https://oktelugu.com/

D Srinivas: డీఎస్ ఎందుకు కాంగ్రెస్ లో చేరలేదు.. ఆ గ్యాప్ కు కారణమిదే?

D Srinivas: తెలంగాణ కాంగ్రెస్ లో అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ పార్టీలో చేరతారనే ప్రచారం సాగినా వాయిదా పడింది. దీంతో పార్టీలో ఏం జరుగుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డీఎస్ చేరికకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఇక కండువా కప్పుకోవడమే తరువాయి అనుకున్న తరుణంలో కార్యక్రమం వాయిదా పడటంతో అందరిలో సందేహాలు వ్యక్తమవుతన్నాయి. ఏం జరిగిందనే చర్చ ప్రారంభమైంది. అసలు డీఎస్ చేరతారా? లేదా? అనే అనుమానాలు అందరిలో […]

Written By:
  • Srinivas
  • , Updated On : December 18, 2021 11:56 am
    Follow us on

    D Srinivas: తెలంగాణ కాంగ్రెస్ లో అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ పార్టీలో చేరతారనే ప్రచారం సాగినా వాయిదా పడింది. దీంతో పార్టీలో ఏం జరుగుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డీఎస్ చేరికకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఇక కండువా కప్పుకోవడమే తరువాయి అనుకున్న తరుణంలో కార్యక్రమం వాయిదా పడటంతో అందరిలో సందేహాలు వ్యక్తమవుతన్నాయి. ఏం జరిగిందనే చర్చ ప్రారంభమైంది. అసలు డీఎస్ చేరతారా? లేదా? అనే అనుమానాలు అందరిలో వస్తున్నాయి.

    D Srinivas

    D Srinivas

    అయితే డీఎస్ ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. త్వరలోనే ఆయన పదవీకాలం కూడా పూర్తయ్యే అవకాశాలున్నాయి. దీంతో ఆ పార్టీకి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరే అవకాశాలుండటంతో ఆయన పదవీ కాలం పూర్తయ్యే వరకు ఆగుతారనే ప్రచారం సాగుతోంది. దీంతో ఆయన తన చేరికను వాయిదా వేసుకున్నట్ల తెలుస్తోంది.

    మరోవైపు డీఎస్ కొడుకు అర్వింద్ బీజేపీ ఎంపీగా కొనసాగుతున్న నేపథ్యంలో డీఎస్ కాంగ్రెస్ లో చేరినా పార్టీ కోసం కష్టపడతారా? లేక కుమారుడి కోసం బీజేపీకే మద్దతు ఇస్తారా? అనే విషయంలో తర్జనభర్జన కొనసాగుతోంది. దీంతో డీఎస్ రాకను కొందరు ఆక్షేపిస్తున్నట్లు చెబుతున్నారు. దీంతోనే ఆయన చేరిక ఆలస్యమైందనే వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నాయి.

    Also Read: KCR: టార్గెట్ బీజేపీ.. రైతుబంధుపై కేసీఆర్ క్లారిటీ..

    డీఎస్ కాంగ్రెస్ లో చేరినా ప్రయోజనం మాత్రం లేదనే విషయం కొందరిలో వ్యక్తమవుతోంది. అయితే సోనియాగాంధీ విధేయుడిగా పేరున్న డీఎస్ చేరికను ఎవరు కూడా అడ్డుకోరని తెలుస్తోన్నా ఎందుకో ఆయన సంక్రాంతి తరువాత పార్టీలో చేరడానికి సుముఖత చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో డీఎస్ చేరికపై అందరిలో కూడా వేరువేరుగా అనుమానాలు రేకెత్తుతున్నాయి. డీఎస్ ఏ మేరకు అందరి అనుమానాలు నివృత్తి చేస్తారో వేచి చూడాల్సిందే.

    Also Read: KCR vs Etela: బీజేపీకి భారీ షాక్.. ఈటల వ్యూహానికి చెక్ పెట్టిన కేసీఆర్.. ఎలాగంటే?

    Tags