట !

    2021లో కమ్ బ్యాక్ అయిన మరొక స్టార్ హీరో బాలకృష్ణ.జై సింహ, ఎన్టీఆర్ బయోపిక్స్, రూలర్ వంటి వరుస పరాజయాలతో సతమతమైన బాలకృష్ణ అఖండ మూవీతో బ్లాక్ బస్టర్ కమ్ బ్యాక్ ఇచ్చారు. దర్శకుడు బోయపాటి శ్రీను ఫ్యాన్స్ నమ్మకాన్ని నిలబెడుతూ… హ్యాట్రిక్ విజయాన్ని అందించారు. అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన అఖండ 10 రోజుల్లోనే రూ. 100 కోట్ల మార్కు దాటేసింది. అలాగే యూఎస్ లో $ 1 మిలియన్ డాలర్ వసూళ్లకు చేరుకుంది. ఇంకా విజయపథంలో దూసుకెళుతున్న అఖండ టోటల్ కలెక్షన్స్ రిపోర్ట్ రావాల్సి ఉంది.

    Also Read: RRR: ముంబయి విమానాశ్రయంలో రామ్​చరణ్​.. ఆర్​ఆర్​ఆర్​ మెగా ఈవెంట్​కు సర్వం సిద్ధం

    Tags